గనుల గజినీ గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ వ్యవహారం ఇప్పుడు ఏసీబీకి మారింది. గాలి నుంచి ముడుపులు తీసుకుని బెయిల్ మంజూరు చేశారని ఆరోపణల నేపథ్యంలో సిబిఐ మాజీ జడ్జి పట్టాభిరామారావుపై ఏసిబి కేసు నమోదు చేసింది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి బంధువు ధశరథరామారావు.. సోదరుడు గాలి సోమశేఖర రెడ్డి, రౌడీ షీటర్ యాదగిరి, మాజీ జడ్జి చలపతిరావు తోపాటు పట్టాభిరమారావు కుమారుడు రవీంద్ర..న్యాయవాది ఆదిత్య.. కంపిలి ఎమ్మెల్యే శ్రీరాములపై ఏసీబీ కేసుల నమోదు చేసింది.
వీరిపై ఐపీసీ 120B రెడ్ విత్ 34,109, 219 అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 8,9,13(1)(డి) 13(2) లు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన పట్టాభిరామారావు తో పాటు వీరంతా నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని..అవినీతి నిరోధక చట్టం ప్రకారం శిక్షార్హులని ఏసీబీ ఆరోపించింది. ఓబుళాపురం గనుల కుంభకోణంలో అరెస్టైన గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో గాలి బృందం ఈ అక్రమ మార్గాన్ని అనుసరించింది. ఫలితంగా మే 11న ఎట్టకేలకు గాలి జనార్దన్ రడ్డికి బెయిల్ మంజురు చేశారు.
అయితే జడ్జికి ముడుపులు చెల్లించి బెయిల్ పొందినట్లు సిబిఐ విచారణలో ప్రాధమిక ఆధారాలు లభించాయి. దీంతో మే 31న సీబీఐ మొదటి అదనపు జడ్జిగా ఉన్న పట్టాభిరామారావును సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. అనంతరం పట్టాభిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ కేసును సీబీఐ విచారించాల్సి ఉండగా సాంకేతిక కారణాల దృష్ట్యా ఏసీబీకి బదిలీ చేశారు. అయితే మళ్లీ భవిష్యత్ లో సిబిఐ ఈ కేసు డీల్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more