Smart tips for brain fitness which will reduce pressure

brain fitness tips, tips for brain fitness, brain fitness, brain fitness news, healthy tips, tip of the day, latest telugu news, latest health tips, brain tips, smart tips for brain fitness, brain fitness smart tips

smart tips for brain fitness which will reduce pressure stress from the life

పంచతంత్ర... బ్రెయిన్ ఫిట్నెస్ మంత్ర

Posted: 09/16/2014 03:20 PM IST
Smart tips for brain fitness which will reduce pressure

ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు దూసుకుపోతున్న మానవులందరూ.. మల్టీ టాస్కింగ్ అనే అంశానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఒకవైపు కుటుంబకార్యకలాపాలతోపాటు మరోవైపు ఆఫీసు ఒత్తిళ్లను భరిస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నవాళ్లే ఎక్కువమంది వున్నారు. అయితే ఇలా గంటలతరబడి పనిచేయడం వల్ల వారు శారీరకంగానే కాకుండా మానసికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కొన్నికొన్ని సందర్భాల్లో హానికరమైన వ్యాధులకు బలవ్వాల్సి వుంటుంది.

అంటే... గుండెపోటు, క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్ తదితర భయంకర రోగాలు సంభవించే అవకాశాలు వున్నాయి. కాబట్టి ఇటువంటి సమస్యల నుంచి బయటపడాలంటే శారీరకంగా ఫిట్ గా వుండటం అవసరం. అలాగే మనం చేసే అన్ని కార్యకలాపాలను నిర్వర్తించడంలో ప్రముఖపాత్రను వహించే మెదడును కూడా నిత్యం చురుగ్గా వుండటం అత్యంత అవసరం. ముందుగా మనం బ్రెయిన్ ని ఫిట్ గా వుండేలా చేస్తే... తర్వాత శరీర కదలికలు, ఆలోచనలు సవ్యంగా వుండాయంటున్నారు నిపుణులు. అందుకు సంబంధించి కొన్ని సలహాలను కూడా వారు పేర్కొంటున్నారు. అవి...

ఆహారపదార్థాలు (మంచి డైట్) : సమయానుకూలంగా సరైన ఆహారం తీసుకుంటే మెదడును చురుగ్గా ఉంటుంది. ఆకుకూరలు, కాయగూరలు, తాజా పండ్లు తీసుకోవాలి. వాటిలో ఉండే యాంటీ ఆక్సిడాంట్లు బ్రెయిన్ సెల్ డ్యామేజీని అరికడతాయి. చేపలు, డ్రై ఫ్రూట్లు (వాల్ నట్లు, ఆల్మండ్స్) మెదడు ఆరోగ్యానికి మేలైనవి.

నిద్రపోవడం : ఇది అన్నిటికంటే సులభమైనది... ప్రశాంతమైనది... ఖర్చలేని వ్యవహారం! దీనిని మించిన మెడిసన్ మరొకటి వుండదు. వేగంగా పరుగులు పెడుతున్న నేటి యుగంలో సాధ్యమైనంతవరకు నిద్రపోతేనే ఎంతో మేలు. అంటే మరీ ఎక్కువసేపు కాదులెండి.. 8 నుంచి 9 గంటలవరకు నిద్రపోవాలి. తద్వారా శరీరం, మెదడు రిలాక్స్ అవుతాయి.

ఒత్తిడి నుంచి బయటపడటం : ఒకవైపు ఆఫీసులో గంటలతరబడి పని.. మరోవైపు ఇంటికి సంబంధించిన కార్యకలాపాలను తప్పకుండా నిర్వర్తించాల్సి వుంటుంది కాబట్టి.. ఒత్తిడి అనేది ఖచ్చితంగా వుంటుంది. వీటితోపాటు ఇంకా ఇతరత్ర కారణాలవల్ల ఒత్తిడి వుండటం సహజం. అయితే అది దీర్ఘకాలం వరకు వుంటే మాత్రం.. ఆ ప్రభావం శారీరక ఆరోగ్యంపై పడుతోంది. ఒత్తిడి అధికమైతే మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. దీంతో బ్రెయిన్ సెల్స్ నశించిపోతాయి. ఒత్తిడి ఎక్కువగా వున్న సమయంలో దీర్ఘంగా శ్వాస పీల్చి వదలడం ద్వారా రిలీఫ్ పొందవచ్చు.

మెదడును చురుకుగా వుంచుకోవాలి : ఒత్తిడి ఎక్కువగా వున్నప్పుడు మెదడులో వున్న సెల్స్ దెబ్బతినే అవకాశం వుందికాబట్టి... మెదడును క్రియాశీలకంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. పనిఒత్తిళ్ల నుంచి దూరం చేసి... సుడోకు, క్రాస్ వర్డ్ పజిళ్ళు, చదరంగం వంటి వాటికి సమయం కేటాయించాలి. ఇలా చేస్తే.. స్ట్రెస్ అనేది పూర్తిగా తగ్గిపోయింది.. ఉల్లాసంగా వుండటానికి వీలవుతుంది.

క్రమబద్ధమైన జీవితం : నియమబద్ధమైన జీవితం గడిపితే.. అది మెదడుపై భారాన్ని తగ్గిస్తుంది. అంటే... సమయానుకూలంగా అన్ని కార్యక్రమాలను నిర్వర్తించి... ఇతరత్ర వ్యవహారల గురించి ఎక్కువగా ఆలోచించకుండా వుండాలి. తద్వారా ఒత్తిడి దరిచేరదు, మెదడు ఫిట్ గా ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : brain fitness tips  health tips  tips for brain fitness  health problems  

Other Articles

  • Romantic positions

    నేడు నూటికి ఎనభై శాతం నుండి తొంభై శాతం మంది

    Jul 05 | నేడు నూటికి ఎనభై శాతం నుండి తొంభై శాతం మంది దంపతుల మధ్య కేవలం దినచర్యలో భాగంగా మాత్రమే... మొక్కుబడి తంతులా... తూ...తూ... మంత్రంలా ఆ.. కార్యాన్ని జరుపుకుంటున్నారు. రొటీన్ కి భిన్నంగా ట్రై... Read more

  • 6 romance tips for summer

    ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం

    Jul 05 | ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అప్పుడే మూడు నెలలు గడిచి పోయాయి. మార్చి వెళ్ళి పోయి ఏప్రిల్ వచ్చేసింది. అంటే సమ్మర్ వచ్చేసిందన్న మాట. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం... Read more

  • 3 sex tips for setting the mood at men

    మీ భాగస్వామితో రతిలో

    Jul 05 | మీ భాగస్వామితో రతిలో పాల్గొనాలని ఉండి కూడా మీరు రతిలో పాల్గొన లేక పోతున్నారా ? అయిత ఈ మూడు పద్దతులు ట్రై చేసి మూడ్ తెచ్చుకోండి. పురుషుడు పైన - పురుషుడికి ఇది... Read more