Ys jagan mohan reddy

ys jagan mohan reddy,burma, democracy, aung san suu kyi, UP cm Akhilesh yadav, YS Jagan, YSR Party,

ys jagan mohan reddy

Aung San Suu Kyi.gif

Posted: 04/04/2012 01:15 PM IST
Ys jagan mohan reddy

ys jagan mohan reddy

రాష్ట్రంలో జగన్ గురించి పెద్ద టాపిక్ నడుస్తుంది. ఏ ఇద్దరు వ్యక్తుల మాట్లాడుకున్న జగన్ విషయమేనని ఒక సర్వే తేల్చింది. జగన్ అరెస్టు అవుతాడా? లేదా? అనే విషయం కొంతమంది అయితే మరి కొంత మంది జగన్ చేస్తే ప్రచారం గురించి మాట్లాడుకుంటున్నారు. జగన్ ప్రచారంలో .. కొత్త చిలకపలుకులు పలుకుతున్నాడని.. ప్రజలు అంటున్నారు. నిన్న అఖిలేష్ తో పొల్చుకున్నా జగన్ . నేడు ఆంగ్ సాన్ సూకీ ని ఆదర్శంగా తీసుకుంటున్నాడట. అంతేకాకుండా .. జగన్ తులసి మొక్కలా ఎదగాలని అందరికి హితబోత చేస్తున్నాడట. అక్కడ అఖిలేష్ . ఇక్కడ జగన్ ? నేడు సూకీ జయాహో .. రేపు జగన్ జయహూ అనే ప్రకటనలు జగన్ ప్రచారంలో చేస్తున్నాడని .. ప్రజలు అంటున్నారు.

మయన్మార్ ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష నేత ఆంగ్‌సాన్ సూకీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ(ఎన్ఎల్‌డీ) దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. పోటీ చేసిన 44 స్థానాల్లో ఎన్ఎల్‌డీ 43 స్థానాలను కైవసం చేసుకుందని ఎన్నికల కమిషన్ అధి కారికంగా ప్రకటించింది. మయన్మార్ ఉక్కు మహిళ, ప్రజాస్వామ్య ఉద్యమకారిణి ఆంగ్‌సాన్ సూకీతో భారత్ విడదీయరాని అనుబంధం ఉంది. ఆమె విద్యాభ్యాసం భారత్‌లోనే సాగింది. మయన్మార్ చారివూతక ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించిన నేపథ్యంలో సూకీ త్వరలోనే భారత్ సందర్శించాలని కోరుకుంటున్నారు. ‘ఉప ఎన్నికల్లో మేము గొప్ప విజయాన్ని సాధించాం. ఈ నేపథ్యంలో నేను త్వరలోనే భారత్ రానున్నాను. అక్కడ ఉన్న నా మిత్రులందరిని కలుస్తాను. నేను చదువుకున్న లేడీ శ్రీరాం కళాశాలను సందర్శిస్తాను’ అని సూకీ తెలిపారు.

అంతకుముందు విపక్ష ఎన్‌ఎల్డీ అధినేత ఆంగ్‌సాన్ సూకీ అంతా ఊహించినట్లే.. మయన్మార్‌లో ప్రజాస్వామ్య పుష్పం వికసించింది. సైనిక పాలకుల కర్కశ నిర్బంధాలు, ఉక్కు పాలనను ఎదురొడ్డి నిలిచిన ప్రజాస్వామ్య ఉద్యమ సారథి ఆంగ్‌సాన్ సూకీనే చిరస్మరణీయ విజయం వరించింది. తాజ చరిత్రాత్మక ఉప ఎన్నికల్లో సూకీ నేతృత్వంలోని విపక్ష పార్టీ ఎన్‌ఎల్డీ విజయ దుందుభి మోగించింది. ఉక్కు సంకల్పంతో నియంతృత్వ పాలకులను ఎదురించి... అహింసాపథంలో ఆమె సాగించిన అలుపెరగని పోరాటానికే ప్రజలు పట్టం కట్టారు. సూకీని తొలిసారి పార్లమెంటుకు పంపారు. ఆమె విజయం.. సైనిక నియంతల పాలనలో మగ్గి.. ప్రజాస్వామిక హక్కుల ఊసే లేకుండా చీకటి బతుకులు గడిపన బర్మా వాసుల్లో కొత్త ఆశ చిగురింపజేసింది. ఒక కొత్త వేకువ, నవ శకం దిశగా అంకురార్పణ చేసింది. దేశ రాజకీయ గతిని మార్చే కీలక మైలురాయిగా నిలిచింది. అధికారిక ఫలితాల వెలువడకముందే విజయోత్సవాల్లో పాల్గొన్న సూకీ ఈ విజయం ప్రజావిజయమని, దేశంలో నవశకానికి ఆరంభమని ఉద్ఘాటించారు.

Akhilesh

మయన్మార్‌లో జరిగిన చారిత్రక ఉపఎన్నికల్లో ప్రజాస్వామ్య ఉద్యమ సారథి, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, విపక్ష ఎన్‌ఎల్డీ అధినేత ఆంగ్‌సాన్ సూకీ అత్యధ్బుత విజయాన్ని సాధించారు. తొలిసారిగా పార్లమెంటుకు పోటీ చేసిన సూకీ గెలుపొందారు. ఆమె నేతృత్వంలోని ఎన్‌ఎల్డీ 44 స్థానాల్లో పోటీ చేయగా, 40 నియోజకవర్గాల్లో విజయబావుటాను ఎగురవేసింది. ఈ మేరకు మయన్మార్ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రభుత్వ టెలివిజన్‌లో అధికారిక ఫలితాలను వెల్లడించారు. పార్లమెంటు దిగువ సభలో ఎన్‌ఎల్డీ 35 స్థానాలు గెలుపొందిందని, అలాగే మూడు సెనేట్ స్థానాలను, రెండు ప్రాంతీయ అసెంబ్లీ స్థానాలను కూడా ఆ పార్టీ సొంతం చేసుకుందని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. మరో ఐదు స్థానాలు ఫలితాలు ఇంకా వెల్లడించలేదు. దీంతో దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక వాదులు, ఎన్‌ఎల్డీ శ్రేణుల ఆనందోత్సవాలు అంబరాన్ని తాకాయి.

అంతకుముందు విపక్ష ఎన్‌ఎల్డీ అధినేత ఆంగ్‌సాన్ సూకీ సుదీర్ఘ కాలంలో సైనిక అణచివేతలో మగ్గిన మయన్మార్‌లో తమ గెలుపు నూతన శకానికి ఆరంభమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య సంస్కరణల కోసం రాజకీయ పార్టీల ఐక్యతకు పిలుపునిచ్చారు. పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోటీచేసిన సూకీ విజయం సాధించారని విపక్ష నేషనల్ లీగ్ ఫర్ డెమొక్షికసీ(ఎన్‌ఎల్డీ) ప్రకటించడంతో ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద సంబరాలు చేసుకుంటున్న తన మద్దతుదారులను ఉద్దేశించి ఆంగ్‌సాన్ సూకీ విజయ ప్రసంగం చేశారు. ‘మనం సాధించిన విజయం ప్రజావిజయం’ అని ఆమె పేర్కొన్నారు. ‘ఇది మన విజయం కాదు. దేశ రాజకీయ ప్రక్రియలో పాలుపంచుకోవాలని నిర్ణయించిన ప్రజల విజయం’ అని ఉద్ఘాటించారు.

‘సూకీ జయహో’ అని నినాదాలు చేస్తూ.. విజయ సంకేతంతో సంబరాలు చేసుకుంటున్న తన మద్దతుదారులను ఉద్దేశించి.. ‘ఇది నవ శకానికి ఆరంభమని ఆశిద్దాం’ అని ఆమె పేర్కొన్నారు. ‘ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీలన్నీ మాకు సహకరిస్తాయని ఆశిస్తున్నా. దేశంలో సరైన ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పేందుకు మద్దతిస్తాయని భావిస్తున్నా’ అని ఆమె తెలిపారు. రాజకీయ బందీగా ఏళ్ల తరబడి నిర్బంధంలో గడిపిన సూకీ..తాజా ఉప ఎన్నికల్లో గెలుపుతో పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. అంతేకాకుండా సైన్యం ప్రభావిత సభలో కొంతమంది చట్టసభ ప్రతినిధులకు నాయకురాలిగా ఆమె తన గళం వినిపించనున్నారు.

ఎన్నో సంవత్సరాల సైనిక కర్కశ పాలనలో మగ్గిన మయాన్మార్‌లో సూకీ విజయం ఓ కీలక మైలురాయి కానుంది. ప్రజాస్వామ్య సంస్కరణలకు పరీక్షగా భావించిన ఈ ఎన్నికల్లో ఆమె గెలుపు దేశంలో నాటకీయ మార్పులకు నాంది కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మయన్మార్‌లో ఎన్నో ఏళుగ్లా అధికారం చలాయించిన సైనిక పాలనకు గత ఏడాది తెరపడింది. ఆ తర్వాత పాక్షిక పౌర (క్వాజీ-సివిల్) ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం సైనిక అధికారుల కన్నుసన్నల్లో సాగుతూ.. వారి ప్రాబల్యం ఉన్నది. ఇలాంటి సందిగ్ధ రాజకీయ వాతావరణంలో సూకీ గెలుపు దేశాన్ని ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేయిస్తుందని భావిస్తున్నారు. ఇప్పుడిపుడే తెరపైకి వస్తున్న ప్రజాస్వామ్య, ఆర్థిక సంస్కరణల వైపు పాక్షిక పౌర ప్రభుత్వం దృష్టి సారించవచ్చునని భావిస్తున్నారు.

hi-ang-san-suu-kyi-

ఇప్పడు జగన్ కూడా సూకీ తో పొల్చుకుంటున్నాడు. సూకీలాగా జైల్లో కొన్ని సంవత్సరాలు ఉండి వచ్చిన తరువాత .. సూకీ విజయం సాధించింది. అలాగే జగన్ కూడా జైల్లో ఉండి .. బయటికి వచ్చిన తరువాత తమ పార్టీ రికార్డు స్థాయిలో గెలుపొందుతుందని జగన్ అంటున్నారట. అంతేకాకుండా చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విలువలు, నిజాయితీని బయటకు తీసుకురావడానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, ఇటువంటి వ్యవస్థలో మనమంతా తులసి మొక్కల్లా ఎదగాలని తమ పార్టీ నేతలను ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌డ్డి అన్నారు. పాలకులు ఇష్టంలేని వారిపై కేసులు పెడతారని, పోలీస్‌స్టేషన్లలో పెడతారని పేర్కొన్నారు. ఇటువంటి వాటికి అన్నింటికి సాహసించే 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన తొలి విడత ప్రచారం నిర్వహించారు.

'రాజకీయాల్లో తులసి మొక్కలా ఎదుగుదామని జగన్ అంటున్నారు. ఆయనే లక్ష కోట్ల తులసి మొక్క. డబ్బు ధీమాతో ఆయనకు మిగిలినవారంతా కలుపు మొక్కల్లా కనిపిస్తున్నారు. ఆయన ఏం చెప్పినా ఎవరు తులసి మొక్కలో.. ఎవరు క లుపు మొక్కలో.. ఎవరు విషపు మొక్కలో ప్రజలు అర్థం చేసుకోగలరు వైఎస్ రాజశేఖరరెడ్డి పోషించిన కలుపు మొక్క ఇప్పుడు వటవృక్షంగా ఎదిగిందని, ఎటు నుంచి చూసినా దానిలో లక్ష కోట్ల దోపిడీ, బోగస్ కంపెనీల సృష్టి, ఆరు దేశాల నుంచి జరిగిన మనీ లాండరింగ్, సాక్షి మీడియా, భారతి సిమెంట్స్ వంటివే కనిపిస్తున్నాయని తెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan teja to share screen space with amitabh bachchan
Jagan case arrests worry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more