ఉత్తరప్రదేశ్ లో రాజకీయ పోరు సోనియా, మాయావతి వరకే పరిమితంకావడంలేదు. అంతకు మించి ఇద్దరు యువనేతలు ఎన్నికల రణక్షేత్రంలో తమ సత్తాఏమిటో చూపబోతున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దేశ రాజకీయ భవిష్యత్తును నిర్దేశించేవిగా పరిగణిస్తున్న నేపథ్యంలో యూపీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై ఆశలు పెట్టుకుంది. మరో పక్క 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధాని సీట్లో రాహుల్ గాంధీని కూర్చోబెట్టాలని కాంగ్రెస్ అధినాయకత్వం విశ్వప్రయత్నం చేస్తోంది.
అందుకే యువనేత రాహుల్ గాంధీ యూపీలో మరింత జోరుగా అస్త్రశస్త్రాలు సంధిస్తున్నారు. యువనాయకుడు కావడం, తనదైన శైలిలో ఓ ఇమేజ్ సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తుండటంతో ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఇది నిజమే, కాకపోతే ఈ యువనేతకు సమాజ్ వాదీ పార్టీ కి చెందిన యువకిశోరం నుంచే గట్టి పోటీ ఎదురవుతోంది. దీంతో రాహుల్ కు పలుచోట్ల ఎదురీత తప్పడంలేదు. ఇంతకీ రాహుల్ దూకుడుకు అడ్డుకట్ట వేస్తున్న ఆ యువనేత ఎవరు?
ఒకరేమో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన సోనియాగాంధీ కుమారుడు. మరొకరు సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ కుమారుడు. ఉత్తరప్రదేశ్ క్షేత్రం వీరిద్దరికీ కొత్తకాకపోయినా, వారి రాజకీయ భవిష్యత్తు రాబోయే ఎన్నికలే నిర్ధారించబోతున్నాయి. పైగా, రాహుల్ జాతీయ స్థాయినేతగా గుర్తింపుతెచ్చుకోవాలి. ఆ ఇబ్బంది ములాయం కుమారుడైన అఖిలేష్ కు లేదు. లక్ష్యాలు వేరుగా ఉన్నా ఎన్నికల రణక్షేత్రంలో జోరుగా సాగడంలో మాత్రం సారూప్యం కనబడుతోంది.
ఉత్తరప్రదేశ్ లో రాహుల్ వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు. `ఫూల్ పూర్’ లో ఆయన చేపట్టిన ర్యాలీకి జాతీయ మీడియా విస్తృతంగానే కవరేజ్ ఇచ్చింది. అయితే, మరో పక్క అఖిలేష్ సైకిల్ ర్యాలీలకు గానీ, రథ్ యాత్రలకు గానీ అంతటి కవరేజ్ ఇవ్వలేదన్న విమర్శలున్నాయి. అయినప్పటికీ అఖిలేష్ ఎడ్వాంటేజ్ లోనే ఉన్నారని అనుకోవాలి.
తండ్రి ములాయంసింగ్ పూర్తి స్వేచ్ఛనివ్వడంతో అఖిలేష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. సైకిల్ ర్యాలీలు, రథ్ యాత్రలతో ప్రజలకు , మరీ ముఖ్యంగా యువతకు మరింత చేరువ అవుతున్నారు. పార్టీని గాడిలో పెట్టడంలో వ్యూహాత్మకంగా సాగుతున్నారు. ఈ విషయంలో రాహుల్ వెనకబడే ఉన్నారు. యూపీలో కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్థంగానే ఉంది. రాహుల్ వచ్చివెళ్లగానే మళ్ళీ లుకలుకలు బయటపడుతున్నాయి. రాహుల్ తప్ప వేరేవారెవ్వరూ గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. ప్రజలను ఆకట్టుకోలేకపోతున్నారు.
ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ కూడా ప్రతిపక్షం కావడంతో రాహుల్ అధికార పార్టీ అధినేత్రి మాయావతిపైనే తన దృష్టినంతా సారించారు. అయితే, చాపకింద నీరులా అఖిలేష్ బలం పుంజుకుంటున్నారు. ఎన్నికలు అయ్యేదాకా తన రథయాత్ర ఆగదంటూ దుసుకుపోతున్నారు. నిజానికి ఇద్దరు యువనేతలు వాగ్దాటి ఉన్నవారేమీ కాదు. కాకపోతే ప్రజల మధ్య ఎక్కువగా తిరుగుతుండటంతో అఖిలేష్ బలం క్రమేణా పెరుగుతోంది. ముస్లీం ఓటు బ్యాంక్ ను పదిల పర్చుకోవడంలో కూడా అఖిలేష్ ముందంజలోనే ఉన్నారు. మొత్తానికి రెండు యువసింహాలు యూపీ ఎన్నికల రణక్షేత్రంలోకి ఉరికాయి. మరి రాజకీయ భవిష్యత్తు ఎవరెవరికి ఎలా ఉంటుందో చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more