Senior ips officer umesh kumar

Senior IPS officer Umesh Kumar,Senior IPS officer Umesh Kumar, presently working as chairman of the writ petitions filed by DGP V Dinesh Reddy,

Senior IPS officer Umesh Kumar

Umesh Kumar.gif

Posted: 01/20/2012 07:13 PM IST
Senior ips officer umesh kumar

Senior IPS officer Umesh Kumar

స్వాతంత్య్రం రాకముందు దేశం అగ్నిశిఖలా ఉండేది. మహాత్మాగాంధీ లాంటి వాళ్లు అహింస అనే ఆయుధంతో, భగత్‌సింగ్, సుభాష్‌చంద్రబోస్ లాంటి వాళ్లు హింస అనే ఆయుధంతో ఆ అగ్నిని చల్లార్చడానికి ప్రయత్నించారు. ఎట్టకేలకు స్వతంత్రం వచ్చింది. ఆ అగ్ని కూడా చల్లారిందని అందరూ భావించారు. కానీ అది పూర్తిగా చల్లారలేదు. అవినీతి రూపంలో ఇంకా మిణుకు మిణుకు మంటూనే ఉంది. దానిని పూర్తిగా చల్లార్చడం ఎలా? ఆ శక్తి ఎవరికుంది? అనే ప్రశ్నలకు సమాధానంగా దొరకటం చాలా కష్టం. 

కంచే చేను మేసింది. ప్రాణాలకు తెగించి పోరాడే వీరులకిచ్చే ఇళ్లస్థలాల్లో వాటాల కోసం కక్కుర్తి పడింది. తన పేరుతోనే కాదు.. భార్య, కుమార్తె, ఎక్కడో ఉన్న సోదరుడి పేర్లను కూడా పెట్టి స్థలాలు రాబట్టింది. ఇంతాచేశాక ఆ స్థలాలు కాస్తా అల్లిబిల్లి మలుపులు తిరిగిన ఔటర్ రింగురోడ్డు మాయాజాలంలో కొట్టుకుపోతే, ప్రత్యామ్నాయంగా.. శంషాబాద్‌లో రూ.35 కోట్ల విలువచేసే ఏడు ప్లాట్లు పొంది ధైర్యసాహసాలతో, రుజువర్తనతో అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి చేతివాటం కథ ఇది. ఆయనో పోలీసు ఉన్నతాధికారి . ఎవరైన తప్పు చేస్తుంటే చర్య తీసుకోవాలి. కానీ ఇంటి స్థలానికి ఆశపడి తానే తప్పు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకే ప్లాటు పొందాల్సి ఉండగా కుటుంబ సభ్యుల పేర్లుతో మొత్తం నాలుగు ప్లాట్లు సంపాదించారట.

ఆ ఐపీఎస్ అధికారి ఎవరో కాదు.. రకరకాల వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచే ఉమేష్ కుమార్. వివరాల్లోకి వెళ్తే... ఇళ్లులేని గ్రేహౌండ్స్ పోలీసుల కోసం 2001లో "రాక్ వ్యూ ఎన్‌క్లేవ్ గ్రేహౌండ్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ''ని స్ధాపించారు. ఈ సొసైటీలోని సభ్యులకు మాత్రమే కుటుంబానికి ఒక్కో ప్లాట్ చొప్పున ఇవ్వాలని తీర్మానించుకున్నారు. అప్పట్లో గ్రేహౌండ్స్ విభాగానికి ఉమేష్ కుమార్ అధిపతిగా ఉన్నారు. 

హైదరాబాద్‌లోని అత్యంత విలాసవంతమైన ప్రదేశాల్లో ఒకటైన ప్రశాసన్‌నగర్‌లో అప్పటికే ఆయనకు ఐపీఎస్‌ల కోటాలో ఇంటి స్థలం రాగా.. అందులో అత్యాధునిక భవంతిని కూడా నిర్మించుకున్నారు. అంతటితో తృప్తి పడక.. ఆ ఇంటి చిరునామానే పెట్టి మరీ గ్రేహౌండ్స్ సొసైటీలో నాలుగు ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తనతోపాటు.. తన భార్య అల్కా కాబ్ర, 20 ఏళ్ల కుమార్తె కానుప్రియ కాబ్రతో పాటు విప్రోలో సిస్టం ఇంజనీర్‌గా పనిచేస్తున్న తన సోదరుడు మనీష్‌ల పేరిట ఆ దరఖాస్తులు పెట్టారు. 

గ్రేహౌండ్స్‌లో ఆయన మాటే వేదం కావడంతో.. హౌసింగ్ సొసైటీ సభ్యులెవరు ఆ దరఖాస్తులను ప్రశ్నించే సాహసం చేయలేకపోయారు. మొత్తం 9.2 ఎకరాల్లో వేసిన 48 ప్లాట్లను 48 మంది సభ్యులకు 2003-04లో రిజిస్టర్ చేశారు. అందులో ఉమేష్‌కుమార్ అండ్ ఫ్యామిలీకి ఒక్కొక్కరికి 500 గజాలు చొప్పున 1, 4, 5, 6 నంబర్ ప్లాట్లను కేటాయించారు. ఈ సొసైటీ ద్వారా కేటాయించిన ప్లాట్లకు సంబంధించి హడ్కో నుంచి రుణం తీసుకున్నారు. ఆ తర్వాత కథ మారింది. ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు హెచ్ఎండీఏ స్థల సేకరణ ప్రారంభించింది.
ఈ సేకరణలో... గ్రేహౌండ్స్ హౌసింగ్ సొసైటీలోని 16మంది సభ్యుల ప్లాట్లు పోయాయి. ఆ పదహారు ప్లాట్లలో ఉమేష్‌కుమార్ ఫ్యామిలీకి కేటాయించిన నాలుగూ పోయాయి. దీంతో.. తమకు ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలంటూ ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ బాధ్యతలు నిర్వహిస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆ ఫైల్ చకచకా కదిలింది. ఉమేష్‌కుమార్ ఆయన భార్య అల్కా కాబ్రల దరఖాస్తుకు సంబంధించి శంషాబాద్‌లో 750 గజాలను (ప్లాట్ నంబర్ 294, 293, 306, 305పి), కానుప్రియ కాబ్రకు 400 గజాలు (ప్లాట్ నంబర్ 37), మనీష్‌కు 400 గజాలు (ప్లాట్ నంబర్ 269, 268పి) కేటాయిస్తూ 2010 జూలై 21న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. 

శంషాబాద్ మెయిన్‌రోడ్‌లో పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎంఐజీ కాలనీలోని ఆ ఏడు ప్లాట్ల విలువ ప్రస్తుతం.. అక్షరాలా రూ.35కోట్లు. కాగా..గ్రేహౌండ్స్ హౌసింగ్ సొసైటీకి సంబంధించి సభ్యుల నుంచి అప్పట్లో రూ.98లక్షల దాకా వసూలు చేశారు. అందులో రూ.49లక్షలు లేఅవుట్ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టామని రికార్డుల్లో రాసుకున్నప్పటికీ, ఆ ఖర్చుకు సంబంధించి ఎలాంటి వోచర్లూ లేవు. ఆ సొమ్ము దుర్వినియోగం అయినట్లేననే ఆరోపణలు, అందులో ఉమేష్‌కుమార్ వ్యవహారంపై ఫిర్యాదులు రావడంతో సైబరాబాద్ కమిషనర్ విచారణ నిర్వహించగా అసలుగుట్టు బయటపడిందని సమాచారం. 

ఉమేష్‌కుమార్ తొలి నుంచీ వివాదచరితుడే. ఆయన డీజీపీ కార్యాలయంలో ప్రొవిజన్ అండ్ లాజిస్టిక్ విభాగంలో పనిచేస్తున్నపుడు.. బూట్లు, బుల్లెట్‌ఫ్రూఫ్ జాకెట్లు తదితరాలకొనుగోలులో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ఒక ఎంపీ సంతకాన్ని ఒక జర్నలిస్టు సాయంతో ఫోర్జరీ చేసి డీజీపీ దినేష్‌రెడ్డిపై ఫోర్జరీ లేఖలు కేంద్రానికి పంపించిన ఆరోపణలపై.. ప్రభుత్వం ఆయన్ను గోదావరి వ్యాలీ అథారిటీకి బదిలీ చేసింది. ఇప్పటికే ఉమేష్ కుమార్‌పై నమోదైన కేసు దర్యాప్తును సీఐడీ ముమ్మరం చేసింది. ఇదే సమయంలో గ్రేహౌండ్స్‌లో ఆయన చేతివాటం బయటపడటం సంచలనం సృష్టించింది.

అయితే ఉమేష్ కుమార్ ఇలా చేయ్యటం వెనుక డిజిపీ దినేష్ రెడ్డి పై పగ తీర్చుకోవటానికే చేశాడని తెలుస్తుంది. గతంలో కూడా ఇద్దరికి పడేది కాదట. ఇదంత ఉమేష్ కుమార్ కావాలని బయటకు లాగడాని పోలీసు అధికారులు అంటున్నారు. ఎలాగైన దినేష్ రెడ్డి పరువు తీయ్యలనే ఉద్దేశంతో ఈ పని చేశాడని కొందరు ఉన్నతాధికారులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Comdey actor sunil six pack
Ranbir kapoor touched ex girlfriend deepika padukone s feet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more