యుపిలో ఎస్‌పి ఘనవిజయం సాధించగా, ప్రస్తుతం ఆ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌ను ఆ పార్టీ సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు ఎన్నుకుంది. ఈ అంశంపై సమావేశమైన బోర్డు ములాయాన్ని శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కిరణ్మయి నందా ప్రకటించారు. హోలీ పండుగ అనంతరం సమావేశంకానున్న శాసనసభాపక్ష సమావేశంలో లాంఛనప్రాయంగా ప్రకటన చేయనున్నట్లు చెప్పారు. అయితే, ఎస్‌పి అధినేత కుమారుడు అఖిలేష్ యాదవ్‌కు ములాయం ఈ కిరీటాన్ని అందించనున్నట్లు పార్టీ అంతర్గత వర్గాలు తెలిపాయి.
ముఖ్యమంత్రి పదవికి ములాయాన్ని ఇప్పటికే ఆ పార్టీ బోర్డు ఎన్నుకున్నట్లు కూడా ఆ వర్గాలు తెలిపాయి. అయితే ఆ పదవిని తనే అధిష్టిస్తారా లేదా కుమారునికి ముఖ్యమంత్రి పదవిని కట్టబెడతారా అనేది ములాయం నిర్ణయంపైనే ఆధారపడి ఉన్నట్లు పేర్కొన్నాయి. జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశానికి అధినేత ములాయంతోపాటు, పార్టీ ప్రధాన కార్యదర్శి శివపాల్ సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, నంద తదితరులు హాజరయ్యారు. కాగా ములాయం, అఖిలేష్ యుపి గవర్నరును కలిసారు.
సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి కావాలని పార్టీ కార్యకర్తలు, నేతలు చాలా మంది కోరుకుంటున్నారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుల్లో చాలామంది ఈ మేరకు డిమాండ్ చేశారు. దీనిపై చర్చించేందుకు ఇక్కడ సమావేశమైన బోర్డు సభ్యులు యువతను పార్టీలోకి ఎక్కువగా ఆకట్టుకునేందుకు గానూ అఖిలేష్ యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై అంతిమ నిర్ణయం మాత్రం పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌దే. ''మెజారిటీ ఎంఎల్‌ఎలు అఖిలేష్‌ను సిఎంగా చూడాలనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more