ప్రయోగాత్మక కథలను.. నటనకు అస్కారమున్న పాత్రలను అందులోనూ యాక్షన్ సన్నివేశాల్లో నటించే స్కోప్ వున్న చిత్రాలను ఎంచుకోవడంలో విశ్వనటుడు కమల్ హాసన్ ఎప్పుడూ ముందుంటారు. చిత్రం ఎలాంటిదైనా ఆయాపాత్రలలో పరకాయ ప్రవేశం చేసిరా అన్నట్లుగా నటించే కమల్.. ఈ మధ్యకాలంలో యాక్షన్ చిత్రాలకు ప్రాధన్యత ఇస్తున్నారు. అలాంటి ఒక కథతోనే ఆయన త్వరలో ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్నారు. లుక్ పరంగా .. క్యారెక్టరైజేషన్ పరంగా కమల్ కొత్తగా కనిపిస్తున్న ఆ సినిమాయే 'విక్రమ్'. తన సొంత బ్యానర్ పై ఈ సినిమా నిర్మిస్తున్నారు కమల్.
'ఖైదీ' .. ' మాస్టర్' సినిమాలతో మంచి మార్కులు కొట్టేసిన లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు కమల్, విజయ్ సేతుపతి, పహాద్ పసిల్ లాంటి మేటి నటుల కలయికతో అంచనాలు మరింత పెరిగాయి. కాన్సెప్ట్ వీడియోతో ఈసినిమాపై ఆయన ఆ ఆసక్తిని పెంచేశారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ సన్నివేశాలతో కూడిన ట్రైలర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
"అడవి అన్నాక సింహం .. పులి .. చిరుత అన్నీ వేటకి వెళతాయి .. జింక తప్పించుకోవాలని చూస్తుంది. ఆ లోపు సూర్యాస్తమయం అయితే, సూర్యోదయాన్ని చూడబోయేదె వరనేది ప్రకృతి నిర్ణయిస్తుంది.. కానీ ఈ అడవిలో వెలుగు ఎప్పుడు ఎక్కడ అని నిర్ణయించేంది ప్రకృతి కాదు.. నేనే.. అంటూ కమల్ బేస్ వాయిస్లో చెప్పిన డైటాగ్ అదిరిపోయింది. కట్ చేస్తే పహాద్ పసిల్ రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ నాకు లేవు.. మీకుంటే విల్ బి బ్రోకన్ అని డైలాగ్.. ఇక ‘‘ నా సరుకు నాకు దొరికితే మీ గవర్నమెంట్ తో నాకు పనిలేదు’’ అని విజయ్ సేతుపతి డైలాగ్స్ అదిరిపోయాయి. విక్రమ్ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jun 01 | బ్రహ్మాస్త్ర ఫిల్మ్‌కు చెందిన కొత్త అప్డేట్ వచ్చింది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ ఫిల్మ్‌కు చెందిన కొత్త టీజర్‌ను రిలీజ్ చేశారు. ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌తో పాటు ఇతర స్టార్స్ ఉన్న ఆ... Read more
Jun 01 | బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాథ్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. కేకేగా చిరపరిచితమైన ఆయన కోల్‌కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చారు. కేకే పాటలకు స్టెప్పులేసిన అభిమానులు.. ఆ... Read more
May 30 | కరోనా లాక్ డౌన్ లో వాయిద పడ్డ సినిమాలన్ని వరుస పెట్టి విడుదల అవుతున్నాయి. గతేడాది పుష్ప, అఖండ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు ధైర్యాన్ని ఇచ్చాయి. అదే క్రమంలో... Read more
May 30 | ఉప్పెన' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పర్చుకన్న మంగళూరు బ్యూటీ కృతిశెట్టి తన కెరీర్ లోనూ విజయాల పరంపరను సోంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తొలి... Read more
May 30 | యాక్టింగ్‌లోనే కాదు సినిమా ప్రమోషన్లలోనూ తన దారి సపరేటు అని నిరూపించారు ప్రముఖ నటుడు, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు. తాను నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యానని చెప్పిన మహేశ్ బాబు.. త్వరలో విడుదల కానున్న... Read more