Dhanush behind robbery in Nikki Galrani house సినీనటి నిక్కి గిల్రాణి ఇంట్లో చోరీ.. పట్టుబడ్డ ధనుష్ అరెస్ట్.!

Dhanush involved in nikki galrani house robbery arrested for stealing articles

Nikki Galrani, Rs 1.25 lakhs articles, chennai flat, police station, robbery, Dhanush, a 19-year-old house help, Virudachalam, Tirupur, Kollywood, movies, entertainment

Nikki Galrani, who was recently seen in the tamil film Raajavamsam starring Sasikumar, appears to have been abducted of Rs 1.25 lakhs from her chennai flat. On the 11th of January, she went to the police station to report a robbery. She claimed that Dhanush, a 19-year-old house helper who had been employed at her residence was involved and he had been detained by the police.

సినీనటి నిక్కి గిల్రాణి ఇంట్లో చోరీ.. పట్టుబడ్డ ధనుష్ అరెస్ట్.!

Posted: 01/20/2022 12:23 PM IST
Dhanush involved in nikki galrani house robbery arrested for stealing articles

దక్షిణాది చిత్రాలలో నటిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్న నటి నిక్కీ గల్రానీ.. ప్రస్తుతం తమిళ, మలయాళ సినిమాల్లో బిజీగా వుంది. తెలుగులోనూ ‘కృష్ణాష్ణమి’, ‘మలుపు’ వంటి తెలుగు చిత్రాలతో నేరుగా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన ఈ  అందాల తార పలు డబ్బింగ్ సినిమాలతో కూడా మెప్పించింది. కాగా ఇటీవల నిక్కీకి చెందిన దుస్తులు, ఖరీదైన కెమెరాలు చోరీకి గురయ్యాయి. ఈ వస్తువుల విలువ సుమారు రూ.  లక్షకుపైగా ఉంటాయని అంచనా.  కాగా చోరీ జరిగిన రోజు నుంచి  చెన్నై రాయపేటలోని  ఆమె ఇంట్లో పని చేసే ధనుష్ అనే యువకుడు కనిపించకుండా పోయాడు.  దీంతో అతనే ఈ చోరికి పాల్పడి ఉంటాడని భావించిన నిక్కీ ధనుష్ పై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించింది. కాగా ఆమె ఫిర్యాదు అందుకున్న పోలీసులు ధనుష్ కోసం గాలింపు చేపట్టారు.

మరోవైపు తమ కుమారుడు కనిపించడం లేదని ధనుష్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా నిక్కీ ఇంట్లో సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా ధనుషే ఈ చోరికి పాల్పడ్డాడనిన నిర్ధారణ అయింది. ఈ క్రమంలో తిరువూర్ లో స్నేహితుడి ఇంట్లో తలదాచుకున్న నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, అతను దొంగలించిన వస్తువులను  స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం చెన్నై పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. దొంగలించిన దుస్తులు, కెమెరాను నిక్కీ గల్రానీకి అప్పగించారు. అయితే ఇది జరిగిన తర్వాత ధనుష్ పై తన ఫిర్యాదును ఉపసంహరించుకుందీ ముద్దుగుమ్మ. ధనుష్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను కోరింది. తన వస్తువులు తన దగ్గరకు వచ్చాయన్న సంతృప్తి చాలని, ధనుష్ పై ఎలాంటి కోపం లేదని ఆమె పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles