The Beauty And Health Benefits Of Grape Juices | Grape Remedies | Health Home Remedies

Grape juice health beauty benefits home remedies skincare tips

grape juice benefits, grape juice remedies, grape juice health, grape juice beauty benefits, health tips, grape juice home remedies, health remedies, home remedies for skin, skincare tips, skin beauty tips, skin home remedies

Grape Juice Health Beauty Benefits Home Remedies Skincare Tips : The Beauty And Health Benefits Of Grape Juices Which Contains Anti Alzheimer Elements.

ద్రాక్షరసం తాగండి.. ఆరోగ్యంగా వుండండి..

Posted: 09/09/2015 11:28 AM IST
Grape juice health beauty benefits home remedies skincare tips

ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హెల్దీ ఫ్రూట్స్ లో ద్రాక్షపండు ఒకటి. ఇందులో వుండే పోషకాలు రకరకాల వ్యాధుల నుంచి పోరాడి.. నిత్యం ఆరోగ్యంగా వుండేందుకు ప్రేరేపిస్తాయి. దీనిని పండు రూపంలో కంటే జ్యూస్ గా తీసుకుంటే మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఈ ద్రాక్షరసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతోపాటు అందాన్ని మెరుగుపరుస్తుంది కూడా. అందం విషయం పక్కనపెడితే.. ద్రాక్షపండ్లలో అల్జీమర్స్‌ను నయం చేసే లక్షణాలున్నాయి. ఇవి శరీరంలోని కొవ్వును యూరిన్ ద్వారా వెలివేయడంతోపాటు యూరిక్ ఆమ్లాన్ని కూడా తొలగిస్తుందని నిపుణులు అంటున్నారు. ద్రాక్ష రసాన్ని తీసుకోవడం ద్వారా రక్తాన్ని శుద్ధీకరిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇందులో ఐరన్ అనారోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది. శరీరానికి తేమనిస్తుంది. కంటికి మేలు చేస్తుంది. మారుతున్న కాలంతోపాటు వచ్చే చిరుజబ్బుల్ని నయం చేయడంలోనూ ఈ ద్రాక్షరసం సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే.. కడుపుకు సంబంధించిన వ్యాధలను నయం చేస్తుంది. శరీర బరువును అదుపులోకి వుంచుతుంది. నిత్యం దీనిని తాగితే.. ఇది ఎక్కువ ఆకలి కానివ్వకుండా చేస్తుంది. అందుకే.. ప్రతిరోజూ కనీసం ఒక గ్లాస్ గ్రేప్ జ్యూస్ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక ఈ ద్రాక్షరసం వల్ల కలిగే సౌందర్య ప్రయోజనాల విషయానికొస్తే.. ఇది కంటి కింద నల్లని వలయాలకు చెక్  పెడుతుంది. ద్రాక్ష పండ్లను కట్ చేసి ఆ రసాన్ని కంటి కింద నల్లటి వలయాలపై రాస్తే ఫలితం ఉంటుంది. ఒక స్పూన్ ద్రాక్ష రసంతోపాటు ఒక స్పూన్ గుడ్డులోని తెల్లసొనను కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్‌లో వేసుకుని పది నిమిషాల తర్వాత చల్లటి నీటిలో కడిగేస్తే చర్మం పొడిబారదు. చర్మానికి నిగారింపు సంతరించుకుంటుంది. గ్రేప్ తొక్కలను ముఖానికి మాస్క్‌లా వేసుకోవడం ద్వారా చర్మాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ఇందులో యాంటీయాక్సిడెంట్లు చర్మానికి క్లెన్సర్‌లా ఉపయోగపడుతాయి. చర్మానికి కొత్త కాంతిని ఇస్తాయి. సన్ టాన్ నుంచి చర్మాన్ని రక్షణ కల్పిస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : grape juice benefits  beauty remedies  skin home remedies  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more