HC adjourns disqualification case, stays floor test హైకోర్టు అదేశాల నేపథ్యంలో కొనసాగుతున్న ఉత్కంఠ

Madras high court adjourns disqualification case stays floor test

Turmoil in Tamil Nadu politics, Tamil Nadu, AIADMK, TTV Dinakaran, Chidambaram, twitter, madras high court, speaker dhanpal, ttv mlas disqualified, ttv dinakaran mlas disqualified, V.Shasikala, J,Jayalalithaa, CM Palaniswamy, pannerselvam, latest news, Tamil Nadu Politics

Declining a stay on the disqualification of 18 rebel AIADMK MLAs, the Madras High Court on Wednesday ordered that no floor test should be held in the assembly till further orders nor can by-elections be held in those assembly constituencies.

హైకోర్టు అదేశాల నేపథ్యంలో కొనసాగుతున్న ఉత్కంఠ

Posted: 09/20/2017 04:51 PM IST
Madras high court adjourns disqualification case stays floor test

తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠకరంగా మారుతున్నాయి. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత వరుసగా రెండో పర్యాయం గెలిచి, అనారోగ్యం బారినపడి మరణించిన తరువాత.. అధికార పార్టీలో అనేక చీలికలు వచ్చి.. రోజుకో మలుపు తిరుగుతూ.. శరవేగంగా మార్పులు సంతరించుకున్న అరవ రాజకీయాలు చివరకు మద్రాసు హైకోర్టు నిర్ణయం మేరకు అధారపడి వున్నాయి. పళనిస్వామి, పన్నీరు సెల్వం వర్గాలు కలసిన తరువాత టీటీవీ దినకరన్ వర్గంగా విడిపోయిన 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ ధన్ పాల్ అనర్హత వేటువేయడంతో చివరకు పంచాయితీ తమిళనాడు రాష్ట్రోన్నత న్యాయస్థానం మద్రాసు హైకోర్టుకు చేరింది.

టిటీవీ దినకరణ్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం సహజ సూత్రాలకు విరుద్దమని వారి తరపున ప్రముఖ న్యాయవాదులు కపిల్ సిబల్,  దుష్యంత్‌ దవే వాదించారు. న్యాయస్థానంలో ఎమ్మెల్యేల తరపున తొలుత వాదనలు వినిపించిన ఆయన.. ‘18మంది ఎమ్మెల్యేలపై వేటు వేస్తు స్పీకర్‌ తీసుకున్న నిర్ణయం సహజ న్యాయానికి విరుద్థం. పార్టీకి విరుద్ధంగా ఎమ్మెల్యేలు ఏం చేయలేదు. వాళ్లు నాయకుడిని మాత్రమే మార్చాలని కోరారు. వారు వేరే పార్టీలోకి వెళ్లలేదు.. దీని ప్రకారం వారి చర్య పార్టీ ఫిరాయింపు పరిధిలోకి రాదని దవే వాదించారు.

గవర్నర్ కు వారిచ్చిన లేఖలో కూడా అవినీతిపరుడైన పళనిస్వామిని ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపాలనే కోరారన్నారు. ఆ పద్దెనిమంది ఎమ్మెల్యేలకు కనీసం సమయం కూడా ఇవ్వకుండా వెనువెంటనే చర్యలు తీసుకుంటూ.. మూడు వారాల్లో త్వరత్వరగా మొత్తం కానిచ్చి.. చివరికి వారిపై అనర్హత వేటు వేశారని దుష్యంత్ దవే ఆరోపించారు. ప్రభుత్వ తరుపు న్యాయవాది ఆర్యమన్‌ సుందరం. వాదనలు చేస్తూ స్పీకర్‌ నిర్ణయం సరైనదే అన్నారు. చట్టప్రకారమే ఆయన వ్యవహరించారని తెలిపారు.

కాగా దినకరణ్ వర్గం ఎమ్మెల్యేల అనర్హత విచారణపై స్టే ను విధించని న్యాయస్థానం.. ఈ విషయంలో తాము తీర్పు చెప్పేవరకు తమకు తెలియకుండా ఈ సీట్లు ఖాళీగా వున్నట్లు ప్రకటించడం.. లేదా ఆయా స్థానాలకు ఉప ఎన్నికలను ప్రకటించడం చేయరాదని తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబరు 4కి వాయిదా వేసింది.

ఇక పళనిస్వామి ప్రభుత్వానికి బలం లేదని ఆయన వెంటనే తన బలాన్ని నిరూపించుకోవాలని డీఎంకే పార్టీ సీనియర్ నేత స్టాలిన్ వేసిన పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం.. తాను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు బలపరీక్ష నిర్వహించవద్దని గతంతో తానిచ్చిన అదేశాలు అమల్లో వుంటాయని జస్టిస్ ఎం దురయ్ స్వామి అదేశాలను జారీ చేశారు. దీంతో అరవ రాజకీయాలపై ఉత్కంఠ వచ్చే నెల నాలుగు వరకు కొనసాగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles