చంద్రబాబు తన కుటుంబ సభ్యులను ఉపయోగించుకోవాలా ఆయనకు బాగా తెలుసు. మండుతున్న నిప్పులపై నీళ్లు ఎలో చల్లాలో కూడా చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఇద్దరి మద్య మంటలు పుట్టించగలడు, వెంటనే వాటిని ఆర్పాగలడు? తమ పార్టీ విషయంలో కూడా అదే చేస్తున్నాడాని సీనియర్ పార్టీ నాయకులు అనుకుంటున్నారు. సంక్షోభంలో ఉన్న తెలుగుదేశం పార్టీని గట్టెక్కించేందుకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారట. పార్టీలో ఇబ్బందులను తొలగించాలంటే అంతకు ముందుగా కుటుంబంలో ఉన్న విభేదాలు తొలగించాలని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకోసం నడుం బిగించారట. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సిన నందమూరి కుటుంబం చెరో మాట మాట్లాడుతుండటం బాబును అసంతృప్తికి గురి చేస్తోందని అంటున్నారు.అందరిని ఏకత్రాటి పైకి తీసుకు వచ్చేందుకు హీరోలు నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ, తన తనయుడు లోకేష్ కుమార్ తదితరులతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. నారా - నందమూరి కుటుంబాల మధ్యనే కాకుండా, జూనియర్‌కి, హరికృష్ణకి బాలయ్యతో విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో బాబు తానే ముందుపడి అన్ని సమస్యలను పరిష్కరించాలని చూస్తున్నారని తెలుస్తోంది.
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయంపై దాడి హరికృష్ణలో తీవ్ర ఆగ్రహం కలిగించిందట. రాజకీయ కారణాలు లేవని హరికృష్ణ ప్రకటన చేసినప్పటికీ ఈ విషయంలో టిడిపిపై గుస్సాగా ఉన్నారట. తొలుత బాలయ్య, హరికృష్ణకు మధ్య సయోధ్య కుదుర్చాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇటీవల బాలయ్యతో సమావేశమై చర్చలు కూడా జరిపారని తెలుస్తోంది. హరికృష్ణతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారట. తన తనయుడు నారా లోకేష్ సమక్షంలోనే బాబు జూనియర్ ఎన్టీఆర్ అసంతృప్తిని చల్లార్చాలని భావిస్తున్నారట. పార్టీకి నందమూరి కుటుంబం ఆవశ్యకతను జూనియర్ దృష్టికి తీసుకు వెళ్లాలని భావిస్తున్నారని తెలుస్తోంది. లోకేష్ సమక్షంలోనే జూనియర్‌తో మాట్లాడితే మళ్లీ మళ్లీ ఇలాంటి మనస్పర్ధలు ఉత్పన్నం కావని బాబు భావిస్తున్నారని అంటున్నారు. గతంలో పలుమార్లు ఫ్యామిలీని బాబు కలిపారు. మరి ఈసారి కూడా ఆయన అనుకున్నది జరిగితే టిడిపికి వచ్చే ఎన్నికలలో ఎదురులేదంటున్నారు. మరి బాబు ప్రయత్నం ఎంత వరకు సాధ్యమౌతుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more