Mega brothers real talk

mega brothers real talk , Mega Brother Nagababu talk about pawan kalyan join to politics, Mega Brothers Join To TDP, Special story on mega brothers, political parties, 2014 election, minister chiranjeevi, nagababu, pawan kalyan,

mega brothers real talk , Mega Brother Nagababu talk about pawan kalyan join to politics

ముగ్గురు మొనగాళ్లు ఒకే మాటమీద ఉంటారు?

Posted: 10/23/2013 11:24 AM IST
Mega brothers real talk

అన్నదమ్ములంటే.. రామ్మలక్షణుల్లా ఉండాలని ..మన పెద్దలు చెబుతుంటారు. కానీ అన్నదమ్ములంటే.. టాలీవుడ్ ముగ్గురు మొనగాళ్ల మాదిరిగా ఉండాలని నేటి తరం వారు చెబుతున్నామాటలు. టాలీవుడ్ లో ముగ్గురు మొనగాళ్లు ఉన్న విషయం తెలిసిందే. ఇంతకీ ఆ ముగ్గురు మొనగాళ్లు ఎవరు అనుకుంటున్నారా.. ఒకరు మెగాస్టార్ చిరంజీవి, రెండు నిర్మాత, నటుడు నాగబాబు, మూడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ ముగ్గుర్ని కలిపితే... టాలీవుడ్ ముగ్గురు మొనగాళ్లు. ఈ ముగ్గురికి ఇప్పటివరకు శత్రువులు ఎవరు లేరు, అంత అభిమానులే.. వారి శ్రేయోభిలాషులే. కానీ ఇటీవల కాలం రాజకీయం అనే భూతం.. ఈ త్రీ స్టార్స్ పై కన్నేసింది. కొన్ని రాజకీయ పార్టీలు టాలీవుడ్ ముగ్గురు మొనగాళ్ల మద్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ముగ్గురు అన్నదమ్ములను వీడదీసి రాజకీయ లబ్దిపొందాలని .. తెగ ఆరాటపడుతున్నాయి. అయితే ఇలాంటీ రాజకీయ పార్టీలకు ..అసలు విషయం తెలియదు. అసలు విషయం తెలియకుండా.. టాలీవుడ్ ముగ్గురు మొనగాళ్లతో శత్రుత్వం పెంచుకుంటున్నాయి. ఇప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియని రహస్యం ఒకటి ఉందని మెగా అభిమానులు అంటున్నారు.

 

రాజకీయా పార్టీలు తమ రాజకీయ లభ్ధికోసం మెగా బ్రదర్స్ పై వల వేస్తే.. పడటానికి .. సముద్రంలో ఉప్పు చేపలు కాదు.. మంచినీటీలో ఉన్న మీసాలున్న రోయ్యపిల్లలు కాదు.. దమ్ము, ధైర్యం, పౌరుషం, పవర్ ఉన్న ముగ్గురు మొనగాళ్లు. వీరి ఎలాంటి రాజకీయం వలలు పనిచేయవు. అభిమానుల వలకే పడిపోతారు. ఎలాంటి రాజకీయలకు లోనుకారు. కానీ మెగా స్టార్ చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ కలిపినప్పుడే, మెగా బ్రదర్స్ పై అభిమానం పోయిందని కొంతమంది చాటు మాటుగా చెవులుకొర్కుకున్నారు. కానీ ప్రజలకోసం పెట్టిన పార్టీ ..కొన్ని అనివార్యకారణాల వల్ల.. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకే .. పార్టీని కాంగ్రెస్ లో కలపటం జరిగిందని మంత్రి చిరంజీవి అనేక సార్లు మీడియా ముందు చెప్పటం జరిగింది. కొంత మంది రాజకీయ నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం.. మెగా బ్రదర్స్ పై అనేక సార్లు బురద చల్లటం జరిగింది. కానీ అలాంటి వారిని కూడా మెగా బ్రదర్స్ సున్నితంగా వదిలిలేయటం జరిగిందని మెగా అభిమానులు అంటున్నారు.

 

అయితే 2014 ఎన్నికల ప్రబావం ..రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల్లో కనబడుతుంది. అయితే ముందుగా ఆయా పార్టీలు గెలుపు గుర్రాల కోసం వేట సాగిస్తున్నాయి. ప్రజల్లో ఎవరికి ఇమేజ్ ఉంటే .. వారిపై వెంటనే కర్ఛీఫ్ వేసి.. వారిపై రాజకీయ బురద చల్లటం రాజకీయ పార్టీలకు అలవాటు గా మారింది. ప్రజా నాయకుడు అనే వాడు.. ప్రజల మద్య నుంచి రావాలి కానీ.. రాజకీయ పార్టీలు పిలిస్తే ..వచ్చినవాడు ప్రజా నాయకుడు ఎలా అవుతాడని .. మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ పార్టీలకు ఒక విన్నపం.. మీ రాజకీయ లబ్ధి కోసం.. సమాజంలో మంచి ఇమేజ్ ఉన్న వారిపై రాజకీయ మరకలు వేయకండని మెగా అభిమానులు కోరుతున్నారు. మెగా బ్రదర్స్ కు నిజంగా రాజకీయల్లోకి రావాలని ఉంటే.. తప్పకుండ వస్తారు.. అంతేగానీ, రాజకీయ పార్టీలను బతికించటానికి, ఆయా పార్టీలను గెలిపించటానికి .. మెగా బ్రదర్స్ రాజకీయల్లోకి రారాని మెగా అభిమానులు అంటున్నారు. కొంత మంది సమైక్యాంద్ర కోసం పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు రాజకీయల్లోకి రావాలని మీడియా గోల చేస్తున్నారు. ఇప్పటి వరకు మీరు రాజకీయల్లో ఉండి సమైక్యాంద్ర కోసం ఏం పోరాటం చేసారో ..మీడియా ముందు ప్రజలు తెలియజేయండి. ‘‘ఎవరో వస్తారని, ఎదో చేస్తారని.. ప్రజలకు ఆశకలిగించే ’’ ప్రయత్నం చేయకండని మెగా అభిమానులు అంటున్నారు.

 

 

అయిన రాజకీయ పార్టీలకు తెలియని ఒక నిజం దాగి ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాని,ఆయన సోదరుడు నాగబాబు కాని మెగాస్టార్,కేంద్ర మంత్రి చిరంజీవి మాటను కాదని బయటకు వెళ్లరని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల తర్వాత రాజకీయాలలోకి రాలేదని, ఆయన సినిమాలలోనే బిజీ అయ్యారని ఆయన చెప్పారు. కాకపోతే తెలుగుదేశం పార్టీ వారు వస్తే బాగుంటుందని భావిస్తుండవచ్చని ఆయన అన్నారు. కాని చిరంజీవి సోదరులంతా ఒకే మాట మీద ఉంటారనే విషయాన్ని మళ్లీ గుర్తు చేస్తున్నారు. టాలీవుడ్ మొనగాళ్లు పైకి అలా కనిపించినప్పటికి.. ముగ్గురు అన్నదమ్ములది ఒకే మాట.. ఒక్కటే బాణం. ముగ్గురు అన్నదమ్ములు ఒకే మాటమీద ఉన్నరు కాబట్టి.. వారు ఈ స్థాయిలో ఉన్నారనే విషయం మరిచిపోవద్దని మెగా అభిమానులు గుర్తుచేస్తున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more