Mahesh babu koratala siva shruti hassan latest movie updates

mahesh babu latest news, mahesh babu movie updates, mahesh babu srimanthudu movie, mahesh babu shruti hassan, mahesh babu koratala siva movie, mahesh babu photos, mahesh babu srimanthudu news, mahesh babu latest movie, shruti hassan latest news

mahesh babu koratala siva shruti hassan latest movie updates : mahesh babu koratala shiva combo movie shooting running in hyderabad. The traders are thinking that this movie shooting will complete in summer holidays and the movie team will release this in summer end season.

మహేష్ బాబు

Posted: 01/21/2015 05:17 PM IST
Mahesh babu koratala siva shruti hassan latest movie updates

‘ఆగడు’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడిన నేపథ్యంలో ప్రిన్స్ మహేష్ బాబు తన తదుపరి చిత్రంపై చాలా జాగ్రత్తలు పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రిన్స్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే! ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రంలో మహేష్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీత సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ పరిశీలినలో వుంది.

నిజానికి ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ ముగించుకోవాల్సి వుండేది. ‘ఆగడు’ చిత్రం షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో శివ, మహేష్ తమ తదుపరి చిత్రానికి కమిట్ అయ్యారు. అయితే ‘ఆగడు’ డిజాస్టర్’గా నిలవడంతో మహేష్ కాస్త గ్యాప్ తీసుకున్నాడు. అంతేకాదు.. శివ సమకూర్చిన కథలో కాస్త మెరుగులు కూడా దిద్దించాడని సమాచారం! ఇదివరకు చిత్రాలకంటే కాస్త భిన్నంగా వుండే విధంగా మహీ కథను రాయించినట్లు తెలుస్తోంది. తన పాత్ర మేరకే కాకుండా ఇతర ప్రధాన పాత్రలకు సంబంధించి కొద్ది మార్పులు చేసినట్లు ఇండస్ట్రీ టాక్! ఈసారైనా మంచి విజయాన్ని సాధించాలనే ఆశతో మహీ గత పొరపాట్లు మళ్లీ దొర్లకుండా వుండేలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడట!

ఇకపోతే.. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్’లో జరుగుతోంది. ఇప్పటికే చాలా సమయం ఈ మూవీపై వెచ్చించడంతో త్వరగా ముగించేయాలన్న ఉద్దేశంతో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు సమాచారం! వేసవి ప్రారంభ సమయానికి షూటింగ్ ముగించేసి, వేసవి చివర్లో విడుదల చేసేలా దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ‘మిర్చి’లాంటి భారీ విజయాన్ని అందిస్తూ దర్శకుడిగా పరిచయమైన కొరటాల శివ.. అదే తరహాలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడని అభిమానులు కోరుకుంటున్నారు. మైత్రి మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని యలమంచిలి రవి శంకర్, మోహన్, ఎర్నేని నవీన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more