బాబు చాలా చిరాకుగా ఉన్నాడట. బాబుకు రావాలసిన ఆహ్వానం రాలేదట. దానిపై బాబు చాలా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారట. బాబు ఒక్కడే కాకుండా తన ఎమ్మెల్యేలను కూడా ఆ పని మీదే ఉంచారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ఎందుకంటే ..బాబు మనస్సులో ఇలా అనుకుంటున్నారు . జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పా! ఇంటర్వ్యూలు చేసి మరీ ప్రధానులను ఎంపిక చేశా! రాష్ట్రపతి స్థానంలో ఎవరుండాలో డిసైడ్ చేసింది నేను. నేనే వెళ్లకపోతే ఎట్లా..! ఏదో ఒకటి చేసి నాకు ఆహ్వానమందేలా చూడాలి.. అంటూ బాబు గత నాలుగైదు రోజులుగా పార్టీ నేతల ముందు తెగ హడావుడి చేస్తున్నారు.
అసలు విషయమేంటని ఆరా తీస్తే... ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్ యాదవ్ తనయుడు అఖిలేష్ యాదవ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి హాజరుకావాలని ఆయన తెగ తాపత్రయపడుతున్నారట. దేశంలో చాలా మంది నేతలకు ఆహ్వానాలు అందినా.. బాబు ఓ కార్డు ముక్కా రాలేదు. ‘ఆహ్వానం రాకుండా ఎలా వెళ్తాం? అందుకే సమాజ్‌వాదీ నేతల్లో ఎవరో ఒకరిని పట్టుకుని ఆహ్వానమందేలా చూడండి’ అని ఓ సహచరుడిని తెగపోరుతున్నారు. ‘అక్కడేమో మనల్ని పట్టించుకునే నాథుడే లే డు. ఈయనేమో లక్నోకు ఫ్లయిట్ టికెట్ కూడా బుక్ చేయించుకున్నాడు. ఇప్పుడేం చేయాలో అర్థం కావడంలేదు’ అంటూ ఆ నాయకుడు తల పట్టుకుంటున్నాడు. మరోసారి ట్రై చేయకపోయారా అంటే...! ‘నేనే కాదు.. మరో నలుగురు ఇదే పనిలో ఉన్నారు.
కానీ నన్ను ఎవరు ఖాతరు చేసేదెవరు’ అంటూ రుసరుసలాడారు. పోనీ ఆయన్నే డెరైక్టుగా మాట్లాడుకోమనకపోయారా అని అడగ్గా.. ‘అది కూడా అయింది. ఇప్పుటికి నాలుగుసార్లు ములాయంకు ఫోన్ చేసి అభినందించారు. రానున్న కాలంలో కేంద్రంలో మీరే నాయకుడంటూ పొగడ్తల్లో కూడా ముంచెత్తారు. అయినా రమ్మనలేదు. అయినా దైవజ్ఞుడికి ఆహ్వానమెందుకు... పిలుపు రాకపోయినా.. డెరైక్ట్‌గా వెళ్లి కార్యక్రమంలో కూర్చుంటే సరి’ అని అనేశారు. కాగా అఖిలేష్ ప్రమాణ కార్యక్రమానికి తమ నేతకు ఆహ్వానం అందిందని తమ్ముళ్లు ప్రచారం చేస్తుండడం విశేషం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more