దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోని మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకున్నా వారిలో ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉన్నారట. ఆ పార్టీ నాయకులు ఎక్కువ శాతం బినామీ పేర్లతో మహిళాలను లిక్కర్ టెండర్లు వేయించినట్లు సమాచారం. లాటరీ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించే పద్దతిని ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో భాగాంగా కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియా జరుగుతుందని మీడియా వర్గాలు అంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6వేల 564 లిక్కర్ షాపులకు 30 వేల వరకు ధరఖాస్తులు వచ్చినట్లు అధికారులు అంటున్నారు.
ఈ వేలం ద్వారా గత యేడాది ప్రభుత్వానికి 50 కోట్ల రూపాయల మేర ఆదాయం వస్తే.. ఈ సారి ఏకంగా 70 కోట్లకు చేరినట్లు అధికారుల సమాచారం. గతంలో ఒక దరఖాస్తుకు 10 వేలుంటే.. ఈ సారి 25వేలకు పెంచిటనట్లు తెలుస్తోంది. అయితే ఎజన్సీ ప్రాంతాల్లోని షాపులకు గిరిజనులకు కేటాయించడంతో.. కొందరు వ్యాపారులు వారితోనే బినామీ టెండర్లను దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే కొందరు సిండికేట్ వ్యాపారులు తమ వ్యూహాలకు పదును పెట్టినట్టు మీడియా వర్గాలు అంటున్నాయి.
మద్యం కోసం టెండర్లు వేసిన 30 వేల మందిలో ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులేనట. వారు బినామీ పేర్లతో మహిళల చేత టెండర్లు వేయించినట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో.. వ్యాపారం చేసిన బడా నాయకులే.. ఈసారి కూడా బినామీ పేర్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఒక పక్క మహిళలు మద్యం వద్దు అంటు గోల చేస్తుంటే.. ఇప్పుడు లాటరీ మద్యంలో ఎక్కువ శాతం మహిళలే టెండర్లు వేసినట్లు తెలుస్తోంది. వారి వెనుక వైఎసఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. ఒక వైట్ రేషన్ కార్డు ఉన్నావారు 10 లక్షలు, 20 లక్షలు కట్టి..టెండర్లు తీసుకోవటానికి సిద్దపడినట్లు తెలుస్తోంది. వీరి వెనక ఆర్థిక అవినీతి నాయకులు ఉన్నారని సామాన్య ప్రజలు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more