రాష్ట్ర మంత్రివర్గం చిక్కుల్లో పడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వివాదాలకు కేంద్రంగా మారుతోంది. కొన్ని రోజుల నుంచి ఎవరో ఒక మంత్రి వివాదంలో చిక్కుకుంటున్నారు. ప్రజలంతా ఆ విషయంత మరిచిపోయారనుకుంటున్న సమయంలో ఇంకో మంత్రి నిర్వాకం బయటపడుతోంది. జగన్ ఆస్తుల కేసు, గాలి గనులు, ఎమార్ ప్రాపర్టీస్ కేసుల్లో ఐదుగురు మంత్రులు.. సబితా ఇంద్రారెడ్డి, పొన్నాల లక్ష్యయ్య, ధర్మానప్రసాదరావు, కన్నా లక్ష్మినారాయణ, గీతారెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటుండగా మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వాన్ పిక్ వ్యవహారంలో ఇప్పటికే జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఇదిలా ఉంటే, వివాదాస్పద 26జీవోల జారీ విషయంలో ఆరుగురు మంత్రులు ఇప్పటికే సుప్రీంకోర్టు నోటీసులందుకున్నారు. ఈ మేరకు సీబీఐ కూడా ఇప్పటికే కొందరు మంత్రులను విచారించింది కూడా. ఈ మేరకే మోపిదేవి అరెస్టయ్యారు. ఇక కిరణ్ కేబినెట్ లోని మరో మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డిపైనా ఆరోపణలు వచ్చాయి. గాలి బెయిల్ స్కామ్ వెనుక ఏరాసు హస్తం ఉందన్న ఆరోపణలు గాలి దుమారం లేపాయి. తాజాగా జస్టిస్ లక్ష్మి నర్సింహారావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడంతో పాటు హెచ్ ఆర్ సీలో కూడా ఫిర్యాదు చేశారు. దీన్ని బట్టి చూస్తే ఏరాసుకు కూడా సమీప భవిష్యత్తులో చిక్కులు తప్పవన్న వాదన వినిపిస్తోంది.
ఇక తాజాగా పార్థసారథి. కేపీఆర్ టెలి ప్రొడక్ట్ కంపెనీ విషయంలో ఆయన 2002 నాటి ఫెరా నిబంధనలను ఉల్లంఘిచారన్నది ప్రధాన ఆరోపణ. దీన్ని విచారించిన ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు పార్థసారథికి రెండునెలల జైలు శిక్ష కూడా విధించింది. ఆ వెంటనే బెయిల్ మంజూరైనా కిరణ్ కేబినెట్ లో చెలరేగుతున్న వివాదాల జాబితాలో మాత్రం ఒకరిగా చేరిపోయారు. మొత్తానికి మంత్రి పార్థసారథికి వ్యక్తిగతంగా ఐదు వేల రూపాయలు, కంపెనీకి ఐదు లక్షల 10వేల రూపాయల జరిమానా విధించింది. ఇక ఇటీవల ఆయన కుమారుడు కృష్ణా జిల్లాలో భూ వివాదం చిక్కుకోగా మంత్రి హోదాలో పార్థసారథి మీడియాకు వివరణ ఇవ్వలేక తెగ ఇబ్బంది పడ్డారు. ఈ గంపగుత్త పరిణామాలన్నీ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తాయో....
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more