తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏదీ చేసిన అది హాట్ గానే ఉంటుంది. 63 ఏళ్ల వయస్సు రాష్ట్రంలో పాదయాత్ర చేసి రికార్డు రాసుకున్నాడు. ప్రతిపక్ష హోదాల ఉన్న చంద్రబాబు ప్రభుత్వం పై చేసే పోరాటాలు చాలా విచిత్రంగా ఉన్నాయని టిడిపి తెలంగాణ నాయకులు అంటున్నారు. అవినీతి మంత్రులను తొలిగించే పక్రియను అసెంబ్లీలో లొల్లి చెయ్యకుండా, పుస్తకాల రూపంలో వ్రాసి రాష్ట్రపతికి అందజేశారు. అంతేకాకుండా.. ప్రత్యేక తెలంగాణ పై అన్నీ పార్టీలు తమ వైఖరిని పబ్లిక్ లో వినిపిస్తే.. చంద్రబాబు మాత్రం ఉత్తరం రాసి రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యపరిచారు.
అప్పటి నుండి చంద్రబాబుకు లేఖాల బాబు అనే పేరు పడిపోయింది. అంతేకాదండోయ్? ఇటీవల తమ కార్యలయం నుండి కూడా బాబు రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని ఉత్తరాలు రాసినట్లు తెలంగాణ టీడీపీ నాయకులు అంటున్నారు. సమస్యపై నేరుగా పోరాటం చెయ్యకుండా బాబు తెలివిగా లేఖాస్ర్తాలతో కాలం గడుపుతున్నాడని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. సామాన్యుడు మోయలేని రీతిలో ప్రభుత్వం ఎడాపెడా చార్జీలను పెంచుతున్న విషయం తెలిసిందే. అయితే వాటిపై ప్రజల పక్షాన పోరాటం చెయ్యాల్సిన బాబు ఉత్తరాల ఆట ఆడుతున్నాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కొంతమంది నాయకులు మాత్రం పొరాటం చేస్తేనే పార్టీ బాగుపడుద్ది. లేదంటే ఎందుకూ పనికిరాకుండా పోతాం.. అంటూ, టీడీపీ నాయకులు తెగ బాధపడిపోతున్నారు. ఇప్పుడు ఏ విషయమైన నేరుగా చంద్రబాబుతో మాట్లాడే అవకాశం పార్టీలో లేదని, అందుకే కొంత మంది నాయకులు పార్టీ వీడి వెళ్లిపోతున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఏదైనా సమస్య గురించి చెబితే .. వెంటనే, చంద్రబాబు వద్ద ఉన్న ఆత్మీయుడు కల్పించుకోని.. ఓస్.. ఇంతేనా..! దీనికి ఉద్యమమెందుకు దండగ.. ఉత్తరాలుండగా.. అని ఆ ఆత్మీయుడు అంటాడు వెంటనే చంద్రబాబు కూడా ఆ పని చేద్దాం అని వచ్చిన వారికి చెబుతున్నాడని సమస్య పై పోరాటం చేసే నాయకులు అంటున్నారు.
‘ఇటీవలి కాలంలో ఎవరైనా చంద్రబాబు దగ్గరకెళ్లి బాధలు చెప్పుకుంటే.. ఆయన వెంటనే స్పందించి సీఎంకు లేఖ రాయండంటూ కార్యాలయ సిబ్బందిని పురమాయిస్తున్నారు. ఆ లేఖలపై సంతకం చేసి సీఎంకు పంపుతున్నారు. దాంతో వచ్చిన వాళ్లంతా బాబుగారు వారి కోసం నేరుగా సీఎంకే ఉత్తరం రాశారని తెగ మురిసిపోతూ వెళ్లిపోతున్నారుట. 2004 నుంచి 2009 వరకు సీఎంకు ఒక్క ఉత్తరం కూడా రాయని చంద్రబాబు.. ఆ తర్వాత సీఎంగా కిరణ్ గద్దెనెక్కి, తనకు దగ్గరైనప్పటి నుంచి తెగ ఉత్తరాలు రాసేస్తున్నారట.
ఎవరేదడిగినా ఓ ఉత్తరం ముక్క రాసేస్తున్నారు. చార్జీలు తగ్గించాలని ఇప్పటికే ఉత్తరం రాసేశారట. ఇక ఉద్యమం మాటెందుకొస్తుంది..’ అని ఆ నేత చెప్పడంతో పార్టీలోని నాయకులు ఒకింత విస్మయం చెందుతున్నారు. అసలు ఈ ఉత్తరలు రాసే అలవాటు బీజేపి నాయకులకు బాగా అలవాటు ఉండేదని, వారి అలవాటు చంద్రబాబుకు వచ్చిందని టిడిపి నాయకులు అంటున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్నఆ బీజేపి నాయకుడు ఈ మధ్య ఉత్తరాలు రాయడం తగ్గించినట్లుగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే చంద్రబాబు రాసిన ఉత్తరాలు చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నవ్వుకుంటున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more