వైసిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తలపెట్టిన చేనేత దీక్ష సెగపుట్టిస్తోంది. దీక్షాతేదీ దగ్గరపడుతుండటంతో రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరోవైపు విజయమ్మ పర్యటనను వ్యతిరేకిస్తూ సిరిసిల్లలో టిఆర్ఎస్ నాయకులు ఆందోళనలతో హోరెత్తించారు. వైసిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తలపెట్టిన దీక్ష.. సెగలు రేపుతోంది. చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఈ నెల 23న కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో విజయమ్మ దీక్ష చేపట్టనున్నారు. దీక్షను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు ప్రయత్నిస్తుండగా అడ్డుకునేందుకు టిఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇప్పటికే పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ అంతటా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అటు విజయమ్మ పర్యటనను వ్యతిరేకిస్తూ సిరిసిల్లలో టిఆర్ఎస్ కార్యకర్త వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. మరోవైపు టిఆర్ఎస్, వైసిపిల మధ్య స్థానికంగా పోరు తీవ్రమయింది. దీక్షను వ్యతిరేకిస్తూ టిఆర్ఎస్ కార్యకర్తలు విజయమ్మ దిష్టిబొమ్మను దహనం చేయగా ప్రతిగా వైసిపి నేతలు ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాకే విజయమ్మ సిరిసిల్లకు రావాలని టిఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. అనుకూల లేఖ ఇస్తే తానే గాక నియోజకవర్గ ప్రజలందరం సాదర స్వాగతం పలుకుతామని ఎమ్మెల్యే కెటిఆర్ స్పష్టం చేశారు. టిఆర్ఎస్, వైసిపిల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం నడుస్తోండటంతో విజయమ్మ దీక్షపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more