సినిమా హీరో అంటేనే వివిధ పాత్రలను విభిన్న పద్ధతుల్లో పోషించి అభిమానులను మెప్పించడమే వాళ్ళ పని. ఎంత స్టార్ డమ్ ఉన్న హీరో అయినా, కమేడియన్ అయినా అతీతులు కారు. ఇప్పటి వరకు కథాపరంగా ఎందరో హీరోలు, కమేడియన్లు లేడీ గెటప్ లు వేసి ప్రేక్షకులను అలరించారు. ఈ ట్రెండ్ బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం నుంచి వస్తున్నదే. బాలీవుడ్ ... కోలీవుడ్ ... టాలీవుడ్ ... ఇలా అన్ని భాషలలోని అగ్ర కథానాయకులంతా ఏదో ఓ సందర్భంలో లేడీ గెటప్ లో కనిపించి అభిమానులను అలరించిన వారే.
ఇక మన తెలుగు హీరోల విషయానికొస్తే చిరంజీవి ... బాలకృష్ణ ... వెంకటేష్ ... రాజేంద్ర ప్రసాద్ ... నరేష్ తదితరులు లేడీ గెటప్ లో థియేటర్స్ లో నవ్వుల జల్లు కురిపిస్తూ సందడి చేసినవారే. పెద్ద పెద్ద కమేడియన్స్ అయిన ఆలీ, బ్రహ్మానందం, లాంటి వాళ్ళు కూడా లేడీ గెటప్ లో అదరగొట్టినవారే. ఇప్పుడు వాళ్ళ సరసన మహేష్ బాబు కూడా అదే తరహాలో లేడీ గెటప్ లో సరదాల సందడి చేయబోతున్నారట.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్నసినిమాలో ఓ సీన్ డిమాండ్ చేయడంతో, తనదైన స్టైల్లో కామెడీని వర్కౌట్ చేసేందుకు మహేష్ బాబు లేడీ గెటప్ కి సిద్ధపడినట్లు తెలుస్తోంది. గతంలో 'బాల చంద్రుడు' సినిమాలో ఓ సన్నివేశంలో అమ్మాయి గెటప్ లో అలరించిన మహేష్ బాబు, హీరోగా లేడీ గెటప్ లో కనిపించడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన 'దూకుడు' ... 'బిజినెస్ మేన్' చిత్రాలలో హీమాన్ లా కనిపించిన మహేష్ బాబు, ఒక్కసారిగా లేడీ గెటప్ లో కనిపించనున్నాడనే విషయాన్ని అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేదే ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ నీయంశమైంది. అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరుతెచ్చుకున్న ఇతడిని పై గెటప్ లో ఉన్న ఫోటోని చూసి అమ్మాయిలు షాక్ తింటారేమో...
(ఈ ఫోటో నెట్ లో దొరికింది) ఇలా ఉంటాడని అందరు ఊహించుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more