Raman Singh touches Yogi's feet యోగీ పాదాలకు నమస్కరించిన రమణ్ సింగ్

Raman singh touches yogi s feet before filing papers for assembly polls

chhattisgarh election date 2018, chhattisgarh election 2018, Chhattisgarh Assembly election 2018, chhattisgarh election 2018 survey, chhattisgarh election news, raman singh, yogi adityanath, chattisgarh opinion poll 2018, chhattisgarh election survey

Chief Minister Raman Singh filed his nomination papers from Rajnandgaon Assembly constituency. Singh, 66, touched the feet of Adityanath, who is 20 years younger to him, and took his blessings before filing the nomination papers.

బీజేపి సీఎంకు పాదాభివందనం చేసిన ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి..

Posted: 10/24/2018 12:57 PM IST
Raman singh touches yogi s feet before filing papers for assembly polls

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలసి తన నామినేషన్ పత్రాలను సమర్పించేందుకు వెళ్లిన వేళ.. సరిగ్గా సుముహూర్తం వచ్చిందన్న సమయంలో తన కన్నా 20 ఏళ్ల చిన్నవాడైన తోటి ముఖ్యమంత్రి కాళ్లపై పడి నమస్కరించారు చత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్. ఎవరా ముఖ్యమంత్రి..? హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిన రమణ్ సింగ్ కు ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఇలా ఎందుకు చేశారు. గత మూడు పర్యాయాలుగా గెలుపు బాటనే అస్వాధించిన రమణ్ సింగ్ కు ఈ సారి ఓటమి భయం పట్టుకుందా.? అందుకనే ఆయన ఇలా చేశారా.? అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి.

చత్తీస్ గఢ్ నవంబర్ మాసంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో రాజ్ నంద్ గావ్ నియోజకవర్గం నుంచి రమణ్ సింగ్ నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమానికి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా వెంట వచ్చారు. నామినేషన్ పత్రాలను పూరించి.. సరిగ్గా సమర్పించే వేళ.. ఎన్నికల అధికారి గదిలోనే.. వెంట వచ్చిన పార్టీ ముఖ్యుల సమక్షంలోనే .. రమణ్ సింగ్ అకస్మాత్తుగా యోగి అధిత్యనాథ్ పాదాలను నమస్కరించారు.

గతానికి బిన్నంగా రమణ్ సింగ్ ఇలా చేయడం.. అయనకు హిందూ మతంపై. మతప్రబోధకులపై, సన్యాసులపై ఉన్న భక్తిని, శ్రద్దను తెలియజేస్తున్నా.. చత్తీస్ గఢ్ లో మాత్రం రమణ్ సింగ్ కు ఓటమి భయం పట్టుకుందని, అందుకనే గతానికి భిన్నంగా ఆయన సాధువులు, సన్యాసుల కాళ్లకు పాదాభివందనం చేస్తున్నారన్న గుసగుసలు షికార్లు చేస్తున్నాయి. ఇక ఈ సారి రమణ్ సింగ్ పై.. కాంగ్రెస్ తరఫున వాజ్ పేయి మేనకోడలు కరుణా శుక్లా బరిలోకి దిగనుండటంతో, ఈ పోరు దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chhattisgarh  raman singh  yogi adityanath  nomination  rajanandgaon constituency  politics  

Other Articles