Prakash Raj Bags Challenging Role in Jolly LLB Tamil Remake Film | Kollywood News

Prakash raj bags special role jolly llb tamil remake film

prakash raj, prakash raj news, prakash raj latest updates, prakash raj gallery, prakash raj new movie, jolly llb tamil remake, jolly llb movie, udhayanidhi stallin, harshad warsi, boman irani news

Prakash Raj Bags Special Role Jolly LLB Tamil Remake Film : Actor Prakash Raj Bags a challenging Role in Jolly LLB Tamil Remake Film. He is doing Hindi Version's Boman Irani role in this Tamil Flick.

మరో ఛాలెంజింగ్ పాత్రలో ప్రకాష్ రాజ్

Posted: 06/18/2015 01:31 PM IST
Prakash raj bags special role jolly llb tamil remake film

ఇండస్ట్రీలో ఎంతమంది ఆర్టిస్టులు వున్నప్పటికీ.. కొన్ని పాత్రలకు కొందరు మాత్రమే అతికినట్లు సరిపోతారు. అలాంటి వారిలో ప్రకాష్ రాజ్ ఒకరు! ఒక విలన్ గా, హీరోగా, తండ్రిగా, నాన్నగా, తాతయ్యగా.. ఇలా అన్ని పాత్రల్లో ఒదిగిపోయి ప్రేక్షకుల ఆదరణ పొందిన నటుడు. అందుకే.. ఈయనకు కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ నుంచి సైతం అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. తగిన పాత్రకు ఈయన వుంటేనే సరిపోతారనే ఉద్దేశంతో దర్శకనిర్మాతలు పరుగున ఈయన దగ్గరకు చేరుకుంటారు. ఈ తరహాలోనే తాజాగా సరికొత్త పాత్రలో నటించే ఓ ఆఫర్ ఈయనకు వరించింది. ఆ పాత్రకు ఈయనే కరెక్ట్ అంటూ సదరు దర్శకనిర్మాతలు ఈయన్నే ఎంచుకోవడం జరిగింది.

ఆమధ్య బాలీవుడ్ బొమన్ ఇరానీ, హర్షద్ వార్షీ ముఖ్య పాత్రధారులుగా ‘జాలీ ఎల్.ఎల్.బి’ చిత్రం వచ్చింది. ఆ సినిమా మంచి ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంది! అతి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఆ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది కూడా! ఇప్పుడు ఈ సినిమాని తమిళంలోకి రీమేక్ చేస్తున్నారు. అహ్మద్ దర్శకత్వం వహించనున్న ఈ తమిళ రీమేక్ లో బొమన్ ఇరానీ పాత్రకు ప్రకాష్ రాజ్ ని ఎంచుకున్నారు. ఆ పాత్రలో ప్రకాష్ రాజ్ అతికినట్టుగా సరిపోతారనే ఉద్దేశంతో దర్శకనిర్మాతలు ఆయన్ను ఎంచుకున్నారు. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ కూడా ట్వీట్ చేశాడు. ఇక హర్షద్ పాత్రను ఉదయనిధి స్టాలిన్ పోషించనున్నాడు.

ఇప్పటికే ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన ప్రకాష్ రాజ్.. ఈ చిత్రంలోనూ తన పాత్ర చాలా బాగా వచ్చేందుకు ప్రయత్నిస్తానని పేర్కొంటున్నాడు. ఈ చిత్రంల తనకు ఇంత ఈ ఆఫర్ దక్కడం చాలా సంతోషంగా వుందని చెప్పినట్లుగా సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరి.. బాలీవుడ్ లో మంచి విజయం సాధించిన ఈ చిత్రం.. తమిళంలో ఏ మేర లాభాల పంట పండిస్తుందో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prakash raj  jolly llb tamil remake  boman irani  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more