వివాదాస్ప జీవోలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆరుగురు మంత్రులకు నోటీసులు జారీ చేసింది. వీరిలో మోపిదేవి వెంకటరమణను సిబిఐ ఇది వరకు ప్రశ్నించింది. మరోసారి ఈ నెల 21వ తేదీన మళ్లీ ప్రశ్నించనుంది. వాన్‌పిక్ ప్రాజెక్టుకు భూముల కేటాయింపుపై మోపిదేవిని సిబిఐ ప్రశ్నించే అవకాశాలున్నాయి. అలాగే, వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో గనుల శాఖ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డిని సిబిఐ రెండు సార్లు ప్రశ్నించింది. దీనిపై సబితా ఇంద్రారెడ్డి శనివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి వివరణ ఇచ్చారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో మంత్రులను విచారించేందుకు సిబిఐ రంగం సిద్ధం చేసుకుంటోంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ అయిన 26 వివాదాస్పద జీవోలపై మరో ఇద్దరు మంత్రులను విచారించేందుకు నోటీసులు జారీ చేసే ప్రయత్నంలో సిబిఐ ఉన్నట్లు తెలుస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో భారీ పరిశ్రమల మంత్రిగా పనిచేసిన గీతా రెడ్డికి నోటీసులు జారీ అవకాశం ఉంది నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్యకు ఇప్పటికే నోటీసు జారీ అయింది.
గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బ్రాహ్మణి స్టీల్స్‌కు కడప జిల్లాలో భూమిని కేటాయిస్తూ జారీ అయిన జీవోపై సిబిఐ గీతా రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది. కాగా, జలయజ్ఝంలో పనులు కేటాయింపుతో పాటు ఇండియా సిమెంట్స్‌కు కృష్ణానది నుంచి 10 లక్షల గ్యాలన్ల నీటిని కేటాయిస్తూ అనుకూలంగా జీవో జారీ అయింది. దీనిపై పొన్నాల లక్ష్మయ్యను సిబిఐ ప్రశ్నించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మరి కొంత మంది ఐఎఎస్ అధికారులను కూడా సిబిఐ ప్రశ్నించే అవకాశం ఉంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ అయిన జీవోలపై, భూకేటాయింపులపై పొన్నాల లక్ష్మయ్య వరంగల్‌లో ప్రతిస్పందించారు. సుప్రీంకోర్టు తనకుపై చేసన అభియోగానికి రాతపూర్వకంగా ఇప్పటికే సమాధానం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. రేపు సిబిఐ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తానని, భూకేటాయింపులు చట్టబద్దంగానే జరిగాయని ఆయన చెప్పారు.కాగా, జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్ఎస్ఎ అధికారి బ్రహ్మానంద రెడ్డిని సిబిఐ అధికారులు వరుసగా రెండో రోజు శనివారం విచారిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు వారిని విచారిస్తారు.
మంత్రులను సిబిఐ ఎందుకు విచారిస్తుందంటే.. వారిని ఈ కేసు నుండి తప్పించేందుకేనని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. వారిని సాక్షులుగా విచారించి వారి మీద ఎలాంటి కేసులు లేకుండా చేసి వారిని ఈ కేసు నుండి తప్పించేందుకు విచారిస్తున్నారని కొంత మంది నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more