JD Chakravarthy Talks About His Villain Role In Dynamite Movie | Tollywood Updates

Jd chakravarthy villain role dynamite movie tollywood

jd chakravarthy news, jd chakravarthy updates, jd chakravarthy dynamite movie, dynamite movie updates, pranitha dynamite, manchu vishnu dynamite, devakatta dynamite

JD Chakravarthy Villain Role Dynamite Movie Tollywood : JD Chakravarthy Talks About His Villain Role In Dynamite Movie. Director Changed Some Scenes In This Remake Movie Which Impressed Him.

జేడీని ఆశ్చర్యానికి గురిచేసిన ఆ డైరెక్టర్

Posted: 09/04/2015 01:19 PM IST
Jd chakravarthy villain role dynamite movie tollywood

తెలుగు ఇండస్ట్రీలో కథానాయకుడిగా తమకంటూ ప్రత్యేక ముద్ర వేయించుకున్నవారిలో జేడీ చక్రవర్తి ఒకరు. ఒకప్పుడు హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించిన ఈయన.. తన సహజ నటనతో ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. యాక్షన్, థ్రిల్లర్ తరహా చిత్రాల్లోనే ఈయన ఎక్కువగా నటించేవారు. అయితే.. కాలక్రమంలో జూనియర్ల హవా ఎక్కువగా పెరిగిపోవడంతో ఈయన కాస్త వెనుకడుగు వేశారు. అయితే.. ఇప్పుడు ఆయన ఓ బలమైన పాత్రతో మళ్లీ వెండితెరపై కనువిందు చేశారు.

మంచు విష్ణు హీరోగా దేవాకట్టా దర్శకత్వంలో ‘డైనమైట్’ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో చాలాకాలం తర్వాత జేడీ చక్రవర్తి నటించారు.. అది కూడా విలన్ గా నటించి అందరికీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇక ఈ సినిమా తమిళ్లో ఘనవిజయం సాధించిన ‘అరిమనంబి’ చిత్రానికి రీమేక్ అన్న విషయం తెలిసిందే! ఈ తమిళ్ సినిమాలోనూ జేడీ చక్రవర్తి విలన్ గా నటించారు. అదే పాత్రను ‘డైనమైట్’లోనూ పోషించారు. ఈ సినిమాను తెలుగు రీమేక్ చేస్తున్నామని, అందులోనూ విలన్ పాత్రలో నటించాల్సిందిగా జేడీని దర్శకుడు కోరితే.. అందులో కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించాడట.

జేడీ అభిప్రాయాన్ని విన్న అనంతరం దర్శకుడు దేవా తనదైన శైలిలో కొన్ని మార్పులు చేశాడట. ఆ మార్పులు చూసిన తనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందనీ.. అందుకే తెలుగులోనూ విలన్ పాత్రలో నటించడానికి అంగీకరించానని జేడీ స్పష్టం చేశాడు. ఈ విలన్ పాత్ర చాలా ప్రత్యేకంగానూ, ప్రేక్షకులను ఆకట్టుకునేలా వుండటంతో తనకు ఆనందం కలిగించినట్లు ఆయన చెప్పాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకోగా.. జేడీకి కూడా మంచి మార్కులే పడ్డాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jd chakravarthy  dynamite movie  deva katta  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more