Megastar Chiranjeevi gets a Horror Halloween Makeover హాలోవీన్ డే: దెయ్యం మేక్ ఓవర్ తో ఆశ్చర్యపర్చిన మెగాస్టార్

Megastar chiranjeevi gets an interesting halloween makeover but with a twist

Chiranjeevi, Halloween, Megastar Chiranjeevi, Halloween party, Horror Halloween Makeover, Chiranjeevi Halloween, chiranjeevi news, Twitter, Funny Video, Acharya, Koratala Siva, Chiranjeevi funny video, Tollywood, Movies, Entertainment

Halloween is here and celebrities are feeling the spirit of this festival by dressing up as stylish and spooky as possible. Megastar Chiranjeevi also shared a fun video of him on social media as he wished 'Happy Halloween' to his fans.

హాలోవీన్ డే: దెయ్యం మేక్ ఓవర్ తో ఆశ్చర్యపర్చిన మెగాస్టార్

Posted: 11/01/2021 04:40 PM IST
Megastar chiranjeevi gets an interesting halloween makeover but with a twist

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ 1978లో పునాది రాళ్లు చిత్రంలో తెరంగ్రేటం చేసినా.. అంతకన్నా ముందుగానే ప్రాణం ఖరీదు చిత్రం విడుదైన విషయం చాలా మందికి తెలియదు. అయితే నాలుగేళ్ల తొలిదశ ఆయన అనేక చిత్రాల్లో విలన్ క్యారెక్టర్ లో మెరిసారు. తరువాతి మలిదశలో ఆయన హీరోగా నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీసు వద్ద దుమ్మురేపి.. శతదినోత్సవాలు జరుపుకున్న చిత్రాలే. ‘పున్నమి నాగు’ చిత్రం నుంచి ప్రారంభమైన ఆయన విజయపరం.. ఖైదీ చిత్రంతో తెలుగు వెండితెరకు యాక్షన్ హీరోగా మారిపోయాడు.

ఈ క్రమంలో విడులైన ‘దొంగ’ చిత్రంలో ఓ పాటలో హీరోయిన్ రాధను దెయ్యం వేషంతో బయపెట్టేందుకు ఆయన దెయ్యం వేషం వేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తరువాత ఆయన తన కెరీర్ లో ఇప్పటివరకు దెయ్యం వేషాలు వేయలేదు. ఈ సినిమాలో రాధను టీజ్ చేస్తూ ‘గోలీమార్‌.. కాష్మోరా కౌగిలిస్తే ఏం చేస్తావో.. నేపాలీ మంత్రమేస్తే ఏమౌతావో.. ’ అనే పాట గుర్తుండే ఉంటుంది. మైకేల్ జాక్స‌న్ ఆల్బ‌మ్ ను స్ఫూర్తిగా తీసుకుని చిరంజీవి అప్ప‌ట్లో చేసిన ఈ సాంగ్ ఆడియెన్స్‌ను తెగ ఆక‌ట్టుకుంది. అయితే దశాబ్దాల తరువాత మళ్లీ చిరంజీవి దెయ్యం లుక్‌లో క‌నిపించారు.

అయితే దీనికి ఒక ట్విట్ ఉంది. హాలోవీన్ సంద‌ర్భంగా ఆయ‌న వేసిన రియ‌ల్ గెట‌ప్‌. హాలోవీన్ డెను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు తమ అభిమానులకు హాలోవీన్ డే సందేశాలను ఇస్తున్నారు. ఇందులో భాగంగా చిరంజీవి కూడా వినూత్నంగా అలోచించి.. ఓ యాప్ సాయంతో దెయ్యంలా కనిపించేలా చేసి.. ఓ ఆంగ్ల గీతాన్ని పాడుతూ హాలోవీన్ సెలబ్రేష‌న్స్ చేసుకున్నారు. ఆయ‌న త‌న హాలోవీన్ లుక్‌ను వీడియోను ఇన్ స్టాలో పోస్టు చేయగా, దానిని ఆచార్య టీం ట్వీట్టర్ వేదిక పోస్టు చేసింది. అది కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియోతో పాటు ఎగ్జ‌యిట్‌మెంట్ డే అని క్యాప్ష‌న్ పోస్ట్ చేయ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Halloween  Halloween party  chiranjeevi news  Twitter  Funny Video  Acharya  Koratala Siva  Tollywood  

Other Articles