This will give you goosebumps - CRPF jawan brutally attacked by mob in Kashmir

Crpf jawan brutally beaten up by mob in kashmir

CRPF, Jammu and Kashmir, AFSPA, CRPF jawan, Kashmir issue, crpf conistable, viral video, shocking video, mob brutally attack on CRPF jawan, mob attack CRPF jawan, mob attack, CRPF jawan kashmir,

A shocking video of brutality on CRPF soldier is going viral on various social media platforms. The video allegedly shows a huge mob brutally attacking a CRPF jawan in Kashmir.

ITEMVIDEOS: షాకింగ్ వీడియో.. కానిస్టేబుల్ పై స్థానికుల దాడి..

Posted: 04/12/2016 01:49 PM IST
Crpf jawan brutally beaten up by mob in kashmir

జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని తలపించే దృశ్యాలు తాజాగా ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి, మానవత్వాన్ని మరచి ఒక సీఆర్పీఎఫ్ జవాన్‌ను వెంటాడి మరీ దాడిచేసిన దృశ్యాలు నెట్టింట్లో సంచలనం చేస్తున్నాయి. విధులను నిర్వహిస్తున్న ఓ సాయుధుడైన కానిస్టేబుల్ పై వెంటాడుతూ దాడులకు తెగబడి షాకింగ్ వీడియో ఒకటి నెట్ లో చక్కర్లు కొడుతోంది. కశ్మీర్ అల్లర్లలో సాయుధుడైన సీఆర్ పీఎఫ్ జవాన్‌ను కొందరు చుట్టుముట్టారు. చివరికి తప్పించుకొని పోతున్న ఆ జవాన్ను వెంటాడి అమానుషంగా సామూహికంగా దాడిచేశారు. '

వారి నుంచి తప్పించుకునే క్రమంలో కానిస్టేబుల్ బిగ్గరగా అరుస్తూ పరుగెడుతున్నా.. వెనుకగా వచ్చిన ఓ వ్యక్తి అతనిపై ఎగరి దూకడంతో కానిస్టేబుల్ కిందపడ్డాడు, లేచి మళ్లీ పరుగు అందుకున్నామనుకున్న కానిస్టేబుల్పై మరోమారు అదే వ్యక్తి దాడి చేశాడు, అంతే వెనువెంటనే అక్కడికిః పరుగెత్తుకుంటూ వచ్చిన మరికోందరు కానిస్టేబుల్ పై మూకుమ్మడి దాడికి దిగారు, దెబ్బలకు తాళలేక కానిస్టేబుల్ బిగ్గరగా అరుస్తున్నా.. వారు వినిపించుకోలేదు, కనీసం కనుకరించలేదు. అతనిపై పిడిగుద్దులతో తెగబడ్డారు,

ది ఇల్లాజికల్ ఇండియన్'  పేరుతో శనివారం పోస్ట్ అయిన ఈ వీడియో నెట్టింట్లో సంచలనంగా మారింది, రెండు రోజుల వ్యవధిలనే ఈ వీడియోను 69 వేల మంది వీక్షించారు, ఇక ఈ వార్త ప్రసార మాద్యమాలకు అందడంతో అవి కూడా ఈ వీడియోను పదే పదే ప్రసారం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఎపుడు, ఎక్కడ అనే పూర్తి వివరాలు తెలియని ఈ  వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో జోరుగా షేర్ అవుతోంది. మరోవైపు  ఈ సంచలన వీడియో పై అటు పోలీస్ వర్గాలనుంచిగానీ, ఇటు  అధికారుల నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CRPF jawan  Kashmir issue  crpf conistable  viral video  shocking video  

Other Articles