విప్‌ను ధిక్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన 16 మంది జగన్ వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించిన అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎమ్మెల్సీల కేసుపై దృష్టి పెట్టింది. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మండలి సభ్యులపై చర్యలకు సిద్ధపడుతోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీపై అనర్హత వేటు వేయాలంటూ కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదు శాసనమండలి చైర్మన్ చక్రపాణి వద్ద విచారణలో ఉంది. వారంలో లేదా మండలి సమావేశాలు ముగిసేలోగా ఈ ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. మరో ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌పై చర్య తీసుకోవటానికి సంబంధించి సాంకేతిక అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ద్వారా మండలిలో స్థానం సంపాదించి, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ బహిరంగ విమర్శలు సంధిస్తున్న ఎమ్మెల్సీలపై వేటుకు ఏమాత్రం వెనకంజ వేయరాదని కాంగ్రెస్ సిద్ధమైనట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు కొండా మురళీధర్‌రావు, ఎస్‌వీ చంద్రమోహన్‌డ్డి, పుల్లా పద్మావతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌కు మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. అంతేకాక అతను నిర్వహించే కార్యక్షికమాల్లో పాల్గొంటూ కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో వీరిపైనా అనర్హత వేటువేయాలని మండలిలో ప్రభుత్వ విప్ శివరామిడ్డి నెల కిందటే చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన ఆ ముగ్గురికి నోటీసులు పంపి వివరణ కోరారు. వివరణ ఇవ్వడానికి కొంత గడువు కావాలని వారు చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రస్తుతం మండలి సమావేశాలు జరుగుతున్నందున అవి ముగిసేలోపే వారిపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తున్నది. గతేడాది డిసెంబర్ అయిదో తేదీన అసెంబ్లీలో కిరణ్ సర్కార్‌కు వ్యతిరేకంగా టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు 16 మంది జగన్ వర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ విప్ ధిక్కరించి ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు.
పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినవారిపై అనర్హత వేటువేయాలని అప్పట్లో ప్రభుత్వ విప్ కొండ్రు మురళీమోహన్ అసెంబ్లీ స్పీకర్ మనోహర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై సుమారు రెండు నెలలు విచారణ జరిపిన స్పీకర్ 2న వారిని అనర్హులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. స్పీకర్ నిర్ణయం వెలువడటంలో చోటుచేసుకున్న జాప్యంపై పార్టీ సీనియర్ల నుంచి విమర్శలు వచ్చాయి. పార్టీని ధిక్కరించిన ఎమ్మెల్యేలపై వేటుకు కాంగ్రెస్ భయపడుతోందని, అందుకే స్పీకర్ నిర్ణయంలో జాప్యమంటూ బయటి వారి నుంచేకాక సొంత పార్టీ నుంచీ విమర్శలొచ్చాయి. ఎట్టకేలకు ఆ ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేశారు.
జగన్ శిబిరంలో చేరిన నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌డ్డి రాజీనామాను లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఆమోదించడం, ఆ తర్వాత మూడు రోజులకే అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ 16 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ తీర్పు చెప్పడంతో ఇక ఎమ్మెల్సీల అనర్హత కేసు విచారణ కూడా వేగం పుంజుకున్నట్లు పార్టీలో వినిపిస్తున్నది. 29 వరకు మండలి సమావేశాలు జరగనున్నాయి. ఆలోగానే ఈ ముగ్గురు ఎమ్మెల్సీలపై వేటు ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముగ్గురు ఎమ్మెల్సీల్లో కొండా మురళి (వరంగల్), ఎస్‌వీ చంద్రమోహన్ రెడ్డి (కర్నూలు) స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి ఎన్నికైనవారే. మరో ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి (వరంగల్) అసెంబ్లీ నియోజకవర్గ కోటాలో మండలికి ఎన్నికయ్యారు.
ఈ ముగ్గురు కూడా కాంగ్రెస్ సభ్యుల ద్వారానే ఆ పార్టీ గుర్తుపైనే ఎన్నికవడంతో వీరిపై వేటు ఖాయమంటున్నారు. జగన్‌కు మద్దతుగా నిలిచిన మరో ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావుపైనా వేటుకు సాంకేతిక సాధ్యసాధ్యాలను పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. ఆయన గవర్నర్ కోటాలో మండలికి నామినేటయ్యారు. ఇలా నామినేటయ్యేవారికి ముఖ్యమంత్రి నుంచి పేర్ల జాబితా వెళుతుందని, పైగా జూపూడి పలుమార్లు కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశాలకు కూడా హాజరై రిజిస్టర్‌లో సంతకాలు చేయడంతో ఆయన్ని సాంకేతికంగా కాంగ్రెస్ సభ్యుడిగానే పరిగణించాల్సి ఉంటుందని, ఈ కారణాలు చూపి అతనిపై వేటుకు ఫిర్యాదు చేయాలని అధికార పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలపై వేటుపడటంతో ఇక ఎమ్మెల్సీల అనర్హత కేసుపై పార్టీ దృష్టిసారించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం ఊపందుకున్నది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more