కొన్నాళ్ల నుంచి దూరంగా ఉంటున్న బీసీలను దగ్గరకు చేర్చుకునేందుకు తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు బీసీ డిక్లరేషన్ ను క్షేత్ర స్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలని టీడీపీ నిర్ణయించింది. ఎంత మంచి పథకం ప్రవేశపెట్టిన ఆ పథకం ప్రజల దగ్గరకు చేరకపోతే ఏ లక్ష్యంతో దాన్ని ప్రవేశపెట్టామో దాని ఫలితాలు అనుకున్న స్థాయిలో రావని ఆ పార్టీ అంచనా వేస్తోంది. గత ఎన్నికల సమంయలో నగదు బదిలీ పథకానికి తగినంత ప్రచారం లేకపోవడంతో ప్రజలకు వివరించలేకపోయామన్న భావన పార్టీ శ్రేణుల్లో ఉంది. అయితే ఈసారి ఎన్నికలకు రెండేళ్ల ముందే బీసీ డిక్లరేషన్ ను విడుదల చేయడంతో ప్రజల్లోకి ఈ పథకాన్ని తీసుకెళ్లేందుకు తగిన సమయం ఉందన్న అభిప్రాయమూ ఉంది. డిక్లరేషన్ పై సీనియర్ బీసీ నేతలతో సమావేశమై క్షేత్ర స్థాయిలో బీసీల సంఘటితం చేసే దిశగా పార్టీ ఆలోచన చేస్తోంది. బీసీలకు అండగా ఉంటున్న భరోసా కల్పించాలని, బీసీల హక్కుల కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పోరాటం చేయాలని నిర్ణయించింది.
అటు కొందరు కార్యకర్తలు పార్టీ నేతల వైఖరిని అధినేత సమక్షంలోనే ఎండగడుతున్నారు. నాయకుల ఆధిపత్య పోరుతో పార్టీ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి గత వైభవం కోసం టీడీపీ ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేష్ ను ఎంతవరకూ అదరిస్తారో చూడాలి. వెనుకబడిన వర్గాలకు వంద సీట్లు కాదు..సమర్దులు ముందుకు వస్తే ఇంకా ఎక్కువ సీట్లు ఇస్తానని విపక్ష నేత,తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బిసిలకు తాము కచ్చితంగా సీట్లు ఇస్తామని అంటూ, దీనిపై కొందరు విమర్శలు , వ్యాఖ్యలు చేస్తున్నారని, తాను దానికి బాదపడనని చంద్రబాబు అన్నారు. విమర్శలు చేసేదానికన్నా, తనతో ఈ విషయంలో పోటీపడాలని ఆయన సవాల్ విసిరారు.తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం వ్యూహాత్మకంగా బిసి అనుకూల విధానాన్ని ప్రకటించి ముందుకు సాగాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఏడాది ముందుగానే వందమంది బిసిలకు అసెంబ్లీ టిక్కెట్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.ఆ తర్వాత ఆయా బిసి సంఘాలు చంద్రబాబును సత్కరించాయి. ఈ నేపధ్యంలో ఆయన మరింత హుషారుగా బిసిలకు మరిన్ని సీట్లు ఇస్తానని ప్రకటించడం విశేషం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more