Mp sabbam hari fire on minister chiranjeevi

sabbam hari fire on minister chiranjeevi, sabbam hari vs chiranjeevi, sabbam fire on chiranjeevi, telangana state, seemandhra movement, congress party, ysrcp leader sabbam hari,

mp sabbam hari fire on minister chiranjeevi

మంత్రి చిరంజీవిపై ఫైర్: రాజీనామా

Posted: 08/03/2013 05:45 PM IST
Mp sabbam hari fire on minister chiranjeevi

రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైయస్ జగన్ వెంట నడుస్తున్న కాంగ్రెసు అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు ఆయన తెలిపారు. రెండు, మూడు రోజుల్లో సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటానని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి చిరంజీవిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనపై కమిటీ చెప్పిన మాటలు వినాలని చిరంజీవి సూచించడాన్ని ఆయన వ్యతిరేకించారు. "నీ టూరిజం ఏదో చూసుకో, నీ సినిమాలు ఏవో చూసుకో, నీ ఇష్టం వచ్చినట్లు నడుచుకో, కానీ కమిటీ చెప్పినట్లు వినాలని సూచించవద్దు" అని ఆయన చిరంజీవిని ఉద్దేశించి అన్నారు. ప్రజల ఆగ్రహానికి దహనమైపోతారని ఆయన హెచ్చరించారు. హై పవర్ కమిటీ పేరు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, దాన్ని నమ్మవద్దని సబ్బం హరి కేంద్ర సీమాంధ్ర మంత్రులకు సూచించారు. ముందు సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పార్టీ అధిష్టానానికి సూచించాలని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న తర్వాత ఏ కమిటీ ముందైనా కూర్చోవాలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టడానికి చేసిన ప్రక్రియ ప్రజాస్వామ్య విరుద్ధంగా జరిగిందని, ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వాన్ని పాటించారని ఆయన వ్యాఖ్యానించారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more