శ్రీదుర్గాదేవిగా కనక దుర్గమ్మ అమ్మవారు | Sri Durga Devi Avatar in Saranavaratrulu

Kanaka durgamma as sri durga devi avatar in saranavaratrulu

Sri Durga Devi Avatar in Saranavaratrulu, Sri Durga Devi Avatar, Dugra Navaratrulu, Durga Navaratrulu Avatars, Sri Durga Devi History

Sri Durga Devi Avatar in Kanaka Durgamma Navaratrulu.

శరన్నవరాత్రులు తొమ్మిదవ రోజు శ్రీ దుర్గా దేవి

Posted: 10/08/2016 11:13 AM IST
Kanaka durgamma as sri durga devi avatar in saranavaratrulu

దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపముగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారములో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని సమ్హరించినట్లు పురాణములు చెబుతున్నాయి.

సర్వస్వరూపే సర్వేశి సర్వ శక్తి సమన్వితే
భయే భస్ర్తాహినో దేవి దుర్గేదేవి నమోస్తుతే

అమ్మలగన్నయమ్మముగురమ్మలమూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మకడుపారడి బుచ్చినయమ్మతన్నులో
నమ్మిన వేల్పుటమ్మలమనంబుల నుండెడి యమ్మదుర్గ మా
యమ్మ కృపాబ్ధి యీచ్చుతమహత్వ కవిత్వ పటుత్వసంపదుల్

ముగ్గురమ్మలకు మూలమైన ఆ జగన్మాత దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు దుర్గాదేవిగా అవతరించింది. మహిషాసురుడిని సంహరించే సమయంలో కాళికా మాత ఎత్తిన అవతారంలో దుర్గాదేవి అవతారం ముఖ్యమైనది. దుఃఖ నివారిణి దుర్గే పాహి అని ఈరోజు అమ్మవారిని ప్రార్థించాలి. సింహాన్ని వాహనంగా కలిగిన దుర్గాదేవిని పూజించాలి. అమ్మవారి పూజకోసం ఎర్రటి అక్షింతలు, ఎర్రరంగు పువ్వులను వాడాలి. నైవేద్యంగా పులిహోర, చక్కెర పొంగలి, దానిమ్మ పండ్లను నైవేద్యంగా పెట్టాలి.

పంచప్రకృతి స్వరూపములలో ప్రధమమైనది దుర్గారూపము.  భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలగిపోతాయి. విజయము కలుగుతుంది. సకల గ్రహ దోషములు అమ్మను పూజించినంతమాత్రమునే ఉపశమింపబడతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి.

మంత్రము: "ఓం దుం దుర్గాయైనమః" అనే మంత్రమును 108సార్లు పఠించాలి. దుర్గా సూక్తము పారాయణ చేయవలెను. దుర్గా, లలితా అష్టోత్తరములు పఠించవలెను. నివేదన: పులగము నివేదన చెయ్యాలి.


ఈశ్వర ఉవాచ
 
శతనామాన్‌ ప్రవక్ష్యామి శృణుష్వ కమలాననే
యస్య ప్రసాదమాత్రేణ దుర్గా ప్రీతా సదాభవేత్‌    
 
సతీ సాధ్వీ భవప్రీతా భవానీ భవమోచనీ
ఆర్యా దుర్గా జయా ఆద్యా త్రినేత్రా శూలధారిణీ    
పినాకధారిణీ చిత్రా చణ్డఘణ్టా మహాతపా
మనో బుద్ధిరహంకారా చిత్తరూపా చితా చితిః    
సర్వమన్త్రమయీ సత్యా సత్యానన్ద స్వరూపిణీ
అనన్తా భావినీ భావ్యా భవా భవ్యా సదాగతిః    
శాంభవీ దేవమాతా చ చిన్తా రత్నప్రియా సదా
సర్వవిద్యా దక్షకన్యా దక్షయజ్ఞవినాశినీ    
అపర్ణాఽనేకవర్ణా చ పాటలా పాటలావతీ
పట్టామ్బర పరీధానా కలమఞ్జీరరఙ్జినీ    
అమేయవిక్రమా క్రూరా సున్దరీ సురసున్దరీ
వనదుర్గా చ మాతఙ్గీ మతఙ్గమునిపూజితా    
బ్రాహ్మీ మాహేశ్వరీ చైన్ద్రీ కౌమారీ వైష్ణవీ తథా
చాముణ్డా చైవ వారాహీ లక్ష్మీశ్చ పురుషాకృతిః    
విమలోత్కర్షిణీ జ్ఞానా క్రియా సత్యా చ వాక్ప్రదా
బహుళా బహుళప్రేమా సర్వవాహన వాహనా
నిశుంభశుంభహననీ మహిషాసురమర్దినీ
మధుకైటభహన్త్రీ చ చణ్డముణ్డవినాశినీ    
సర్వాసురవినాశా చ సర్వదానవఘాతినీ
సర్వశాస్త్రమయీ విద్యా సర్వాస్త్రధారిణీ తథా    
అనేకశస్త్రహస్తా చ అనేకాస్త్ర విదారిణీ
కుమారీ చైకకన్యా చ కౌమారీ యువతీ యుతిః    
అప్రౌఢా చైవ ప్రౌఢా చ వృద్ధమాతా బలప్రదా
మహోదరీ ముక్తకేశీ ఘోరరూపా మహాబలా    
అగ్నిజ్వాలా రౌద్రముఖీ కాలరాత్రిస్తపస్వినీ
నారాయణీ భద్రకాళీ విష్ణుమాయా జలోదరీ    
శివదూతీ కరాళీ చ అనన్తా పరమేశ్వరీ
కాత్యాయనీ చ సావిత్రీ ప్రత్యక్షా బ్రహ్మవాదినీ    
య ఇదం ప్రపఠేన్నిత్యం దుర్గానామశతాష్టకమ్‌
నసాధ్యం విద్యతే దేవీ త్రిషు లోకేషు పార్వతి    
ధనం ధాన్యం సుతం జాయాం హయం హస్తినమేవ చ
చతుర్వర్గం తథా చాన్తే లభేన్ముక్తిం చ శాశ్వతీమ్‌
కుమారీం పూజయిత్వా తు ధ్యాత్వా దేవీం సురేశ్వరీమ్‌
పూజయేత్‌ పరయా భక్త్యా పఠేన్నామశతాష్టకమ్‌    
తస్య సిద్ధిర్భవేత్‌ దేవి సర్వైః సురవరైరపి
రాజానో దాసతాం యాన్తి రాజ్యశ్రియమవాప్నుయాత్‌    
గోరోచనాలక్తక కుఙ్కుమేవ సిన్ధూరకర్పూరమధుత్రయేణ
విలిఖ్య యన్త్రం విధినా విధిజ్ఞో భవేత్‌ సదా ధారయతే పురారిః    
భౌమావాస్యానిశామగ్రే చన్ద్రే శతభిషాం గతే
విలిఖ్య ప్రపఠేత్‌ స్తోత్రం స భవేత్‌ సంపదాం పదమ్‌    
 
ఇతి శ్రీ విశ్వసారతన్త్రే దుర్గాష్టోత్తరశతనామస్తోత్రం సమాప్తమ్‌

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Sri Durga Devi Avatar  Sara Navaratrulu  

Other Articles

  • Ramayanam forty seven story

    రామాయణం-47వ-భాగం

    Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more

  • Ramayanam forty six story

    రామాయణం-46వ-భాగం

    Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more

  • Ramayanam forty five story

    రామాయణం-45వ-భాగం

    Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more

  • Ramayanam forty four story

    రామాయణం-44వ-భాగం

    Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more

  • Ramayanam forty three story

    రామాయణం-43వ-భాగం

    Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more