Teluguwishesh review.gif review.gif Ram Charan Racha Film Review Product #: 33251 stars, based on 1 reviews
  • Movie Reviews

    Ram Charan Racha Film Review

     సంస్థ        : మెగాసూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ ప్రై.లిమిటెడ్‌ 

    నటీనటులు : రామ్ చరణ్ తేజ్, తమన్నా, నాజర్‌, కోటశ్రీనివాసరావు, ముఖేష్‌ రుషి, పార్తీబన్‌, బ్రహ్మానందం, అలీ, గీత, ఝాన్సీ, ప్రగతి, సుధ, హేమ అజ్మల్ తదితరులు
    సంగీతం     : మణిశర్మ
    నిర్మాత     : ఎన్వీ ప్రసాద్
    దర్శకత్వం  : సంపత్ నంది
    సమర్పణ   : ఆర్‌.బి.చౌదరి
    రచన       : పరుచూరి బ్రదర్స్‌
    రేటింగ్      : 4

    కథ:

    పార్తిబన్ మరియు నాజర్ గ్రామా పెద్దలు. అనుకోని బాంబ్ బ్లాస్ట్ సన్నివేశం చిన్నప్పటి చరణ్ జీవితం లో మలుపుతిరుగుతుంది. పరిగెడుతున్న రైలు మీద (రామ్ చరణ్ ) బెట్టింగ్ రాజు గా ఎంట్రీ ఇస్తాడు. బెట్టింగ్ రాజు ఒక బస్తీలో నివసిస్తూంటాడు. కాలనీ ఆడవాళ్ళతో క్రికెట్ ఆడుతుంటాడు. ఈ బెట్టింగ్ రాజు అందరితో బెట్టింగ్ కట్టి డబ్బు సంపాదిస్తుంటాడు. బెట్టింగ్ రాజ్ తండ్రి ఎంఎంఎస్ నారాయణ, తల్లి సుధ. తన కొడుకును పెద్ద స్థాయిలో చూడాలని వారి కోరిక. కానీ బెట్టింగ్ రాజ్ మాత్రం బస్తీలో తిరుగుతూ బెట్టింగ్ లు కట్టి డబ్బులు సంపాదించటం హీరో తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు. ఒక రోజు బెట్టింగ్ రాజు తండ్రికి ..హార్ట్ఎటాక్ వచ్చింది. తన తండ్రి బతికించుకోవటనాకి .. బెట్టింగ్ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడే యువకుడు. జేమ్స్ (అజ్మల్) మరియు రామ్ చరణ్ మధ్యలో బెట్టింగ్ జరుగుతుంది . ఈ సినిమా మొత్తం ఈ పందెం మీద ఆధారపడి ఉంటుంది. అసలు ఆ పందెం ఎవరి మీద కడాతారు? అసల ఆ పందెనికి బెట్టింగ్ రాజునే ఎందుకు ఎంచుకుంటాడు? బెట్టింగ్ రాజు ఈ బెట్టింగ్ ని సవాల్ గా తీసుకుంటాడు. జేమ్స్, బళ్ళారి (ముఖేష్ రుషి) ముద్దుల కూతురు చైత్ర (తమన్నా)ని రాజ్ ప్రేమలో పడేసి ఆమె చేత ఐ లవ్యూ చెప్పించుకుంటే 20 లక్షలు ఇస్తానంటాడు. డబ్బు అవసరంలో ఉన్న రాజ్ ఆ పందెంకి అంగీకరిస్తాడు. అనుకున్న ప్రకారం చైత్రని ప్రేమలో పడేస్తాడు. అసలు ఈ జేమ్స్ ఎవరు? అతనికి చైత్రకి సంబంధం ఏమిటి? ఇలాంటి చిక్కుముడులన్నీ రాజ్ ఎలా చేదిస్తాడు.

    అసలు ఇక్కడి నుండి కథ మొదలైంది. ఇప్పుడు హీరో బెట్టింగ్ రాజు కాస్త .. మెడికో విద్యార్థిగా అవతారం ఎత్తుతాడు. ఈ మెడికో అవతారం వెనక పెద్ద కథ దాగింది. ఇక్కడ హీరోయిన్ చైత్ర (తమన్నా) ఉన్నతమైన కుటుంబం నుండి వచ్చి మెడికో చదువుకుంటుంది. చైత్ర తండ్రి ( ముఖేష్ రుషి) తన కూతురు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటాడు. ఆమె ఐ లవ్యూ చెప్పే సమయానికి కథ అనుకోని మలుపు తిరుగుతుంది. బళ్ళారి తన కూతురు చైత్రని చంపడానికి చేసే ప్రయత్నాన్ని రాజ్ అడ్డుకొని ఆమెను కాపాడతాడు. బళ్ళారి తన కూతుర్ని ఎందుకు చంపాలనుకున్నాడు? చివరకు తన ప్రేమను గెలుస్తాడా? లేదా? జేమ్స్ వేసిన పందెం వెనక రహస్యం ఏమిటి? తన తండ్రిని కాపాడుకుంటడా? లేదా? చివరకు బెట్టింగ్ రాజ్ ఈ సమస్యలను నుండి ఎలా బయటబడతాడు అనేది తెర మీదే చూడాలి.

    Review

    కళాకారుల పనితీరు :

    రామ్ చరణ్  రచ్చ చాలా ఢిపరెంట్  రోల్ చేశాడు. ఒక మాస్ కుర్రడిగా.. మళ్లీ  వెంటనే  మెడికో  విద్యార్థిగా  రామ్ చరణ్ నటన చాలా అద్భుతంగా చేశాడు.  తమన్నా కూడా ఇప్పటి వరకు ఏ సినిమాలో చూపించని తన నటన తీరును రచ్చ సినిమా ప్రతేక్యగా చూపించింది.  మొదటి బాగం అంత .. అలీ,బ్రహ్మనందం కామెడీ డాన్స్ మాస్టర్ రంగీలా పాత్రలో బ్రహ్మానందం హైలెట్ గా ఉంది. డాన్స్ స్కూల్ ఓనర్ గా కృష్ణ భగవాన్ సూపర్ గా చేశారు. గీత, జాన్సీ చేసే కామెడీ తో ప్రేక్షకులు నవ్వులతో మునిగిపోయారు. ఏజెంట్ వినోద్ పాత్రలో (రవి బాబు) హీరోయిన్  బాడీగార్డ్ గా బాగా నటించాడు. లవ్ గురు పాపారావు గా అలీ నటించారు. ముఖ్యంగా కోట శ్రీనివాసరావు నటన, ఎంఎంఎస్ నారాయణ రావు  నటన చాలా బాగుంది.  నాజర్ కూడా.. తన నటనతో కథకు మంచి ఆయువుపట్టుగా ఉంటుంది.    రచ్చ సినిమా కోసం  చాలా కష్టపడినట్లు వారి నటన చెబుతుంది.

    చివరగా:-
    రచ్చ సినిమా మఖ్యంగా పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా కొత్త డైరెక్టర్ సంపత్ నంది కు రామ్ చరణ్ కొత్త లైప్ ఇచ్చినట్లే. కొత్త దర్శకుడితో ఒక పెద్ద స్టార్ హీరో చేయటం చాలా అరుదు. అలాంటిది రామ్ చరణ్ కేరియర్ లో ఒక కొత్త దర్శకుడికి లైప్ ఇచ్చినట్లు పేరు నిలబడిపోతుంది. చరణ్ శంకర్ దాదా ఎం బి బి యస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో వైద్య విద్యార్థిలా కనిపించే సన్నివేశానికి థియేటర్ లో అద్బుథమయిన స్పందన హాల్ అదిరిపోతుంది. ఈ సినిమా హైలెట్ లాస్ట్ పైట్ ను చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ వెదురు తోటలో చేసే పైట్ తెలుగు ప్రేక్షకులకు చాలా నచ్చింది. మణిశర్మ అందించిన సంగీతం చాలా బాగుంది. సినిమాలో చెప్పుదగ్గ మైనస్ లు ఏమీ లేవు. అందరినీ ఎలా రచ్చ చేశాడు అన్నది పాయింట్‌. రచ్చ టైటిల్ రామ్ చరణ్ కు చాలా బాగా కుదురింది. అలాగే మణిశర్మ ఆడియోకు మంచి స్పందన వచ్చింది. హాస్యము మరియు ద్వందార్ధ సంభాషణలు కథను ఆసక్తి కరంగా నడిపిస్తున్నాయి. "ఒక పాదం" పాట మొదలయ్యింది చాలా బాగా చిత్రీకరించారు తమన్నా తన అందాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. అందమయిన ప్రదేశాలలో ఈ పాట చిత్రీకరించారు. చరణ్ కొత్త లుక్ తో ఆదరగోడుతున్నాడు. చిత్రం లో మొదటి ఫైట్ మొదలయ్యింది. కథలో మలుపుతో విశ్రాంతి సమయం మొదలయ్యింది. మొదటి అర్ధ భాగం లో కామెడి మరియు రొమాంటిక్ సన్నివేశాలు చాలా బాగా వచ్చింది. కథలో కీలక మలుపులు రెండవ అర్ధం లో ఉండబోతుంది.కథ అడువుల్లోకి మారింది గూండాలు చరణ్ మరియు తమన్నాల కోసం వెతకడం మొదలుపెట్టారు. చిన్నిచరణ్‌, చంద్రబోస్‌ చక్కటి సాహిత్యాన్ని అందించారు. పాటల్లో తీస్ మార్ ఖాన్ రచ్చ , వాన వాన వెల్లువాయే రెండూ టాప్ గా ఉండి అబిమానులను ఉర్రూతలూగిస్తాయి అంతే కాకుండా 'తిల్లా తిల్లా తెల్లకోడిపిల్ల..' అనే పాట చిత్రానికి హైలైట్‌గా నిలిచింది. మొత్తం మీద సినిమా రచ్చ రచ్చ విజయవైపు అడుగులు వేస్తుంది. రచ్చ ఆనందంలో సంపత్ నంది చాలా హ్యాఫీగా ఉన్నట్లు తెలిసింది.

    ఆడియెన్సు రిపోర్టు:

    రచ్చ సినిమా చూసిన ప్రతి ఒక్కరు. తెలుగు సినీ ప్రేక్షకులకు సమ్మర్ గిప్ట్ లా ఉందని అందరు అంటున్నారు. ఒక్కడిగా వెళ్లి సినిమా చూసినవారు.. మరళ తన ఫ్యామిలీతో కలిసి రచ్చ సినిమా చూడటానికి ఇష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరి నచ్చిన సినిమా రచ్చ అని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. అసలు వెండితెర పై చిరంజీవిని చూసినట్లు ఉందని సినిమా చూసిన వారు చెబుతున్నారు. చిరంజీవికి తగిన వారసుడు రామ్ చరణ్ తేజ్ . తండ్రి బాటలోనే నడుస్తూ... తండ్రి మించిన తనయుడుగా చరణ్ ఎదుగుతున్నాడని మెగా అభిమానులు అంటున్నారు. రామ్ చరణ్ తన నటనలో .. చిరంజీవికి తగ్గకుండా చేస్తున్నాడని తెలుగు ప్రేక్షకులు అంటున్నారు. ఎక్కడ కూడా తన తండ్రి పేరు వాడకుండా, ఇప్పటివరకు ఇంత ఘనత సంపాదించాడు అంటే.. అది మొత్తం చిరంజీవి గారికే దక్కుతుంది. చిరంజీవిగారి ఇచ్చిన స్వేచ్చ వాయువులను రామ్ చరణ్ సద్వినియోగం చేసుకుంటున్నాడని.. సినీ ప్రముఖులు అంటున్నారు. ఏమైన మెగా వారుసుడు రామ్ చరణే అనిపించుకోవటం చాలా గ్రేట్. చిరంజీవి గారు ఒక మెగా పవర్ పుల్ డైమాండ్ ను తెలుగు వారికి అందజేసిన ఘనత చిరంజీవిగారిదేనని సినీ విశ్లేషకులు అంటున్నారు.

    రచ్చ చిత్రం మాస్ ఆడియెన్సుని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా. సినిమాలో కొత్తదనం లేకపోయినా మాస్ ఆడియెన్సును మాత్రం తప్పకుండా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటన, తమన్నా అందాలతో పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రచ్చ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.

    రెబ్బశ్రీ


More Movie Reviews
More
Get information about Karthikeya 2 Telugu Movie Review, Nikhil Siddharth Karthikeya 2 Movie Review, Karthikeya 2 Movie Review and Rating, Karthikeya 2 Review, Karthikeya 2 Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Bimbisara Telugu Movie Review, Kalyan Ram Bimbisara Movie Review, Bimbisara Movie Review and Rating, Bimbisara Review, Bimbisara Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Sita Ramam Telugu Movie Review, Dulquer Salmaan Sita Ramam Movie Review, Sita Ramam Movie Review and Rating, Sita Ramam Review, Sita Ramam Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Ante Sundaraniki Telugu Movie Review, Nani Ante Sundaraniki Movie Review, Ante Sundaraniki Movie Review and Rating, Ante Sundaraniki Review, Ante Sundaraniki Videos, Trailers and Story and many more on Teluguwishesh.com