Love Story Official OTT Release Date Is Out ఓటిటీలో నాగచైతన్య-సాయిపల్లవిల ‘లవ్ స్టోరి’.. ఈ నెలలోనే

Love story official ott release date is out

LoveStory, Digital Release, OTT Relese, Aha, Dassera, Diwali, Festive season, Theatrical Trailer, Naga Chaitanya, Sai Pallavi, Sekhar Kammula, Pawan Ch, Narayan Das, Puskur Ram Mohan Rao, Sree Venkateswara Cinemas LLP, Tollywood, movies, Entertainment

Akkineni Naga Chaitanya- Sai Pallavi's latest outing 'Love Story is said to have entered the profit zone. Sekhar kammula's directoral was released in theatres on September 24, 2021. For those who missed watching the movie on the big screen, here's some good news. Love Story is gearing up for digital release on Aha from the 22nd October, as per latest buzz.

ఓటిటీలో నాగచైతన్య-సాయిపల్లవిల ‘లవ్ స్టోరి’.. ఈ నెలలోనే

Posted: 10/11/2021 03:18 PM IST
Love story official ott release date is out

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపోందించిన చిత్రాలన్నింటికీ తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆధరణ లభిస్తుంది. అయితే కరోనా రెండో దశ తరువాత విడుదలైన సినిమాలలో అత్యధికంగా బిజినెస్ చేసి.. లాభాల బాటలో పయనించిన చిత్రాలు మళ్లీ చిత్ర పరిశ్రమకు కొత్త ఊపిరిని పోస్తున్నాయి. కాగా ఈ చిత్రాలలో ఇప్పటివరకు అగ్రస్థానంలో నిలిచింది మాత్రం శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరి చిత్రం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నవయువ సామ్రాట్ నాగ చైతన్య, ఫిదా చిత్రంలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం ఏర్పర్చుకున్న సాయిపల్లవి అద్భుత నటన ఈ చిత్ర విజయానికి బలంగా మారింది.

శేఖర్ కమ్ముల తన కథను అనుకున్నట్లుగానే తెరపై రూపోందించడంలో ఘనాపాటి. లవ్ స్టోరి అని చిత్ర టైటిల్ పెట్టి.. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ను రూపోందించినా.. అందులో ఎమెషన్స్, మెసేజ్ లతో పాటు సామాజిక అంశాలను.. వాటిని వెలుగెత్తి చాటాలన్న ప్రయత్నాలను తెలుగు ప్రేక్షకులు స్వాగతించారు. సెప్టెంబర్ 24న ధియేటర్లలో విడుదలైన ‘లవ్‌స్టోరీ’ ఇక వెండితెరపై చూసేందుకు సుముఖంగా లేని ప్రేక్షకులకు చిత్రబృందం ఓ గుడ్ న్యూస్ ను అందించింది. కరోనా, వర్షాల నేపథ్యంలో థియేటర్లలో ఈ చిత్రాన్ని వీక్షించని వారి కోసం త్వరలోనే ఈ చిత్రం బుల్లితెరలో రానుంది. అంటే ఓటిటిలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.   

ఇప్పటికే ఈ చిత్రం లాబాలబాటలో పయనిస్తోందని వార్తలు వెలువడ్డాయి. కాగా ఈ చిత్ర డిజిటల్ రైట్స్ పోందిన ప్రముఖ తెలుగు ఓటిటీ యాప్ ఆహా ఈ చిత్రం హక్కులను భారీ రేటుకు కొనుగోలు చేసిందని వార్తలోస్తున్నాయి. దీంతో ఈ చిత్రాన్ని డిజిటల్ గా ఈ పండగ నేపథ్యంలోనే విడుదల చేయాలని ఓటిటి యాప్ ప్రయత్నాలను ప్రారంభించినా.. చిత్ర బృందం మాత్రం దసరా పండగ పూరైన వారం రోజుల తరువాత వరకు థియేటర్లలోనే ప్రదర్శించాలని పట్టుబడుతోందని సమాచారం. దీంతో ఈ నెల 22న ఈ చిత్రం ఓటిటీలో విడుదల కానుందని తాజా సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles