నార్త్ అమెరికా తెలుగు సంఘం (నాట్స్) మినీ తెలుగు సంబురాలు వేదికపై సంగీత దర్శకుడు కోటికి జీవిత సాఫల్య అవార్డును ప్రదానం చేశారు. ప్రతీ రెండేళ్లుకో పర్యాయం జరిగే ఈ వేడుకలు.. ఈ ఏడాది కోవిడ్ నేపథ్యంలో కొద్దిమందితో మినీ సంబరాలను నిర్వహిస్తోంది. ఈ సంబరాల్లో తొలి రోజు డల్లాస్‌లోని ఇర్వింగ్లోని టొయోటా మ్యూజిక్ ఫ్యాక్టరీ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు కోటికి జీవన సాఫల్య పురస్కారాన్ని నాట్స్ ప్రదానం చేసింది. తెలుగు సినీ కళాకారులు, గాయకులు తొలిరోజు తమ ప్రతిభా పాటావాలను చూపించి ప్రవాస తెలుగు వారిని అలరించారు.
నాట్స్ తెలుగు మినీ సంబరాల్లో కోటి, సినీ నటులు రవి, మెహ్రీన్, పూజా ఝవేరీ, సియా గౌతమ్ పాల్గొన్నారు. శనివారం ఉదయం 9 గంటలకు జరిగిన కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో రాబోయే రెండేళ్లలో నాట్స్ చేపట్టబోయే పలు కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఏడో అమెరికా తెలుగు సంబరాలు 2023 జూన్ 30 నుంచి జూలై 2 వరకూ న్యూజెర్సీ లోని ఎడిసన్ రారిటన్ కన్వెన్షన్సెంటర్ జరపాలని నిర్ణయించినట్టు బోర్డ్ చైర్ విమెన్ ఆరుణ గంటి ప్రకటించారు. ఏడో అమెరికా తెలుగు సంబరాలకు పాస్ట్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని కన్వీనర్గా వ్యవహరించనున్నారు.
సేవే గమ్యం అనే నాట్స్ నినాదానికి తగ్గట్టుగా ఎప్పటిలాగే తెలుగు వారంతా మరిన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొని ప్రవాస తోటి తెలుగువారికి అవసరమైనప్పుడల్లా సాయం అందిస్తామని నాట్స్ చైర్‌విమెన్ అరుణ గంటి అన్నారు. నాట్స్ అభివృద్ధిలో భాగంగా కొత్త భాగస్వాములను చేర్చుకోవాలంటే అన్ని చాప్టర్లకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాట్స్ అధ్యక్షులు విజయ శేఖర్ అన్నె, చైర్ విమెన్ అరుణ గంటి, బోర్డ్ వైస్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, పాస్ట్ ఛైర్మన్స్ శ్రీధర్ అప్పసాని, డాక్టర్ మధు కొర్రపాటి, వైస్ ప్రెసిడెంట్ బాపునూతి తదితరులు పాల్గోన్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 01 | బ్రహ్మాస్త్ర ఫిల్మ్‌కు చెందిన కొత్త అప్డేట్ వచ్చింది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ ఫిల్మ్‌కు చెందిన కొత్త టీజర్‌ను రిలీజ్ చేశారు. ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌తో పాటు ఇతర స్టార్స్ ఉన్న ఆ... Read more
Jun 01 | బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాథ్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. కేకేగా చిరపరిచితమైన ఆయన కోల్‌కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చారు. కేకే పాటలకు స్టెప్పులేసిన అభిమానులు.. ఆ... Read more
May 30 | కరోనా లాక్ డౌన్ లో వాయిద పడ్డ సినిమాలన్ని వరుస పెట్టి విడుదల అవుతున్నాయి. గతేడాది పుష్ప, అఖండ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు ధైర్యాన్ని ఇచ్చాయి. అదే క్రమంలో... Read more
May 30 | ఉప్పెన' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పర్చుకన్న మంగళూరు బ్యూటీ కృతిశెట్టి తన కెరీర్ లోనూ విజయాల పరంపరను సోంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తొలి... Read more
May 30 | యాక్టింగ్‌లోనే కాదు సినిమా ప్రమోషన్లలోనూ తన దారి సపరేటు అని నిరూపించారు ప్రముఖ నటుడు, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు. తాను నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యానని చెప్పిన మహేశ్ బాబు.. త్వరలో విడుదల కానున్న... Read more