Sree Vishnu as NTR fan in Arjuna Phalguna ‘‘కురుక్షేత్రంలో బలైపోడానికి నేను అభిమన్యుడిని కాదు..’’

Sree vishnu s arjuna phalguna teaser promises a hard hitting tale

Arjuna Phalguna, Teaser, Sree Vishnu, Amritha Aiyer, Teja Marni, Priyadarshan Balasubramanian, Anvesh Reddy, Subba Raju, Devi Prasad, Rangasthalam Mahesh, Raj Kumar Kasireddy, tollywood, movies, Entertainment

Tollywood actor Sree Vishnu is back with a different film. Titled 'Arjuna Phalguna,' the film is likely to feature pretty much everything--right from hard-hitting dialogues to action scenes-- that is synonymous with a mass entertainer. Hence, the teaser of the film has left everyone stunned.

‘‘కురుక్షేత్రంలో బలైపోడానికి నేను అభిమన్యుడిని కాదు..’’

Posted: 11/09/2021 07:08 PM IST
Sree vishnu s arjuna phalguna teaser promises a hard hitting tale

యువహీరో శ్రీవిష్ణు విభిన్నకథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. రాజ రాజ చోర లాంటి హిట్ చిత్రాన్ని అందుకున్న తరువాత గాలి సంపత్ చిత్రం ఆయనను కాసింత నిరాశపర్చినా.. తాజాగా ఆయన 'అర్జున ఫాల్గుణ' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ జోనర్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రాని్ని నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాతో తేజ మర్ని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ఈ చిత్రంలో యువహీరో.. నందమూరి తారాకరామారావుకు అభిమానిగా నటిస్తున్నాడు. అమృత అయ్యర్ కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను చిత్రబృందం ఇవాళ రిలీజ్ చేసింది. టీజర్ ప్రారంభంలోనే శ్రీ విష్ణు తనదైన స్టైల్లో డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంది. 'నాది కాని కురుక్షేత్రంలో నాకు తెలియని పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాను. అయినా బలైపోవడానికి నేను అభిమన్యుడిని కాదు .. అర్జునుడిని" అనే డైలాగ్ తో ఈ  టీజర్ మొదలైంది.

ఈ డైలాగ్ ఒక్కటే చాటు సినిమాపై ఆసక్తి పెంచడానికి. అయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీన్స్ అన్ని చిత్రంపై అంచనాలను పెంచేస్తున్నాయి. సినిమాటోగ్రాఫీ కూడా అద్భుతంగా తీసినట్లు యాక్షన్ సీన్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఊరమాస్ పాత్రలో శ్రీవిష్ణు కనిపిస్తున్నాడు. కథ గ్రామీణ ప్రాంతంలోను .. అడవి నేపథ్యంలోను సాగనున్నట్టు అర్థమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ కు హీరో రాణా దగ్గుబాటి ట్వీట్ కూడా బాగా దోహదపడుతోంది. టీజర్ చూడగానే 'అద్దిరిపోయిందిగా .. న్యూ వెరైటీకి సెల్యూట్' అంటూ రానా ట్వీట్ చేయడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles