కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ముసలం మొదలైందని అంటున్నారు. ఇప్పటి వరకు కేవలం రెండో స్థాయి నాయకులలోనే విభేదాలు బయటకు వచ్చాయని, తాజాగా ముఖ్య నేతల్లో కూడా అసంతృప్తి జ్వాలలు రాజుకుంటున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిత్యం హైదరాబాదులో ఉండి జగన్‌ను ఎవరైనా ఏమైనా అంటే ఒంటి కాలిపై లేచే అంబటి మూడు నెలలుగా గుంటూరుకే పరిమితమయ్యారు. ఆయనను కేవలం ఓ నియోజకవర్గానికే పరిమితం చేయాలని పార్టీ భావిస్తోందని అంటున్నారు. ఇది అంబటికి అసంతృప్తిని కలిగిస్తోందట. అలాగే చంద్రబోసు, సురేఖలు కూడా పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో తమతో సంప్రదింపులు జరపడం లేదనే అసంతృప్తితో ఉన్నారట! వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికార ప్రతినిధిగా ఓ వెలుగు వెలిగిన అంబటి రాంబాబు అస్సలు కనిపించడం లేదు. రోజుకో ప్రెస్ మీట్ తో జోరుగా వెలిగిపోయిన అంబటి మీడియాకు పూర్తిగా దూరమయ్యాడు. ఏం జరిగిందో ఏమోకాని మొత్తానికి అంబటి మాత్రం అస్సలు కనిపించడం మానేశాడు.
ఎప్పటి నుండో జగన్ కు అండగా ఉన్న తనను ఇలా దూరం పెట్టడం అంబటికి అస్సలు నచ్చడం లేదట. ఇటీవల తెలంగాణలో, ఏలూరులో, హైదరాబాద్ లో జరిగిన వైఎస్ విజయమ్మ దీక్షలలో దేనికీ అంబటి హాజరుకాలేదు. ఇక ఇటీవల ఉప ఎన్నికలలో ఓడిపోయిన కొండా సురేఖ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లది అదే పరిస్థితి అని సమాచారం. మంత్రి పదవులను కాదని జగన్ కు అండగా నిలిస్తే పార్టీలో తమకు కనీస ప్రాధాన్యమున్న పదవులు ఇవ్వరా అని వారు అనుచరులతో వాపోతున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్సీ కొండా మురళి వ్యవహారంలోనూ తామే నష్టపోయామని, మంత్రి పదవి వదులుకున్నామని అయినా పార్టీలో తమకు ప్రాధాన్యత లభించడం లేదని సురేఖ భావిస్తున్నారని అంటున్నారు. చంద్రబోసు కూడా తాను రామచంద్రాపురంకే పరిమితమైతానని ఇటీవల చెప్పడానికి కారణం అసంతృప్తి అంటున్నారు. పార్టీ ఆధ్వర్యంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా సురేఖ హాజరవుతారు. కానీ ఇందిరాపార్కు వద్ద విజయమ్మ చేసిన ఫీజు పోరు దీక్షకు హాజరు కాలేదు. అంతేకాకుండా దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అంటే బాగా అభిమానమున్న కొండా సురేఖ ఆయన మూడో వర్ధంతి కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో పార్టీ ముఖ్యనేతల్లో అసంతృప్తి జ్వాలలు రాజుకుంటున్నాయని అంటున్నారు. ఆదివారం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. కొండా, బాలినేని, చంద్రబోసులు మంత్రి పదవులకు రాజీనామా చేసి వచ్చారని, వారికి ప్రత్యేక స్థానముంటుందని తెలిపారు. మరి బాధితులు నోరు విప్పితే గాని అసలు బయటపడదు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more