ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలతో దేశంలోని పాతగొడవలు మళ్లీ పురుడు పోసుకుంటున్నాయి. వివాదానికి ఆజ్యం పోస్తున్న రాజకీయ పార్టీల నాయకులు? రెండు వర్గాల గొడవలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి? ఒకరిపై ఒకరు మత విమర్శుల చేసుకునే స్థాయికి దిగజారిపోయారు. ఇలాంటి పరిణామాలు చూస్తుంటే.. గతంలో జరిగిన హిందు- ముస్లీం బీభత్సం ప్రజల కళ్ల ముందు కనిపిస్తుందని రాజకీయ మేథావులు అంటున్నారు. ఒక్కసారి గతంలోకి వెళితే ...రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పాతబస్తీ సగ భాగం అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మూసీ నదికి దక్షిణ భాగాన వున్న పాతబస్తీ ఒకప్పుడు నవాబుల ఏలిన ప్రాంతం కావడంతో అలనాటి అపురూప కట్టడాలు, సుందర మైదానాలు, అప్పట్లో ఓ వెలుగు వెలిగిన మహళ్లు నేటికీ దేదీప్యమానంగా మనకు కానవస్తుంటాయి. దీనికి తోడు ఈ ప్రాంతానికి చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు ఒక వర్గానికే పరిమితమైనట్లు వ్యవహరిస్తుండడం కూడా ప్రజల మధ్య అగాధాన్ని పెంచుతున్నాయి. హైదరాబాద్ నగరం ఒకప్పుడు హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించగా ఇది రానురాను పలుచబడసాగింది. పాతబస్తీలో అల్లర్లు ఒకప్పుడు ఎప్పుడోకాని జరిగేవి. 1980 దశకంలో హైదరాబాద్‌లో సామూహిక గణేష్ ఉత్సవాలు మొదలయ్యాక అప్పుడప్పుడు గొడవలు జరిగేవి. కానీ 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం తరువాత ప్రతి డిసెంబరు ఆరవ తేదీన పాతబస్తీలో అల్లర్లు జరగడం పరిపాటిగా మారింది.
1992 డిసెంబరు ఆరవ తేదీన బాబ్రీ మసీదు విధ్వంసం తరువాత హైదరాబాద్‌లో జరిగిన అల్లర్లను అదుపు చేసేందుకు అప్పటి విజయభాస్కర రెడ్డి సర్కారు దాదాపు వారం రోజుల పాటు కర్ఫ్యూ విధించింది. దీని తరువాత దాదాపు పదేళ్ల పాటు డిసెంబరు ఆరవ తేదీన అల్లర్లు జరగడం, పోలీసు కాల్పులు జరపడం, పలువురు మరణించడం వంటివి సాధారణంగా మారాయి. దీని తరువాత రెండేళ్ల క్రితం సరిగ్గా హనుమాన్ జయంతి సందర్భంగా అల్లరిమూకలు స్వైర విహారం చేయడం, భారీగా హింస చెలరేగడంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు మరోసారి కర్ఫ్యూ విధించారు. నాటి ఘటనలు మరువక ముందే సరిగ్గా అదే హనుమాన్ జయంతి జరిగిన ఒక రోజు తరువాత అల్లరి మూకలు హింసకు దిగడంతో మళ్లీ కర్ఫ్యూ విధించారు. ప్రస్తుతం రెండు పోలీసు స్టేషన్ల పరిధుల్లోనే వున్నప్పటికీ ఇతర ప్రాంతాలలోనూ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా వుంది. రోగం ఒకటైతే వైద్యం మరొకటి అనే విధంగా పాత బస్తీ గొడవలు ఉన్నాయి. అయితే రీసెంట్ గా జరుగుతున్న విషయాలను పరిశీలిస్తే .. హైదరాబాద్ ప్రజలకు పెద్ద భయం పట్టుకుంది. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్భరుద్దీన్ పోలీసులు అరెస్ట్ చేస్తే...? ఎంఐఎం కార్యకర్తలు రెచ్చిపోయి, ప్రజల మీద, ప్రభుత్వ సంస్థల మీద దాడికి దిగుతారు? అక్బరుద్దీన్ ను అరెస్ట్ చేయకపోతే .. హిందువులు ఇప్పటికే , దర్నాలు, నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోని హైదరాబాద్ లో శాంతి భద్రతలను నెలకోల్పే బాధ్యత ఉందని నగర ప్రజలు అంటున్నారు. రెండు మతల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more