ముట్టుకుంటే మాసిపోతుందా అన్నట్టుండే రూపం... కాస్త గట్టిగా మాట్లాడితే ఉలిక్కిపడుతుందేమో అన్నట్టు అమాయకంగా ఉండే ముఖం... ఈ రెండూ తెలుగు ప్రేక్షకులు ఆమెను అభిమానించేలా చేస్తే... సహజసిద్ధమైన నటన వారిని ఆమెకు అభిమానుల్ని చేసింది. చక్రవాకం ‘వెన్నెల’గా, మొగలిరేకులు ‘కీర్తన’గా వెండితెరపై తనదైన ముద్ర వేసిన ఆ నటి మేధ. ప్రస్తుతం అపరంజి, అన్నాచెల్లెలు సీరియల్స్‌తో మరోసారి తన ప్రతిభను చాటుతోన్న మేధ మనసువిప్పి చెప్పిన ముచ్చట్లు...
మీ బ్యాగ్రౌండ్?
నా మాతృభాష పంజాబీ. నేను అమృత్‌సర్‌లో పుట్టాను. కానీ ఇరవయ్యేళ్ల క్రితమే మేం హైదరాబాద్ వచ్చి సెటిలయ్యాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో గ్రాడ్యుయేషన్ చేశాను.
నటిగా మారిన వైనం...?
మోడలింగ్, నటనా రంగాలపై మొదట్నుంచీ ఆసక్తి ఎక్కువే. అందుకే మొదట మోడలింగ్‌లో అడుగుపెట్టాను. ఆ ఫీల్డ్‌లో ఆరేళ్ల అనుభవం ఉంది. దాదాపు నూట యాభై యాడ్స్ చేశాను. ఆ తర్వాత నటిగా మారాను.
సీరియల్స్ వైపు అడుగులు?
మొదట ‘చక్రవాకం’లో అందం, అమాయకత్వం కలగలసిన ‘వెన్నెల’ పాత్ర. ఆ సీరియల్ తెచ్చిన పేరు అంతా ఇంతా కాదు. ఆ తర్వాత ‘మొగలి రేకులు’లో కీర్తన పాత్ర నన్ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ఇప్పుడు అన్నాచెల్లెలు, అపరంజిలో కూడా మంచి పాత్రలు.
‘మొగలి రేకులు’లో సడెన్‌గా మాయమయ్యారేం...?
అప్పుడు నేను గర్భవతిని. కాస్త బ్రేక్ తీసుకుంటే మంచిదనుకున్నాను. అందుకే కొన్నాళ్లు నటనకు దూరంగా ఉన్నాను. బాబుకు రెండో యేడు వచ్చాక ‘అపరంజి’, ‘అన్నాచెల్లెలు’ ద్వారా పునఃప్రవేశం చేశాను.
సంతృప్తినిచ్చిన పాత్రలు?
నాకు చెప్పలేనంత క్రేజ్ తెచ్చిన ‘వెన్నెల’, ‘అజరంజి’లో అలీషా పాత్రలు.
నటి అయినందుకు సంతోషపడిన సందర్భం...?
ఓసారి అమెరికాలో స్థిరపడ్డ తెలుగువాళ్ల అమ్మాయి (13) షూటింగ్ చూడటానికి వచ్చింది. పదమూడేళ్లుంటాయి తనకి. నన్ను చూడగానే ఎంత ఎగ్జయిట్ అయ్యిందంటే... నన్ను ముట్టుకుని చూసి, ‘వెన్నెల నిజంగానే నా ముందు ఉంది’ అంటూ సంబరపడిపోయింది. నటీ నటులపై ప్రేక్షకులకు ఎంత అభిమానం ఉంటుందో తెలిపిన ఆ సంఘటనని ఎప్పటికీ మర్చిపోలేను.
నటనలో రోల్‌మోడల్ ఎవరు?
మాధురీ దీక్షిత్, కాజోల్ నటన ఇష్టం. ఇక ఆమిర్‌ఖాన్ గురించి చెప్పక్కర్లేదు. నటనా వాస్తవమా అన్నంత సహజంగా పాత్రల్ని పండిస్తారు వీళ్లు.
నటిగా మీలో మీకు నచ్చేది/నచ్చేది?
ఏదైనా ఒక్కసారి చెప్పగానే అర్థం చేసుకుంటాను. దానివల్ల సీన్ ఏమిటన్నది గ్రహించడానికి పెద్ద సమయం పట్టదు. అయితే తెలుగు పూర్తిగా రాకపోవడం వల్ల ఒక్కోసారి డైలాగ్ సరిగ్గా చెప్పలేక ఇబ్బంది పడుతుంటాను.
మీ నటనపై ఇంట్లోవాళ్ల స్పందన?
నా భర్త పేరు సుమిత్. యునెటైడ్ హెల్త్ గ్రూప్‌లో చేస్తారు. ఆయన సాధారణంగా సీరియల్స్ చూడరు... ఏదైనా స్పెషల్ ఎపిసోడ్ ఉందని నేను చెప్తే తప్ప. మా అమ్మ మాత్రం ఎప్పటికప్పుడు తన స్పందనను తెలుపుతూ ఉంటుంది. లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్... ఏవి బాగోకపోయినా ఇలా కాదు, అలా ఉంటే బాగుంటుంది అని సలహా ఇస్తుంది. తను చెప్పినదాన్ని బట్టి మళ్లీ అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాను.
మీ గురించి ఎవరికీ తెలియని విషయాలు...?
నన్ను చూసినవాళ్లెవరైనా నాకసలు కోపమే రాదనుకుంటారు. కానీ నాకు చాలా కోపం వస్తుంది. ఎంత అంటే... ఎదుటివాళ్లు భయపడేంత! అలాగే నేనెవరితోనూ కలవ ననుకుంటారు. మొదట్లో అలా ఉంటాను కానీ కాస్త అలవాటైతే చాలా దగ్గరైపోతాను. చదువుకునే రోజుల్లో మా ఫ్రెండ్స్ ఇంటికొస్తే మా అమ్మ- ‘మా అమ్మాయి ఎవరితోను మాట్లాడదు కదా’ అంది. (నవ్వుతూ) వెంటనే వాళ్లు - ‘మీకలా అనిపిస్తుందా ఆంటీ... తన గురించి మమ్మల్నడగండి చెబుతాం’ అన్నారు.
నటి కాకపోయుంటే...?
సింగర్ అయ్యుండేదాన్ని. అసలు అదే నా కోరిక. సంగీతం కూడా నేర్చుకున్నాను. ఓ హిందీ ఆల్బమ్‌లో పాడాను. కానీ కొన్ని కారణాల వల్ల అది విడుదల కాలేదు. తర్వాత మిగిలిన విషయాల్లో బిజీ అయిపోయి దానిమీద దృష్టి పెట్టలేదు.
ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది?
సైకాలజీ అంటే నాకు చాలా ఇష్టం. అందులో డిగ్రీ చేయాలనుకున్నాను కానీ కుదరలేదు. కనీసం భవిష్యత్తులోనైనా ఆ కోరిక తీర్చుకోవాలి.
మేధ పుట్టినరోజు : సెప్టెంబర్ 15
నచ్చే రంగులు : నీలం, గులాబీ
నచ్చే దుస్తులు : జీన్స్, టాప్స్
నచ్చే ఆహారం : ఉత్తరాది శాకాహారం, చైనీస్
నచ్చిన సినిమాలు : అందాజ్ అప్నా అప్నా, పాకీజా
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more