నుపుర్ మెహతా... వారం రోజుల క్రితం దేశంలో ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ క్రికెటర్లతో మ్యాచ్‌లు ఫిక్సింగ్ చేయించడానికి ఈ బాలీవుడ్ నటిని ఉపయోగించుకున్నామని ఒక బుకీ చెప్పడంతో ఒక్కసారిగా ఈమెకు డిమాండ్ పెరిగింది. ఈ వార్త బయటకు వచ్చిన రోజు తనకేం తెలియదన్న నుపుర్... తాజాగా ‘క్రికెటర్లతో డేటింగ్ చేస్తే తప్పేంటి’ అని ప్రశ్నిస్తోంది. మ్యాచ్ ఫిక్సింగ్ అంశంలో ఈమె విషయంలో కొత్త అనుమానాలు వచ్చేలా వ్యాఖ్యలు చేసింది.
గత కొన్ని రోజులుగా బాలీవుడ్లో మారుమ్రోగుతున్న పేరు 'నుపుర్ మోహతా'. 2005లో సన్నీ డియోల్ హీరోగా వచ్చిన 'జో బోలే సో నిహాల్' చిత్రంలో వ్యాంప్ పాత్ర పోషించి బాలీవుడ్లో అరంగేట్రం చేసింది. ఇటీవల మ్యాచ్ ఫిక్సింగ్ కోసం బాలీవుడ్ నటిని ఎరగా వాడుకున్నామని, ఢిల్లీకి చెందిన బుకీ ఒకరు సండే టైమ్స్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడించిన సందర్బంలో ఈ కథనానికి బాలీవుడ్ నటి నుపుర్ మోహతా ఫోటోని ప్రచురించారు. దీంతో నుపుర్ మోహతాకు ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.
మొదట్లో ఈ కథనం గురించి మీడియా నుపుర్‌ని ప్రశ్నించగా... నాకు ఫిక్సింగ్‌కి ఎటువంటి సంబంధం లేదని కొట్టి పారేసింది. ఐతే వారం రోజులు గడవక ముందే నుపుర్ కొత్త విషయాలను బయట పెట్టింది. ఇంతకీ ఆ కొత్త విషయాలు ఏంటంటే... 2009లో ఇంగ్లాండ్‌లో జరిగిన టి20 ప్రపంచకప్ సందర్బంగా శ్రీలంక ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్‌తో డేటింగ్ చేశానని తెలిపింది. దిల్షాన్‌తో కలసి క్యాసినోకు వెళ్లడంతో పాటు అనేక మంది క్రికెటర్లను కలిశానని నుపుర్ వెల్లడించింది.
అయితే వాళ్ల పేర్లు చెప్పను. అయితే అది నా వ్యక్తిగత జీవితం. డేటింగ్ చేసినంత మాత్రాన ఫిక్సింగ్ చేసినట్లా? నేను సింగిల్. ఆకర్షణీయంగా ఉంటాను. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి ఎవరినైనా కలిసే స్వేచ్ఛ నాకుంది. ఆ టోర్నీ సమయంలో నేను కెన్సింగ్టన్‌లోని రాయల్ గార్డెన్ హోటల్లో కొన్ని రోజులు ఉన్నాను (క్రికెటర్లంతా ఇదే హోటల్‌లో బస చేశారు). హోటల్ బిల్ రోజుకు 500 పౌండ్లు (రూ. 40 వేలు) కూడా నేనే కట్టాను. నా దగ్గర బిల్స్ కూడా ఉన్నాయి. ఆ హోటల్‌లో క్రికెటర్లు ఉన్నారని నాకు తెలుసు. కానీ వాళ్లతో నాకు పరిచయం లేదు. నా సోదరుడు యూకేలోనే నివసిస్తాడు. నేను యూరోపియన్ దేశాల్లో పెద్ద మోడల్‌ని. షాపింగ్ కోసం లండన్‌కు వెళుతుంటాను. నామీద కథనం రాసిన పత్రికపై కేసు వేస్తున్నాను. ఇంగ్లండ్ జట్టు ప్రపంచకప్‌లో సరిగా ఆడలేదు. అందుకే ఆ దేశ పత్రికలు ఇలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ కథనాలు రాస్తున్నాయి’.
తాను శ్రీలంక క్రికెటర్ దిల్షాన్‌తో డేటింగ్ చేసిన మాట నిజమే కానీ...మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి వ్యవహారాల్లో పాల్గొని తప్పు చేయలేదు అంటోంది బాలీవుడ్ హాట్ భామ నుపుర్ మెహతా. బుకీలు క్రికెటర్లకు ఆమె అందాలు ఎరగా వేసి వారిని ఫిక్సింగ్‌లోకి లాగే వారని ది సండే టైమ్స్ మేగజైన్ గతంలో కథనం వెలువరించిన విషయం తెలసిందే. అప్పుడు ఆ వార్తలను ఖండించిన నుపుర్ తాజాగా దిల్షాన్‌తో తనకు ఉన్న సంబంధాన్ని బట్ట బయలు చేసి సంచలనం సృష్టించింది. 2009 టి-20 వరల్డ్ కప్ సమయంలో తాను అతనితో కలిసి తిరిగానని, అతని ద్వారా చాలా మంది క్రికెటర్లు పరిచయం అయ్యారని అంటోంది. అయితే తనకు మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి వ్యవహారాలతో సంబంధం లేదు అంటోంది. దిల్షాన్‌తో ఎఫైర్ తన వ్యక్తిగత విషయమని అంటుంది.
నుపుర్ ప్రశ్న బాగానే ఉంది. క్రికెటర్‌తో పరిచయం ఉంటే ఫిక్సింగ్ చేసినట్లేనా? అని అమాయకంగా అడగటం కూడా కరెక్టే. కానీ నుపుర్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది.
1. సొంత సోదరుడు ఇంగ్లండ్‌లోనే ఉంటే రోజుకు 500 పౌండ్లు (రూ. 40,000) ఖర్చు చేసి హోటల్లో ఉండాల్సిన అవసరం ఏమిటి?
2. ఆ సమయంలో హోటల్‌లో తనతో పాటు ఒక బుకీ ఉన్నాడని ‘ది సండే టైమ్స్’ కథనంలో ఉంది. ఆ వ్యక్తి గురించి ప్రశ్నించినా ఎందుకు చెప్పడం లేదు?
3. దిల్షాన్ పేరు ఓపెన్‌గా చెప్పినప్పుడు... క్యాసినోలో కలిసిన మిగిలిన క్రికెటర్ల గురించి ఎందుకు చెప్పడం లేదు?
4. షాపింగ్‌కు లండన్ వెళితే కెన్సింగ్టన్‌లో క్రికెటర్లు ఉన్న హోటల్‌లోనే ఎందుకు ఉండాలి? సెంట్రల్ లండన్‌లో షాపింగ్‌కు దగ్గరగా అనేక హోటల్స్ ఉండగా ఈ హోటల్‌లోనే రూమ్ ఎందుకు బుక్ చేసుకున్నారు?
నిజానికి నుపుర్ మెహతా... దిల్షాన్‌తో డేటింగ్ చేశానని చెప్పడం అనుమానాలను పెంచే అంశమే. ఎందుకంటే 2009 ప్రపంచకప్ తర్వాత దిల్షాన్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. ఒక దశలో ఐసీసీ... దిల్షాన్‌పై విచారణ చేపట్టిందనే కథనాలూ వచ్చాయి. పోయి పోయి అదే సమయంలో దిల్షాన్‌తోనే ఉన్నానని నుపుర్ చెప్పడం వల్ల... క్రికెట్ వర్గాల్లో కూడా ఈమె గురించి అనుమానాలు మొదలయ్యాయి.
ఇన్నాళ్లూ ఆధారాలు లేవని ఈ అంశాన్ని ‘లైట్’ తీసుకున్న వాళ్లు కూడా ఇప్పుడు ఈమెను అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది
నుపుర్ తాజా ప్రకటనతో ఇతర భాలీవుడ్ భామల్లోనూ భయం మొదలైంది. బాలీవుడ్ భామలు క్రికెటర్లకు ఎరగా మారుతున్నారని ఇప్పటి వరకు కేవలం ఊహాగానాలు మాత్రమే ఉండేవి. తాజాగా నుపుర్ ఆ ఊహాగానాలను నిజం చేసింది. దీంతో ఇలాంటి వ్యవహరాల్లో సంబంధం ఉన్న మరికొందరు భామాలపై కూడా ఆరా తీస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more