1999 సంవత్సరాంతంలో ప్రళయం వస్తుందని భూమ్మీద ఏమీ మిగలదని వచ్చిన పుకార్లకు చాలా మంది భయపడ్డట్టుగానే ఒక మహిళ ఎంతో భయంతో గురువుగారి దగ్గరకు పోయి, "నాకు భయంగా ఉంది, ఏమవుతుందో అని ఆందోళన కలుగుతోంది" అని అంటే ఆ గురువుగారు, "అమ్మా నీకొచ్చిన భయమేమీ లేదు. ఏమీ కాదు" అని అభయమిచ్చారట. 2000 సంవత్సరంలో ఆమె ఎంతో సంతోషంతో గురువుగారిని కలిసి, "స్వామీ మీరు అన్నట్టుగానే ఏమీ కాలేదు" అని అనగా, "అమ్మా ఏమైనా అయ్యుంటే అడగటానికి నువ్వూ జవాబివ్వటానికి నేనూ మిగిలుండేవాళ్ళం కాదు కదా, అదీ నా ధైర్యం" అని అన్నారట.
భాజపా నేతలంతా తమదగ్గరెలాంటి నల్లధనమూ లేదని, విదేశ బ్యాంకుల్లో ఖాతాలేమీ లేవని మామూలుగా ప్రకటన చెయ్యటం కాకుండా లిఖిత పూర్వకంగా పార్లమెంటులో ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మంచిదే. కానీ అలా ఇవ్వని వాళ్ళ దగ్గర నల్లధనమున్నట్టు కాదు కదా! విదేశ బ్యాంకుల్లోని ఖాతాల వివరాలు ఎలాగు బయటపడటం లేదు. ఒకవేళ రేప్పొద్దున అవి బహిర్గతమై అందులో వీళ్ళల్లో ఎవరి పేర్లయినా ఉన్నట్టయితే ఈ రోజు చేసిన హామీ వలన ఆ దోషం పెరగటం కాని తరగటం కానీ ఉండదు కదా! "ఏం లేదని అబద్ధమాడారు కానీ ఉందిగా" అని శిక్షని పెంచుతారా, లేదుకదా.! అందువలన ఈ రోజు చేస్తున్న ప్రకటనలకు, ఇస్తున్న హామీలకు ఏం విలువుంటుందో వాళ్ళకే తెలియాలి.
నేరం చేసానని ఒప్పుకుని లొంగిపోయిన వారికీ, తప్పించుకున్నంత కాలం తప్పించుకుని చివరకు దొరికిపోయిన వారికీ శిక్షలో తేడా ఏముంటుంది? మా దగ్గర నల్లధనమేమీ లేదంటూ నల్లధనం ఉన్నవాళ్ళు కూడా ఇవ్వగలిగిన తరుణంలో ఆ హామీల వలన ఒరిగేదేముంటుందో వాటిని ఇచ్చేవారికే తెలియాలి. కాకపోతే భాజపా తరఫున అద్వానీ చేసిన సద్భావన లేదా చైతన్య యాత్రలో అవినీతిని ఎదుర్కుంటాం అని మాటిచ్చారు కాబట్టి మేము అవినీతికి దూరం అని లిఖితపూర్వకంగా ఇవ్వటంతో ఆ పనికి నాంది పలికినట్టవుతుందని అనుకుంటున్నారేమో!
ఏమైనా, రాజకీయంగా కూడా ఉపయోగపడని ఇటువంటి కార్యక్రమాల వలన రోజులు గడుస్తాయే కానీ ఎటువంటి ప్రయోజనమూ ఎవరికీ ఉండదు!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more