Asaram declared he will soon walk free just like Salman.

Asaram declared he will soon walk free just like salman

Asaram Bapu, Salman Khan, salman Khan in Hit and Run case, Asaram Bapu in Rape case

Asaram Bapu declared he will be the next to be acquitted after Salman. Asaram declared he will soon walk free just like Salman. Asaram claims he is innocent like Salman. Asaram has been in jail in Jodhpur for the past 26 months. He was convicted after being accused of molesting a minor at his Ashram. He made the statement as he crossed a parallel between his case and Salman's case. He was not only accused of sexual assault but also rape and molestation.He has been trying to gather his supporters and assured his supporters pan India that he will be out sooner than later.

సల్మాన్ ఖాన్ లాగా ఆసారాం బాపు కూడా బయటకు..?

Posted: 12/12/2015 10:48 AM IST
Asaram declared he will soon walk free just like salman

ఆసారాం బాపు.. ఆధ్యాత్మిక ముసుగులో అనైతిక చర్యలు పాల్పడిన ఓ వ్యక్తి. అయితే ఓ మైనర్ అమ్మాయిని లైంగికంగా వేధించడంతో పాటు, తన శిష్యురాలిని రేప్ చేసిన ఘటనలొ ఆసారాం బాపు ప్రస్తుతం జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే 2002లో హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామాల మధ్య చివరకు నిర్దోషిగా బయటకు వచ్చిన సల్మాన్ ఖాన్ లాగే తాను కూడా నిర్దోషిగా, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తానని ఆసారాం బాపు చెప్పడం నిజంగా విడ్డూరంగా అనిపిస్తోంది. కోర్ట్ ఇచ్చిన తీర్పుతో సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్ మీద తీవ్ర విమర్శలు గుప్పించారు నెటిజన్లు.

దేశంలో ఎంతో ఆసక్తిని రేపిన సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో ప్రాసిక్యూటర్ ఎలాంటి ఆధారాలను చూపించలేని కారణంగా.... అంతకు ముందు చెప్పిన కారణాలు సహేతుకంగా లేనందు వల్ల కేసులో సల్మాన్ ఖాన్ ను నిర్దోషిగా కోర్ట్ నిర్ధారించింది. దాంతో పదమూడు సంవత్సరాలుగా కోర్ట్ కేసులో చిక్కుకున్న సల్మాన్ కు విడుదల లభించింది. అయితే నక్కను చూసి కుక్క వాత పెట్టుకున్నట్లు.. సల్మాన్ ఖాన్ లాగా తాను కూడా రేప్ కేసుతొ సహా అన్నింటిని నుండి త్వరలోనే కడిగిన ముత్యంలాగా బయటకు వస్తానని వ్యాఖ్యానించడం విశేషం. ఏది ఏమైనా ఆసారాం నిజంగా బయటకు వస్తారేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles