Actress jayaprada likely to balakrishna

Actress Jayaprada likely to Balakrishna,Tirupathi, jayaprada,Amar Singh,Jayaprada,Jayaprada and Balakrishna,Jayaprada and TDP,Rampur MP Jayaprda,Samajwadi Party, tdp, samajwadi party, up assembly election 2012, hyderabad, andhra pradesh,Jayaprada supports Balakrishna

Actress Jayaprada likely to Balakrishna

Jayaprada.gif

Posted: 04/04/2012 04:50 PM IST
Actress jayaprada likely to balakrishna

Actress Jayaprada likely to Balakrishna

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై జయప్రద ప్రశంసలు కురిపించారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఆమె కాలినడకన తిరుమలకు వచ్చారు. మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు. చంద్రబాబు మంచి నాయకుడు అని కితాబు ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రానికి ఎలేని సేవలు అందించారని, కష్టపడి పని చేసే వ్యక్తిత్వమని అన్నారు.ఆయనకు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని జోస్యం చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు. తెలంగాణ అంశంపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు. తన జన్మదినం సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చినట్లు చెప్పారు.

శ్రీవారికి మొక్కు చెల్లించుకునేందుకు తిరుమలకు కాలినడకన గంటన్నర సమయంలో నడిచి వచ్చినట్లు చెప్పారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారు. రాజకీయాల్లో కొత్త జీవితం కొత్త ప్రణాళిక కోసం తాను స్వామి వారి ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చినట్లు చెప్పారు.తాను మళ్లీ రాజకీయ జీవితం ప్రారంభిస్తున్నానని అన్నారు. తన అదృష్టం బాగుండాలని స్వామి వారిని ప్రార్థిస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీర్వాదం ఉంటుందని చెప్పారు. కాగా జయప్రద 50వ పుట్టిన రోజు. ఆమె ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యురాలిగా ఉన్న విషయం తెలిసిందే.

అయితే హీరో నందమూరి బాలకృష్ణ అంటే జయప్రదకు ఎంతో అభిమానమని, పార్టీలకు అతీతంగా ఆయనకు తాను మద్దతిస్తానని ఉత్తరప్రదేశ్ రాంపూర్ పార్లమెంటు సభ్యురాలు జయప్రద అన్నారు. బాలకృష్ణ తనను ఎప్పుడు పిలిచినా సపోర్ట్ చేస్తానని చెప్పారు. ఆ కుటుంబంతో మంచి అనుబంధం ఉందన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావుపై అభిమానంతో తాను టిడిపిలో చేరానని చెప్పారు. ఎన్టీఆర్ కారణంగా తాను బాబుకు మద్దతు పలికానన్నారు. బాబు మంచి వాడు కాదని తాను చెప్పలేదన్నారు. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని బాగా పాలించారన్నారు. బాబు మంచి నాయకుడు అన్నారు.

Actress Jayaprada likely to Balakrishna

తనకు ఎపి పుట్టినిల్లు అని యుపి మెట్టినిల్లు అన్నారు. ఎపి రాజకీయాలంటో ఇష్టం అన్నారు. తెలుగు వారి అభిమానం వల్లే తాను ఎంపిని అయ్యానని చెప్పారు. వారి అండతోనే తాను రాజకీయంగా ఎదిగానన్నారు. పుట్టినిల్లు అంటేనే ఎవరికైనా అభిమానం ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఎపి రాజకీయాలు తెలంగాణ తదితర సమస్యలతో క్లిష్టంగా ఉందన్నారు. కఠిన సమస్యలను దాటాల్సి ఉందన్నారు. తాను ప్రస్తుతం యుపి రాజకీయాల్లో ఉన్నానని, ఇక్కడకు వచ్చినప్పుడు ఏ పార్టీలో చేరాలనే అంశంపై పెద్దలతో చర్చిస్తానని అన్నారు. ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన లేదన్నారు.

తాను ఎక్కడున్నప్పటికీ తెలుగు బిడ్డనే అన్నారు. ఏ స్థాయిలో ఉన్నప్పటికి తెలుగు వారిని మరిచిపోనన్నారు. బిఎస్పీ అధ్యక్షురాలు మాయావతిపై ఉన్న వ్యతిరేకత యుపిలో ఎస్పీని గెలిపించిందన్నారు. అజంఖాన్ తనను రాజకీయంగా ఎదుర్కొనక మహిళ అని చూడకుండా అశ్లీలంగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన మద్దతుదారులు ఓడినందుకు కుంగి పోవడం లేదన్నారు. రాజకీయాల్లో ఇవన్నీ సాధారణమే అన్నారు. గెలిచినప్పుడు ఆనందించానని, ఓడినప్పుడు మాత్రం నిరాశపడనని చెప్పారు. అది ఏ నాయకుడికి కూడా సరికాదన్నారు.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేశారని, అమర్ సింగ్ అందులో కీలక పాత్ర పోషించారన్నారు. అలాంటి కూటమి మళ్లీ వస్తుందా చూడాలన్నారు. నేను యుపిలో ఉన్నప్పటికీ ఎపి ప్రజలు నన్ను ఎప్పుడు ఆదరించారన్నారు. అక్కడ నా గెలుపు కోసం తెలుగు ప్రజలు చూశారన్నారు. తాను ఎపికి రావడానికి మధ్యంతర ఎన్నికలు కోరుకోనని చెప్పారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలోకి వెళ్లాలనే అంశాన్ని ఆలోచించడం లేదన్నారు. తన నియోజకవర్గానికి ఎంతో చేయాల్సింది ఉందన్నారు. తాను ఆంధ్రకు వస్తే ఇక్కడ ప్రతి ఆడబిడ్డకు న్యాయం చేస్తానన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shraddha das in off saree stills
Racha movie release details  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more