మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ కుటుంబ సభ్యులందరు.. కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖరెఢ్డిని హత్య చేసిందని ..ఎన్నికల ప్రచారంలో ఉకదంపుడుగా దంచిపారేశారు. తమపార్టీ విజయం కోసం వైఎస్ మరణాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు వైఎస్ కుటుంబ సభ్యులు. అయితే ఇప్పుడు వైఎస్ రాజశేఖ రెడ్డి మంచోడా? లేక చెడ్డోడా? అనేది రాజకీయ నాయకులకే భాగా తెలుసు. ఎందుకంటే ఆయన రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో పాటు రాజకీయ నాయకులు సన్నిహితల సంబంధాలు బాగా నడిచినట్లు తెలుస్తోంది. ఆయన చేసిన మంచి పనులు పక్కన పెడితే .. చెడ్డ పనులే అధికంగా ఉన్నట్లు కాంగ్రెస్ మంత్రులు చెబుతున్నారు. ఇప్పుడు మంత్రిగా ఉన్న నాయకుడు ఒకరు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై ఒక సంచలన ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. వైఎస్ చనిపోవటం ఈ మంత్రికి బాగా కలిసివచ్చిందట. అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికుంటే మాత్రం..ఇప్పుడున్న కాంగ్రెస్ మంత్రికి తీవ్ర నష్టం జరిగేదని చెబతున్నాడు. ఇంతకీ ఎవరా మంత్రి అంటారా? రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజ్ సారయ్య. ఇప్పడు తన ఆవేధనను బయటకు చెబుతున్నాడు. వైఎస్ఆర్ బతికుంటే మాత్రం నా జీవితంలో మంత్రిని అయ్యేవాడిని కాదని ఆయన బల్లగుద్ది మారి చెబుతున్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మంత్రి బస్వరాజ్ సారయ్య వరంగల్ నుండి ఐదు సార్లు శాసనసభ్యుడిగా గెలిచినప్పటికి మంత్రి పదవి ఇవ్వటానికి వైఎస్ కు మనసు రాలేదని ఆయన అంటున్నారు. నాకు మంత్రి ఇచ్చే ఆలోచన వైఎస్ కు ఆనాడు రాలేదని సారయ్య మీడియా ముందు వాపోతున్నాడు. ఏపీ రజక అభివ్రుధ్ది సంస్థ గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియాతో అనటం జరిగిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. సారయ్య ఆవేధన నిజమేనని సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెప్పటం విశేషం. దీనిని బట్టి వైఎస్ తన వారికే పదవులు ఇచ్చాడనే వాస్తవం మరొసారి తెరపైకి వచ్చిందని మీడియా వారు గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more