Sarkaru Vaari Paata out of Sankranthi race సంక్రాంతి బరి నుంచి ‘సర్కారు వారి పాట’ ఔట్..!

Mahesh babu s sarkaru vaari paata release date postponed to summer

Sarkaru Vaari Paata, Sarkaru Vaari Paata sankranti race, Sarkaru Vaari Paata summer race, Sarkaru Vaari Paata release date, Mahesh Babu, Keerthy Suresh, Parasuram, S Thaman, summer Release, Sankranti, Tollywood, Movies, Entertainment

The makers of Mahesh Babu’s Sarkaru Vaari Paata announced to postpone their movie from Sankranthi as RRR coming for the festival season, which needs a massive release. Parasuram directorial venture will hit the screens a day after Ugadi on April 1st and it is the first film announced for release in summer, 2022.

సంక్రాంతి బరి నుంచి మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ ఔట్..!

Posted: 11/03/2021 06:28 PM IST
Mahesh babu s sarkaru vaari paata release date postponed to summer

మ‌హేష్ బాబు-ప‌ర‌శురాం కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం స‌ర్కారు వారి పాట‌ చిత్రం సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తున్న ఈ చిత్రాన్ని ముందుగా జనవరి 13న విడుదల చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ బావించింది. అయితే జనవరి 7న ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల బ్రహ్మాండంగా వుంటాలని భావించిన చిత్ర యూనిత్ సంక్రాంతి బరి నుంచి తప్పుకుని కొత్త విడుదల తేదిని ఖారరు చేసుకుంది.

మైత్రీ మూవీ మేకర్స్ .. 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేయాలని నిర్ణయించిన చిత్ర నిర్మాణ సంస్థలు అందుకు అనుగూణంగా ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేశాయి. ఈ చిత్రంలో విలన్‌గా సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. బ్యాంకుకు సంబంధించిన ఓ భారీ స్కామ్ ను కథగా ఎంపిక చేసుకుని చిత్ర నిర్మాణంలో హీరో మహేశ్ కూడా ఓ నిర్మాతల్లో ఒకరిగా వున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ చిత్ర ఇటీవల దుబాయ్ లో తొలి షెడ్యూల్ షూటింగును తరువాత గోవాలో ఓ షెడ్యూల్ ను కూడా పూర్తిచేసుకుంది.

ఈ రెండు షెడ్యూల్స్ లోను భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. మహేష్ బాబు 2020లో సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. 2021లో ని సర్కారు వారి పాట సినిమా తో రావాలని అనుకున్నాడు కానీ అది కరోనా కారణంగా వర్కవుట్ కాలేదు. 2022 సంక్రాంతి కి సర్కారు వారి పాట సినిమాలు విడుదల చేయాలని ఎంతగానో ప్రణాళికలు రచించినా.. చివరకు ఆర్ఆర్ఆర్ నేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sarkaru Vaari Paata  Mahesh Babu  Keerthy Suresh  Parasuram  S Thaman  summer Release  Sankranti  Tollywood  

Other Articles