హీరో అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత సినిమాలపై మరింత ఫోకస్ పెట్టింది. వరుస సినిమాలకు సైన్ చేసేస్తూ జోరు చూపిస్తోంది. వివాహ బంధం నుంచి వైదొలిగిన కొన్నాళ్లకే మూడు సినిమాలకు ఒప్పందం చేసుకున్న సామ్.. అటు బాలీవుడ్ సినిమాను కూడా కన్ఫర్మ్ చేసింది. సినిమాలపై సినిమాలతో జోష్ లో వున్న సామ్ తాజాగా హాలీవుడ్ బంపరాఫర్ ను చేజిక్కించుకుంది. ఫిలిప్ జాన్ అనే హాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయనుంది. తిమేరి ఎన్.మురారి రచించిన ‘అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్’ అనే నవల ఆధారంగా.. అదే పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ విషయాన్ని సమంతే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘ఓ కొత్త ప్రపంచం’ అంటూ ఆమె పోస్ట్ పెట్టింది. ‘‘సరికొత్త ప్రపంచం. 2009లో తొలిసారి ‘ఏ మాయ చేసావే’ సినిమా కోసం ఆడిషన్స్ లో పాల్గొన్నా. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆడిషన్స్ లో పాల్గొంటుంటే ఏదో ఆందోళన. ‘డౌన్ టౌన్ యాబీ’ సిరీస్ తో బాఫ్టా అవార్డును గెలిచిన డైరెక్టర్ ఫిలిప్ జాన్ తో హాలీవుడ్ సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నన్ను ఎంపిక చేసినందుకు ఫిలిప్ జాన్ కు కృతజ్ఞతలు. అని సమంత తన సామాజిక మాద్యమంల పేర్కోంది.
ఇంత మంచి అవకాశం ఇచ్చిన సునీత తాటి, గురు ఫిల్మ్స్ కు ధన్యవాదాలు. ఈ జర్నీ చేయడానికి ఎదురుచూస్తున్నా. అని రాసుకోచ్చింది. కాగా అమె పోస్టుకు స్పందించిన ఓ అభిమాని శుభాకాంక్షలు చెప్పగా.. దేశం పేరును నిలబెడతానని ఆమె రిప్లై ఇచ్చింది. కాగా, ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో చాలా బోల్డ్ గా నటించి వేడెక్కించిన సమంత.. ఈ హాలీవుడ్ సినిమా కోసం మరింత హాట్ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే సామంత మరింత బోల్డ్ పాత్రలో నటిస్తోందని సమాచారం. ఏకంగా ఆమె బై సెక్సువల్ పాత్రలో నటించనుందని తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more