Separate election schedule if telnagana appointment day announced

Separate election schedule if Telnagana appointment day announced, Election commission of India, Separate Telangana State, Telangana Appointment Day, Telangana Bill with President

Separate election schedule if Telnagana appointment day announced

తెలంగాణా ఏర్పాటైతే ఎన్నికలకు ప్రత్యేకమైన షెడ్యూల్

Posted: 02/23/2014 09:32 AM IST
Separate election schedule if telnagana appointment day announced

తెలంగాణా అప్పాయింట్ మెంట్ డే గెజిట్ లో ప్రచురించినట్లయితే లోక్ సభ, శాసన సభ ఎన్నికలకు ప్రత్యేకమమైన షెడ్యూల్ తయారవుతుందని ఎన్నికల కమిషన్ తెలియజేసింది.

వచ్చే వారంలో ఎన్నికల కమిషన్ ప్రకటించబోతున్న ఎన్నికల షెడ్యూల్ లో ఏప్రిల్ మే నెలల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలలో ఎన్నికలు చోటుచేసుకుంటున్నాయి.  ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం తెలంగాణా కూడా మిళితమైవుంది.  అయితే ఈ లోపులో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం తరఫునుంచి గెజిట్ లో ప్రకటన జరిగినట్లయితే దానికి అనుగుణంగా షెడ్యూల్ లో మార్పులు చేస్తామని ఎన్నికల్ కమిషన్ తెలియజేసింది.

జూన్ 2 కల్లా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఐదు సంవత్సరాల కాలం పూర్తవుతుంది.

పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కోసం వేచి చూస్తోంది.  ఆ పని కూడా పూర్తవగానే కేంద్ర ప్రభుత్వం తెలంగాణా అప్పాయింట్ మెంట్ డే నిర్ణయించి ప్రకటించగానే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు జరిగినట్లుగా భావించటమౌతుంది.  ఐతే ఈ విషయం కేంద్ర ప్రభుత్వ గెజిట్ లో కూడా ప్రచురించిన తర్వతనే దాన్ని అధికారికంగా తీసుకోవటం జరుగుతుంది కాబట్టి ఎన్నికల కమిషన్ తన షెడ్యూల్ పూర్తి చేసే లోపు ఆ పని జరిగితేనే రెండు రాష్ట్రాలకు ప్రత్యేక ఎన్నికలకు ఏర్పాట్లు, తదనుగుణంగా షెడ్యూల్ ప్రకటన ఉంటుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles