చిన్నసినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో ఆర్య.. అనతికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల ఆదరణను పొందాడు. పెద్ద హీరోల జాబితాలో తన పేరును లిఖించుకున్నాడు. ఇలా స్టార్ హీరోగా ఎదిగిన ఈ నటుడు.. ఇప్పుడు సాహసయాత్రలో సమరం చేసేందుకు సన్నద్ధం అవుతున్నాడు. ఇంతకీ ఆ సాయసయాత్ర ఏంటని ఆలోచిస్తున్నారా? ఆ విషయం తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!
సాధారణంగా ఇండస్ట్రీలో వుండే ప్రతిఒక్కరికీ తమకంటూ ఏదో ఒక హాబీ ఖచ్చితంగా వుంటుంది. అంటే.. క్రీడల్లో పాల్గొనడం, సాహసయాత్రలు చేయడం, టూర్లకు వెళ్లడం, ఇంకా రకరకాల అలవాట్లు వుంటాయి. షూటింగ్ లేని సమయంలో వాళ్లు వాటిని ఆస్వాదిస్తూ వుంటారు. అలాగే తమిళ హీరో ఆర్యాకు సైక్లింగ్ అంటే ఎంతో సరదా! ఏమాత్రం ఖాళీ దొరికినా.. సైకిల్ తొక్కుతూ కాలం గడిపేస్తాడు. ఒక్కోసారి చెన్నయ్ లో షూటింగులకు సైకిల్ మీద వెళ్లిన సందర్భాలు కూడా వున్నాయి. ఇలా సైక్లింగ్ ని తన హాబీగా మార్చేసుకున్న ఈ నటుడు.. ఇప్పుడు దానిని మరింత పదును పెట్టేందుకు సైక్లింగ్ పోటీల్లో పాల్గొంటున్నాడని సమాచారం!
స్వీడన్ లో ప్రతిఏడాది సైక్లింగ్ ఈవెంట్ ని నిర్వహిస్తారు. ఈ వార్సిక ఈవెంట్ లో హీరో ఆర్య కూడా పాల్గొంటున్నాడు. ఇందుకోసం ప్రస్తుతం చాలా ప్రాక్టీస్ చేస్తున్నాడు కూడా! ఈ నేపథ్యంలోనే ఆర్య మాట్లాడుతూ.. ‘స్వీడన్ లోని మోటాలా అనే ఊర్లో ఈ సైక్లింగ్ ఈవెంట్ జరుగుతుంది. పర్వతాలు, సరస్సుల తీరం వెంబడి 300 కిలోమీటర్ల దూరాన్ని 15 గంటల్లో చేరుకోవాలి. ఓపక్క ఎదురుగాలులు, ఈదురుగాలులు వీస్తుంటాయి. వాటిని అధిగమిస్తూ సైక్లింగ్ చేయడం ఓ సాహసం’ అని అంటున్నాడు.
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more