రాజకీయ నాయకులు ఎప్పుడు ఎలా మారుతారో ఎవరు చెప్పలేరు? ఇప్పుడు అదే బాటలో .. సాక్షి పేపరు, మీడియా కూడా చేరిందని కొంతమంది ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు అలా అనుకోవటం వెనుక కూడా కొంత నిజం దాగివుందని సీనియర్ మేథావులు అంటున్నారు. గతంలో.. జగన్, జగన్ మీడియా కలిసి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పై అనేక సార్లు నిప్పులు కక్కిన విషయం రాష్ట్ర ప్రజలకు తెలిసిన విషయమే. అయితే పరిస్థితుల ప్రభావం మరోలా మారిందని .. రాజకీయ నాయకులు అంటున్నారు.
జగన్ ఓదార్పు యాత్ర పేరుతో సోనియా గాంధీని, మన్మోహన్ సింగ్ ను .. తన మీడియాలో ఘోరంగా విమర్శలు చెయ్యటం అందరికి తెలిసిందే. అయితే ..తిట్టిన నోటితోనే .. అమ్మతో భేరానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఓటు కోసం .. కాంగ్రెస్ నాయకుడైన ప్రణబ్ ముఖర్జీ జగన్ పార్టీతో మంతనాలు జరిపినట్లు ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. జైల్లో జగన్ .. తన అధికార దహం కోసం .. మరో ప్లాన్ వేసినట్లు రాజకీయ నాయకులు అంటున్నారు. జగన్ తల్లి అయిన వైఎస్ విజయమ్మ చేత ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ ను కలిసే ఏర్పట్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ కలియక సారాంశం ఏమిటయ్య అంటే? ప్రణబ్ కు ఓటు వేయ్యాలంటే .. జగన్ కు బెయిల్ ఇవ్వాలనే కండీషన్ విజయమ్మ పెట్టినట్లు తెలుస్తోంది. విజయమ్మ కండీషన్ కు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు జగన్ పార్టీ నాయకులు అనుకుంటున్నారు.
వైఎస్ విజయమ్మ ఢిల్లీ నుండి రాగానే మీడియాతో జగన్ కు 15 రోజుల్లో బెయిల్ వస్తుందని చెప్పటంతో రాష్ట్ర ప్రజలు షాక్ తిన్నారని మీడియా వర్గాలు అంటున్నాయి. ఇక అప్పటి నుండి సాక్షి మీడియా, పేపర్లో గానీ, కాంగ్రెస్ పార్టీని , కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, విమర్శలు చేయటం మానుకోని .. మద్దతు ప్రకటిస్తున్నట్లు సాక్షి పత్రికలో ప్రకటించుకుందని తెలుగు దేశం నాయకులు అంటున్నారు. ఆ రోజు నుండి జగన్ పార్టీ వర్గీయులు కాంగ్రెస్ నాయకులపై కాకుండా .. తెలుగుదేశం పార్టీ నాయకులపై ద్రుష్టి పెట్టినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు మద్య పెద్ద యుద్దం మొదలైందని.. మీడియా వర్గాలు అంటున్నాయి. జగన్ నాయకులు , సాక్షి మీడియా , అందరు స్వరం మార్చి .. తెలుగుదేశం పార్టీ పై విమర్శ చేయటంతో ఆ పార్టీ నాయకులు .. కాంగ్రెస్ పార్టీ తో వైఎస్ జగన్ రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది టీడీపీ నాయకులు మీడియా అనటం విశేషం. ఏమైన సాక్షి స్వరం మార్చటం పై కొంత మంది ప్రజలు ఛీ.. కొడుతున్నట్లు కనపడుతుందని జగన్ పార్టీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more