ఆసిన్
‘‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన ఈ కేరళకుట్టీ... సౌత్ ఇండస్ట్రీలో బడా హీరోలసైతం చాలా సినిమాల్లో నటించింది. ఆ తరవాత బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో ముంబైకు మకాం మార్చింది. అప్పటి నుంచి ఈమె వరుసగా హిందీ చిత్రాల్లోనే నటిస్తోంది. ‘‘గజినీ, లండన్ డ్రీమ్స్, రెడీ, హౌస్ ఫుల్ 2, బోల్ బచ్చన్, ఖిలాడీ 786’’ వంటి 100 కోట్ల క్లబ్ లోకి చేరిన భారీ చిత్రాల్లో నటించింది.