Kodthe video song from Varun Tej's Ghani వరుణ్ తేజ్ ‘గని’ నుంచి తమనా ‘కోడ్తే’ వీడియో సాంగ్ అదుర్స్.!

Kodthe video song from varun tej s ghani tamannaah spectacular dance movements

Ghani, Varun Tej, Saiee Manjrekar, Kodthe Full Video, Tamannaah, Sunil Shetty, Upendra, Naresh, Ghani video song, Naveen Chandra, Nadiya, Satya, Srinivas Reddy, Ghani kodthe full video song, Ghani Trailer, Ghani songs, Ghani Anthem, world of ghani, ghani world, Kiran Korrapati, Thaman, Tollywood, Movies, Entertainment

Makers of Varun Tej-starrer Ghani have released the movie's teaser which is racy from the word go. The teaser gives an adrenaline rush to the audience and sets the expectations on the film on a new high, thanks to Varun Tej's looks and the team's efforts.

వరుణ్ తేజ్ ‘గని’ నుంచి తమనా ‘కోడ్తే’ వీడియో సాంగ్ అదుర్స్.!

Posted: 03/24/2022 03:20 PM IST
Kodthe video song from varun tej s ghani tamannaah spectacular dance movements

టాలీవుడ్ మోగా ప్రిన్స్ హీరో వ‌రుణ్ తేజ్ న‌టిస్తోన్న తాజా ప్రాజెక్టు గ‌ని. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన విషయం తెలిసిందే. ఇప్ప‌టికే మెగాపవర్ స్టార్ రాంచరణ్ చేతుల మీదుగా విడుద‌లైన టీజర్ కు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ సినిమా కోసం త‌న మేకోవ‌ర్‌ను పూర్తి మార్చేశాడు వ‌రుణ్ తేజ్‌. త‌న ఫాలోవ‌ర్ల‌కు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు వ‌రుణ్ తేజ్‌. గ‌ని టీజ‌ర్ తరువాత తాజాగా ఈ చిత్రం నుంచి మేక‌ర్స్ ఓ అదిరిపోయే వీడియో పాటను విడుద‌ల చేశారు.

చిత్రంలో స్పెషల్ అపియరెన్స్ లో వచ్చి మిల్కీ బ్యూటీ తమన్నా.. ఈ చిత్రంలో ఓ పాటలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోడ్తే.. అంటూ సాగే ఈ పాట లిరికల్ సాంగ్ ను ఇదివరకే విడుదల చేసిన చిత్రబృందం.. తాజాగా ఇదే పాటకు సంబంధించిన పూర్తి వీడియో సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. తమన్నా గ్లామర్, డాన్స్ పాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. డాన్సింగ్ క్వీన్ గా అదిరిపోయే మూవ్ మెంట్లతో అదరగోట్టింది హీరోయిన్ తమన్నా. తమన్ సంగీతంలో హారికా నారాయణ్ ఆలపించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. ఈ పాటను కూడా బాక్సింగ్ రింగ్ లో షూట్ చేశారు.   

ఈ చిత్రంలో స‌యీ మంజ్రేక‌ర్ వ‌రుణ్ తేజ్‌కు జోడీగా న‌టిస్తోంది. జీవితంలో బాక్సింగ్ చేయమని తల్లికి ప్రామిస్ చేసిన ఓ పిల్లాడు... తల్లికి తెలియకుండా బాక్సింగ్ ఎందుకు చేశారు? నేషనల్ ఛాంపియన్ కావాలని ఎందుకు అనుకున్నాడు? నేషనల్ ఛాంపియన్ అయిన రోజే తన తల్లికి నిజం తెలియాలని ఎందుకు అనుకున్నాడు? అతని తండ్రి విక్రమాదిత్య ఎవరు? అనేది కథ. ట్రైలర్ లో ఈ విషయాలు చెప్పారు. సునీల్ శెట్టి, ఉపేంద్ర‌, నవీన్ చంద్ర, న‌రేశ్ కీలక పాత్ర‌ల్లో నటించారు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles