‘Karthikeya 2’ Hindi continues its dream run with 500% profit బాలీవుడ్‌ బాక్సాఫీసు వద్ద కార్తీకేయ 2 సవ్వడి

Karthikeya 2 box office update hindi nikhil siddharth starrer hits the 30 crores mark

Karthikeya 2, Telugu Movie, Nikhil Siddhartha, Anupama Parameshwaran, Anupam kher, Chandu Mondeti, karthikeya, ayan mukerji, raksha bandhan, nagarjuna akkineni, brahmastra, alia bhatt, ranbir kapoor, kaala bhairava, TG Vishwa Prasad, Abhishek Agarwal, OTT Platform, Zee 5, Tollywood, Bollywood, Movies, Entertainment

Karthikeya 2 [Hindi] that allowed some theatre owners to smile in Bollywood. This south dubbed film as it has finally hit the 30 crores milestone during its fifth week. That by itself is a good enough feat as the film has emerged as a theatrical hit. The film success is also ensuring that Karthikeya 3 would be made as well and rest assured

బాలీవుడ్‌లోనూ తగ్గేదేలేదంటున్న కార్తీకేయ 2.. కలెక్షన్లు అదుర్స్..

Posted: 09/16/2022 03:33 PM IST
Karthikeya 2 box office update hindi nikhil siddharth starrer hits the 30 crores mark

యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ హీరోగా న‌టించిన కార్తికేయ 2 మూవీ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్‌లోనూ కలెక్షన‍్లతో అదరగొడుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో ఈ చిత్రం 30 రోజులపైగా ప్రదర్శించబడుతూ రికార్డును క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో కార్తీకేయ-2 ఒకటిగా నిలిచింది. చందు ముండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయకు సీక్వెల్ గా అదే దర్శకుడి రూపకల్పనలో వచ్చిన కార్తికేయ-2 సినీచరిత్రలో అంచనాలను తలకిందుకు చేస్తూ దూసుకుపోతోంది.

హిట్ అవుతుందన్న నమ్మకాన్ని పెట్టుకున్న నిర్మాతలు అంచనాలకు మించి కలెక్షన్లు రాబట్టిందీ చిత్రం. ఈ ఏడాది బాలీవుడ్ లో తెలుగువారు సత్తా చాటుతున్న తరుణంలో ఈ చిత్రంలో నిఖిల్ కూడా బాలీవుడ్ లో తనదైన ముద్రవేసుకున్నాడు. కేవలం నెల రోజుల్లోనే 31 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సినిమా వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా సక్సెస్‌  ఊహించ‌ని రీతిలో డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు లాభాలను తెచ్చిపెట్టింది. బాలీవుడ్‌లో ఈ సినిమా థియేట్రిక‌ల్ బిజినెస్ నాలుగున్న‌ర కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. గతంలో నిఖిల్ బాలీవుడ్ సినిమాలు చేయకపోయినా పెద్దమొత్తంలో కలెక్షన్లు రావడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. నిఖిల్‌ జంటగా అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాతో నటించింది.

ఎలాంటి అంచనాలు లేకుండా ఆగస్ట్‌ 13న విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్‌లో ఊహించని విజయాన్ని అందుకుంది. తెలుగులో దాదాపు అర‌వై కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్లతో విజయాన్ని అందుకుంది. చిన్న సినిమా అయినప్పటికీ అందరి అంచనాలు తలకిందులుగా చేస్తూ ప్రపంచవ్యాప్తంగా 130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. కలియుగ సృష్టి ర‌హ‌స్యాల‌ను పొందుప‌రిచిన కృష్ణుడి కంక‌ణాన్ని దుష్ట శ‌క్తుల నుంచి కాపాడే ఓ యువ‌కుడి క‌థ‌తో  ద‌ర్శ‌కుడు చందూ మొండేటి ఈ సినిమాను తెర‌కెక్కించారు. కీల‌క‌మైన అతిథి పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ ఈ చిత్రంలో కనువిందు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles