అమిత్ షాకు డింపుల్ యాదవ్ తాజా కౌంటర్.. Dimple Yadav comes up with new 'Kasab' acronym

Dimple yadav gives it back to amit shah coins new kasab acronym

dimple yadav kasab, dimple kasab acronym, dimple yadav kasab acronym, up polls, uttar pradesh election 2017, dimple yadav hits pm modi, narendra modi, akhilesh yadav, sp, bjp, dimple vs modi, dimple yadav news, pm modi news

Akhilesh bhaiyya says 'Ka' (in Hindi) stands for Computer, 'Sa' stands for smartphone, 'B' stands for 'bachche' (children)," Dimple, wife of CM Akhilesh Yadav, said at an election rally.

కసబ్ పదానికి డింఫుల్ యాదవ్ కొత్త నిర్వచనం..!

Posted: 02/26/2017 05:21 PM IST
Dimple yadav gives it back to amit shah coins new kasab acronym

ఉగ్రవాది కసాయి కసబ్‌ చనిపోయి చాలా రోజులవుతున్నా ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల పుణ్యానా, నేతల దయవల్ల మరోసారి అతడిపేరు విరివిగా వినిపిస్తోంది. జనాలకు చిరాకు వచ్చే స్థాయిలో కసబ్‌ పేరును తలుస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా నోట వచ్చిన ఈ మాటను ఒక నేత తర్వాత మరో నేత మోస్తూనే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలపై దాడి చేసేందుకు అమిత్‌షా ఈ మాటను ఉపయోగించగా ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా తిరిగి బీజేపీపై దాడి చేసేందుకు అదే పేరును తలుస్తూ దానికి కొత్త అర్థాన్ని, నిర్వచనాలను, విస్తృతిని కల్పిస్తున్నాయి.

తాజాగా, కసబ్‌ అనే పేరుకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ కొత్త నిర్వచనం చెప్పారు. కసబ్‌ అనే పేరులో క అంటే హిందీలో కంప్యూటర్‌ అని, స అంటే స్మార్ట్‌ ఫోన్‌ అని, ఇక బీ అంటే బచ్చే (చిన్నారులు) అని ఆమె కొత్త అర్ధం చెప్పారు. ఈ రోజుల్లో కంప్యూటర్‌ లేకుండా ఉండలేమని, ఇక స్మార్ట్‌ఫోన్‌తో ప్రభుత్వ విధానాలన్నీ కూడా తెలుసుకోవచ్చని, పిల్లల సంరక్షణే తమ ధ్యేయంగా ముందుకెళతామని వివరించారు. అమిత్‌ షా చెప్పినంత చెడు అర్థం తమకు వర్తించదని ఆమె ఎదురుదాడికి దిగారు.

తొలుత కసబ్‌ అనే పేరులో క అంటే కాంగ్రెస్‌ అని, స అంటే సమాజ్‌వాది పార్టీ అని బీ అంటే బీ అంటే బీఎస్పీ అని, ఈ కసబ్‌ పీడ త్వరలోనే వదులుతుందంటూ అమిత్‌షా విమర్శించగా ఆ సమయంలో స్పందించిన అఖిలేశ్‌ కా అంటే పావురం అని చెప్పారు. ఇక మాయావతి అయితే, అమిత్‌షా అయితే కసబ్‌ను మించినవారని, అసలు అమిత్‌ షా ఒక టెర్రిరిస్టు అని తీవ్రంగా ఆరోపించారు. ఇలా, కసబ్‌ పేరుతో పెద్ద దుమారం రేపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dimple yadav  kasab  uttar pradesh election 2017  pm modi  akhilesh yadav  sp  bjp  politics  

Other Articles